బంపర్ ఆఫర్.. రూ.54కే లీటర్ పెట్రోల్.. ఎక్కడంటే?

By

Published : Jun 14, 2022, 4:13 PM IST

thumbnail

అభిమాన నేత పుట్టిన రోజులకు కేక్​లు కట్​ చేయడం, అన్నదానాలు, రక్తదానాలు చేయడం చూశాం. కానీ మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన పార్టీ నాయకులు మాత్రం వినూత్నంగా ఆలోచించారు. తమ నాయకుడు రాజ్​ ఠాక్రే 54వ పుట్టిన రోజు సందర్భంగా మహారాష్ట్ర ఔరంగాబాద్​లోని క్రాంతి చౌక్​ బంక్​లో​ రూ.54కే లీటర్​ పెట్రోల్​ను అందించారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు మంగళవారం ఉదయం ఆరు గంటల నుంచే పెట్రోల్ బంక్​ వద్ద గుమిగూడారు. ప్రస్తుతం పెట్రోల్ ధర రూ.100 దాటిన నేపథ్యంలో ఇలా చేయడం వైరల్ అయింది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.