ETV Bharat / science-and-technology

మీ​ ఫోన్​లో ఈ సీక్రెట్ కోడ్స్​ ఎంటర్ చేస్తే - మీరు ఊహించని సమాచారం వస్తుంది!

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 25, 2023, 4:05 PM IST

Smartphone Secret Codes : దాదాపుగా ప్రతీ ఇంట్లో కనీసం ఒక్కటైనా స్మార్ట్ ఫోన్ ఉంటుంది. కానీ.. ఆ ఫోన్​లో ఉన్న సమాచారం మాత్రం చాలా మందికి తెలియదు. ఇప్పుడు మేం చెబుతున్న ఈ కోడ్స్ గురించి కూడా మాగ్జిమమ్ జనాలకు తెలియదు. మరి మీకు తెలుసేమో ఓ సారి చూడండి.

Smartphone Secret Codes
Smartphone Secret Codes

Mobile Secret Codes : స్మార్ట్ ఫోన్.. మనిషి రోజూవారి జీవితాన్ని మరింత స్మార్ట్​గా మార్చేసిందని చెప్పడంలో సందేహమే లేదు. కాలింగ్ మొదలు బ్రౌజింగ్ దాకా.. బ్యాంకింగ్ నుంచి టికెట్ బుకింగ్ దాకా.. ఒకటా రెండా ఎన్నో సేవలు స్మార్ట్​ఫోన్​ ద్వారా పొందుతున్నాం. అయితే.. చాలా మందికి మొబైల్​లో ఇన్​ బిల్ట్​గా వచ్చే యాప్స్ గురించి పూర్తి సమాచారం తెలియనే తెలియదు. ఇక సెట్టింగ్స్​ లోకి వెళ్తే కొన్ని ఆప్షన్స్​ మినహా.. మిగిలినవి ఎందుకున్నాయో.. వాటితో ఎలాంటి ఉపయోగం ఉంటుందో మెజారిటీ జనానికి తెలియదు.

ఇలా.. మనం నిత్యం వాడే ఫోన్​లో మనకు తెలియని విషయాలు చాలానే ఉన్నాయి. ఈ లిస్టులోకి వచ్చే కొన్ని సీక్రెట్ కోడ్స్(Secret Codes) గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. వీటి ద్వారా.. మీ ఫోన్​లో మీకు తెలియని పలు వివరాలను క్షణాల్లో తెలుసుకోవచ్చు. ఇంతకీ ఆ కోడ్స్ ఏంటి? అన్నది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

వాట్సాప్ మరో నయా ఫీచర్​- ఒకే నంబర్​పై రెండు అకౌంట్స్

  • *#*#4636#*#* అనే కోడ్‌ గురించి మీరెప్పుడైనా విన్నారా? దీన్ని ఎంటర్‌ చేస్తే చాలు.. మీ మొబైల్​కు సంబంధించిన పూర్తి వివరాలను చూపిస్తుంది.
  • ఈ కోడ్‌ ద్వారా మీ ఫోన్ బ్యాటరీ, Wifi ఇన్ఫర్మేషన్‌, మీరు వాడే యాప్స్ ఏంటి? ఏ యాప్ ఎంత సేపు వినియోగించారు? అనే వివరాలు మొత్తం కనిపిస్తాయి.
  • ఒక్కోసారి మనకు తెలియకుండానే.. మనకు రావాల్సిన ఫోన్​ కాల్స్ వేరే నంబర్​కు ఫార్వార్డ్ అవుతుంటాయి. ఈ సమస్య ఎదుర్కొనే వారు *#21# కోడ్‌ సహాయంతో మీ స్మార్ట్ ఫోన్‌లో కాల్స్‌ లేదా మెసేజ్‌లు మరో నెంబర్‌కు ఏమైనా డైవర్ట్ చేశామా లేదా అనే విషయాన్ని ఈజీగా తెలుసుకోవచ్చు.
  • ఒకవేళ మీ ఫోన్​లో కాల్​ ఫార్వర్డ్‌ ఆప్షన్​ యాక్టివేట్​లో ఉంటే ##002# కోడ్‌ ద్వారా డీయాక్టివేట్ చేసుకోవచ్చు.
  • *43# కోడ్‌ సహాయంతో మీ మొబైల్​లో కాల్‌ వెయిటింగ్ సర్వీస్‌ను యాక్టివేట్ చేసుకోవచ్చు. ఈ కోడ్​ను యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మీరు వేరే కాల్​లో ఉన్నప్పుడు ఎవరైనా మీకు కాల్ చేస్తే వెయింట్ వస్తుంది.
  • ఒకవేళ కాల్ వెయిటింగ్​ ఆప్షన్​ను డీయాక్టివేట్ చేసుకోవాలంటే #43# అనే కోడ్‌ని ఎంటర్ చేస్తే సరిపోతుంది.
  • స్మార్ట్​ఫోన్ వాడే చాలా మంది మొబైల్ కొనగానే.. దాని వెంట వచ్చిన బాక్స్​ను పడేస్తుంటారు. ఆ బాక్స్ మీద ఫోన్ IMEI నంబర్ ఉంటుంది. ఎవరైనా ఫోన్ హ్యాక్ చేసినా, దొంగిలించినా, మరేదైనా అవసరం పడినప్పుడు ఆ నంబర్ చాలా కీలకం. ఈ నంబర్​ తెలియని వారు *#06# అనే కోడ్​ని ఎంటర్ చేయడం ద్వారా వెంటనే మీ ఫోన్‌ IMEI నంబర్‌ ఈజీగా తెలుసుకోవచ్చు.

How to Activate Call Forwarding : మీ నంబర్​పై సింపుల్​గా 'కాల్ ఫార్వార్డింగ్' యాక్టివేట్ చేసుకోండిలా.!

Best Smartphone Cleaning Tips : ఈ బెస్ట్ స్మార్ట్​ఫోన్ క్లీనింగ్ టిప్స్ ఫాలో అవ్వండి.. స్క్రీన్, కెమెరా, స్పీకర్ దెబ్బతినకుండా చూసుకోండి.!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.