ETV Bharat / sitara

బన్నీతో ప్రశాంత్​ నీల్ భేటీ-​ ఆ సినిమా కోసమే!

author img

By

Published : Mar 9, 2021, 7:34 PM IST

Updated : Mar 9, 2021, 9:11 PM IST

దర్శకుడు ప్రశాంత్ నీల్​.. హీరో అల్లు అర్జున్​ను తన కార్యాలయంలో కలిశారు. దీంతో ఆయన.. ప్రభాస్​తో తెరకెక్కిస్తున్న 'సలార్'​ పూర్తవ్వగానే బన్నీ​తో తర్వాతి సినిమా చేస్తారన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి.

bunny
బన్నీ

'కేజీఎఫ్'​ దర్శకుడు ప్రశాంత్​ నీల్​-హీరో అల్లుఅర్జున్​ కాంబోలో సినిమా రానుందా? అవుననే తెగ చర్చించుకుంటున్నారు సినీ వర్గాలు, నెటిజన్లు. ఎందుకంటే బన్నీని తన కార్యాలయంలో ప్రశాంత్​ నీల్ కలవడమే ఇందుకు కారణం. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్​గా మారింది. వెంటనే అభిమానులు #A22 పేరుతో ట్రెండ్ చేయడం మొదలుపెట్టేశారు. ఏదేమైనప్పటికీ వీరిద్దరి కాంబోలో సినిమా వస్తుందో లేదో తెలియాలంటే అధికార ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

బన్నీని కలిసిన ప్రశాంత్​ నీల్​

'కేజీఎఫ్'​తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు ప్రశాంత్​ నీల్​. ప్రస్తుతం ఆయన హీరో ప్రభాస్​తో 'సలార్'​ తెరకెక్కించడంలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్​తో ఓ చిత్రం చేయనున్నారంటూ జోరుగా ప్రచారం సాగింది. ఇప్పుడీ జాబితాలో అల్లుఅర్జున్​ చేరిపోయారు.

ప్రస్తుతం బన్నీ.. సుకుమార్​ దర్శకత్వంలో 'పుష్ప' సినిమాతో బిజీగా ఉన్నారు.

bunny
బన్నీ

ఇదీ చూడండి: ప్రభాస్ 'సలార్​' విడుదల తేదీ ఫిక్స్.. రచ్చ రచ్చే

Last Updated : Mar 9, 2021, 9:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.