ETV Bharat / sitara

చిరు-చరణ్​తో 'కేజీఎఫ్' డైరెక్టర్.. సినిమా గురించేనా?

author img

By

Published : Oct 15, 2021, 6:46 PM IST

మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi family) ఇటీవల ఏర్పాటు చేసిన పార్టీకి స్టార్ డైరెక్టర్ ప్రశాంత్​నీల్(prashanth neel upcoming movies) వచ్చారు. అందుకు సంబంధించిన కొన్ని ఫొటోల్ని పోస్ట్ చేశారు. ఇందులో చరణ్​తో కలిసి ఆయన ఉండటం వల్ల అభిమానులు అప్పుడే సినిమా చేస్తారంటూ గుసగుసలాడేసుకుంటున్నారు.

Ram Charan & Prashanth Neel
రామ్ చరణ్- ప్రశాంత్ నీల్

'కేజీఎఫ్'(kgf 2 release date) లాంటి మాస్ సినిమాతో దేశమొత్తం తనవైపు చూసేలా చేశారు దర్శకుడు ప్రశాంత్ నీల్(prashanth neel movies list). దానికి సీక్వెల్​ తీసిన ఆయన.. ప్రస్తుతం ప్రభాస్​తో యాక్షన్ డ్రామా 'సలార్'(salaar release date) చేస్తున్నారు. ఆ తర్వాత ఎన్టీఆర్​తోనూ సినిమా చేయనున్నారు. ఇప్పుడు ప్రశాంత్​నీల్.. రామ్​చరణ్(ram charan new movie)​-మెగాస్టార్ చిరంజీవిని కలవడం టాక్​ ఆఫ్ ది టాలీవుడ్​ అయింది.

ఈ ఫొటోలు రామ్​చరణ్, ప్రశాంత్​ నీల్.. తమ తమ ట్విట్టర్ ఖాతాల్లో పోస్ట్ చేయడం వల్ల అభిమానుల్లో అంచనాలు పెరిగిపోయాయి. చరణ్​తో నీల్​ సినిమా చేయడం పక్కా అని మాట్లాడేసుకుంటున్నారు. మరి వీరిద్దరూ చిరు ఇంట్లో ఏర్పాటు చేసిన పార్టీలో కలిసినప్పటికీ, భవిష్యత్తులో ఈ కాంబినేషన్​లో సినిమా చూసే అవకాశమైతే లేకపోలేదు. ఒకవేళ వస్తే మాత్రం బాక్సాఫీస్ దగ్గర రికార్డుల మోతే!

Ram Charan & Prashanth Neel team up for pan Indian film
ప్రశాంత్​నీల్​తో రామ్​చరణ్

'ఆర్ఆర్ఆర్'తో(rrr release date) రిలీజ్​కు సిద్ధమైన రామ్​చరణ్(ram charan movies).. శంకర్ దర్శకత్వంలో నటిస్తారు. నవంబరు నుంచి షూటింగ్ మొదలవుతుంది. ఆ తర్వాత 'జెర్సీ' ఫేమ్ డైరెక్టర్​ గౌతమ్ తిన్ననూరితో కలిసి పనిచేస్తారు. యూవీ క్రియేషన్స్​ నిర్మిస్తున్న ఈ చిత్ర ప్రకటన దసరా కానుకగా శుక్రవారం(అక్టోబరు 15) వచ్చింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.