ETV Bharat / sports

Rinku Singh Birthday : గల్లీ నుంచి గోల్డ్ మెడల్ విన్నర్ దాకా.. రింకూ జర్నీ మీకు తెలుసా?

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 12, 2023, 12:56 PM IST

Rinku Singh Birthday : దేశవాళీ క్రికెట్ నుంచి ఆసియా గేమ్స్​ వరకూ వెళ్లి స్వర్ణాన్ని ముద్దాడాడు టీమ్ఇండియా బ్యాటర్ రింకూ సింగ్. డొమెస్టిక్ క్రికెట్ నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు వెళ్లిన రింకూ జర్నీ తెలుసా?

Rinku Singh Birthday
Rinku Singh Birthday

Rinku Singh Birthday : టీమ్ఇండియా యువ సంచలనం రింకూ సింగ్.. 2023 ఐపీఎల్​లో గుజరాత్​తో జరిగిన మ్యాచ్​తో వెలుగులోకి వచ్చాడు. కోల్​కతా నైట్​రైడర్స్ తరఫున ప్రాతినిధ్యం వహించిన రింకూ.. ఆ మ్యాచ్​ ఛేదనలో వరుసగా 5 సిక్స్​లు బాది.. ఔరా అనిపించాడు. ఆ తర్వాత కూడా ఐపీఎల్​లోనే అనేక మ్యాచ్​ల్లో రాణించి.. తన ఇన్నింగ్స్​ గాలివాటం కాదని నిరూపించుకున్నాడు. అక్టోబర్ 12 గురువారం తన పుట్టినరోజు సందర్భంగా ఐపీఎల్​ నుంచి ఆసియా గేమ్స్​ వరకూ వెళ్లిన రింకూ సక్సెస్​ గురించి తెలుసుకుందాం.

ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన రింకూ.. 2014లో లిస్ట్​ ఏ మ్యాచ్​ ఆడాడు. ఆ మ్యాచ్​లో 83 పరుగులు చేసిన రింకూ.. స్థానికంగా అందరి దృష్టిని ఆకర్షించాడు. తర్వాత 2016లో ఉత్తర్​ప్రదేశ్ తరఫున ఫస్ట్​క్లాస్​ క్రికెట్​లో అరంగేట్రం చేసి.. జట్టులో కీలక ప్లేయర్​గా ఎదిగాడు. ఆ తర్వాత విజయ్ హరారే ట్రోఫీలో త్రిఫురపై 44 బంతుల్లోనే 91 పరుగులు చేశాడు. 2018-19 రంజీ ట్రోఫీలోనూ రాణించి.. 105 సగటుతో 953 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలు, 3 అర్ధ సెంచరీలు ఉన్నాయి. కానీ, ఆ తర్వాత నింబంధనలకు విరుద్ధంగా.. విదేశీ లీగ్​లో ఆడిన కారణంగా రింకూను.. బీసీసీఐ 3 నెలలు సస్పెండ్ చేసింది.

ఐపీఎల్​లో ఇలా.. దేశవాళీ క్రికెట్​లో అదరగొట్టిన రింకూను.. 2017 వేలంలో కింగ్స్​ లెవన్​ పంజాబ్ (ఇప్పుడు.. పంజాబ్ కింగ్స్) రూ.10 లక్షలకు కొనుగోలు చేసింది. కానీ ఆ సీజన్​లో అతడికి బరిలో దిగే అవకాశం రాలేదు. ఆ తర్వాత 2018లో కోల్​కతా నైట్​రైడర్స్.. అతడ్ని ఏకంగా రూ.80 లక్షలకు కొనుగోలు చేసింది. కానీ అప్పుడు కూడా రింకూకు అడపాదడపా ఛాన్స్​లే వచ్చాయి.

లైఫ్ మార్చిన ఇన్నింగ్స్​.. ఈ ఏడాది ఐపీఎల్​లో గుజరాత్ టైటాన్స్​తో మ్యాచ్​లో రింకూయయ ఆఖర్లో బ్యాటింగ్​కు వచ్చాడు. చివరి ఓవర్లో కోల్​కతా విజయానికి 29 పరగులు కావాలి. ఇక కోల్​కతా ఓటమి లాంఛనమే అనుకున్న సమయంలో.. రింకూ అనూహ్యంగా 5 బంతుల్లో వరుసగా 5 సిక్స్​లు బాది గుజరాత్​ నుంచి గెలుపును లాగేసుకున్నాడు. దీంతో ఆ ఒక్క ఇన్నింగ్స్​తోనే రింకూ హీరో అయ్యాడు. ఈ మ్యాచ్​ తర్వాత కూడా అతడు ఇదే జోరు కొనసాగిస్తూ.. 474 పరుగులు చేశాడు.

దీంతో ఐర్లాండ్ పర్యటనకు ఎంపికయ్యాడు. ఈ పర్యటనలో వచ్చిన ఛాన్స్​ను రింకూ.. సద్వినియోగం చేసుకున్నాడు. రెండో టీ20లో 21 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌ల సాయంతో 38 పరుగులు చేసి ప్లేయర్‌ 'ఆఫ్‌ ది మ్యాచ్‌'గా నిలిచాడు. ఈ ఏడాది చైనా హాంగ్జౌ వేదికగా జరిగిన ఆసియా గేమ్స్​కు వెళ్లె టీమ్ఇండియా జట్టులోనూ ఎంపికయ్యాడు. ఈ పోటీల్లో టీమ్ఇండియా గోల్డ్ మెడల్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.

Rinku Singh Ireland Series : అది సిక్సర్​ కింగ్​ రింకు రేంజ్​​.. టీమ్ఇండియాకు నయా ఫినిషర్ దొరికేశాడోచ్​..

Rinku Singh KBC : 'కౌన్​ బనేగా కరోడ్​పతి' షోలో రింకు సింగ్​పై ప్రశ్న.. ప్రైజ్​మనీ ఎంతో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.