ETV Bharat / entertainment

కల్కి షూటింగ్ కంప్లీట్​​- వాళ్లందరికీ స్పెషల్ గిఫ్ట్స్​- కృష్ణుడి బొమ్మ ఎందుకిచ్చారో? - PRABHAS KALKI

author img

By ETV Bharat Telugu Team

Published : May 26, 2024, 5:06 PM IST

Prabhas Kalki Movie Shooting : ప్రభాస్ కల్కి 2898 ఏడీ మూవీ షూటింగ్ ఎట్టకేలక పూర్తయింది. దీంతో మూవీ యూనిట్ ఇచ్చిన గిఫ్ట్స్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇంతకీ ఆ గిఫ్ట్స్ ఏంటంటే?

Prabhas Kalki Movie
Prabhas Kalki Movie (ETV Bharat)

Prabhas Kalki Movie Shooting : టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా కల్కి 2898 ఏడీ. ఇప్పటికే ఆడియన్స్​లో భారీ అంచనాలు క్రియేట్ చేసిన ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అంతా ఎదురుచూస్తున్నారు. ఇటీవల మేకర్స్ రిలీజ్ చేసిన గ్లింప్స్, బుజ్జి వెహికల్ వీడియోలతో కల్కి మూవీ హాలీవుడ్ రేంజ్​లో ఉండబోతుందని తెలుస్తోంది.

మొత్తానికి షూటింగ్​ కంప్లీట్​!
అయితే ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీ వంటి పలువురు స్టార్ నటీనటులు యాక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ ప్రపంచవ్యాప్తంగా జూన్ 27వ తేదీన విడుదల కానున్న ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తవ్వలేదని వార్తలు వచ్చాయి. తాజాగా ఈ మూవీ షూటింగ్ పూర్తయిందని తెలిసింది. రిలీజ్​కు ఇంకా నెల రోజులు ఉండగా, మూవీ టీమ్​లోని కొందరు సోషల్ మీడియాలో షూటింగ్ కంప్లీట్ అయిందని పోస్టులు పెట్టారు.

అంతే కాదు కల్కి షూటింగ్ పూర్తయినందుకు మూవీ యూనిట్ ఇచ్చిన గిఫ్ట్స్ ఫోటోలు తీసి షేర్ చేశారు. ఈ గిఫ్ట్స్​లో నాగ్ అశ్విన్ బొమ్మతో మీమ్స్ వేసిన సరదా టీ షర్ట్, వెండి కృష్ణుడి బొమ్మ, ఒక చైన్, ప్రేమతో నిర్మాణ సంస్థ నుంచి రాసిన ఒక లెటర్, కల్కి బ్యాడ్జ్ ఒకటి ఇచ్చారు. వీటి ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్​గా మారాయి. ఇక కల్కి సినిమా షూటింగ్ పూర్తవడంతో హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుంటున్నారు అభిమానులు.

అయితే సినిమా షూటింగ్ దాదాపు పూర్తయినప్పటికీ కొన్ని సీన్స్ పెండింగ్‌లో ఉన్నాయని తెలుస్తోంది. తాజాగా ప్యాచ్ వర్క్ సీన్స్ పూర్తి చేసి గుమ్మడికాయ కొట్టేశారు. జూన్ 27న థియేటర్లలోకి రాబోతున్న కల్కి మూవీలో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె నటించింది. సంతోష్ నారాయణ్ సంగీతం అందించారు. రూ.600 కోట్లకుపైగా భారీ బడ్జెట్​తో వైజయంతీ మూవీస్ బ్యానర్​పై సీనియర్ ప్రొడ్యూసర్ అశ్వనీదత్ నిర్మిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.