ETV Bharat / sports

Rinku Singh Ireland Series : అది సిక్సర్​ కింగ్​ రింకు రేంజ్​​.. టీమ్ఇండియాకు నయా ఫినిషర్ దొరికేశాడోచ్​..

author img

By

Published : Aug 21, 2023, 10:05 AM IST

Rinku Singh Ireland Series : ఐపీఎల్‌ స్టార్‌ రింకూ సింగ్‌ తన అంతర్జాతీయ కెరీర్‌ను అద్భుతంగా ప్రారంభించాడు. ఐర్లాండ్‌తో జరిగిన రెండో టీ20లో సిక్సర్ల మోత మోగించి అందరి దృష్టిని ఆకర్షించాడు. దీంతో రింకు పై ప్రశంజల వర్షం కురుస్తోంది. ఆ విశేషాలు మీ కోసం..

Rinku Singh Ireland Series
రింకూ సింగ్​ ఐర్లాండ్​ సిరీస్

Rinku Singh Ireland Series : ఐపీఎల్​లో అరంగేట్రం చేసి..తన తొలి ఇన్నింగ్స్​లోనే అదరగొట్టాడు టీమ్​ఇండియా బ్యాటర్​ రింకూ సింగ్​. ఐర్లాండ్‌తో జరిగిన తొలి టీ20తోనే అంతర్జాతీయ కెరీర్​ను ప్రారంభించినప్పటికీ.. తొలి మ్యాచ్​లో బ్యాటింగ్‌ చేసే అవకాశం రాలేదు. కానీ రెండో టీ20లో మాత్రం తనకు దక్కిన అవకాశాన్ని అందిపుచ్చుకుని చెలరేగిపోయాడు. స్టేడియం దద్దరిల్లేలా సిక్సర్లను బాదాడు.

Rinku Singh Player Of The Match : ఐదో స్ధానంలో రంగంలోకి దిగిన రింకూ.. ఆడిన 21 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 38 పరుగులు చేసి భారత్‌కు మంచి స్కోర్‌ను అందించాడు. ఆఖరిలో శివమ్​‌ దుబేతో కలిసి ఐర్లాండ్‌ బౌలర్లను చిత్తు చేశాడు. దీంతో ఈ యంగ్​ ప్లేయర్లపై ప్రశంసల జల్లు కురుస్తోంది. టీమ్​ఇండియాకు కొత్త ఫినిషర్‌ దొరికాడంటూ నెట్టింట అభిమానులు రింకూను తెగ ట్రెండ్​ చేస్తున్నారు. ఇక ఇంతటి విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడిన రింకునే 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు వరించింది. దీనిపై సంతోషం వ్యక్తం చేసిన అతను.. ఐపీఎల్​లో ఉన్న అనుభవంతోనే ఇంత బాగా ఆడగలిగానని చెప్పుకొచ్చాడు.

'నేను సాధ్యమైనంత వరకు క్రీజులోనే ఉండాలని అనుకున్నాను. పదేళ్లుగా క్రికెట్ ఆడుతుంటే.. ఇప్పుడే దానికి తగిన ప్రతిఫలం దక్కినట్లు ఫీల్ అవుతున్నాను. అంతర్జాతీయ క్రికెట్‌లో నేను బ్యాటింగ్ చేసిన మొదటి మ్యాచ్‌లోనే 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కడం నాకు చాలా సంతోషంగా ఉంది' అని రింకు చెప్పుకొచ్చాడు.

Rinku Singh IPL 2023 : ఐపీఎల్​లో తమ జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ముందుకొచ్చి ఆదుకున్నాడు రింకూ. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్​లో అయితే చివరి ఓవర్‌లో 5 సిక్సులు బాది అనూహ్య విజయాన్ని అందించాడు. అలా సీజన్​ మొత్తానికి ఫినిషర్‌గా అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. అలా ఐపీఎల్‌లో తన అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్ను రింకూ సింగ్​కు.. సెలక్టర్లు నుంచి పిలుపు వచ్చింది. ఈ క్రమంలో ఈ ఏడాది సీజన్‌లో 14 మ్యాచ్‌లు ఆడిన రింకూ 149.9 స్ట్రైక్‌రేట్‌తో 474 పరుగులు స్కోర్​ చేశాడు. దీంతో చైనా వేదికగా జరగనున్న ఆసియా క్రీడలకు కూడా రింకూను సెలక్టర్లు ఎంపిక చేశారు.

Rinku Singh KBC : 'కౌన్​ బనేగా కరోడ్​పతి' షోలో రింకు సింగ్​పై ప్రశ్న.. ప్రైజ్​మనీ ఎంతో తెలుసా?

అప్పటి నుంచే నన్ను గుర్తుపడుతున్నారు.. ఇక నా ఫోకస్​ అదే : రింకు సింగ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.