ETV Bharat / entertainment

సలార్ నుంచి​ సూపర్ అప్డేట్​.. 'కాంతార'ను మించేలా..

author img

By

Published : Oct 18, 2022, 5:10 PM IST

'సలార్'​ సినిమా గురించి ఓ అదిరిపోయే అప్డేట్​ ఇచ్చింది ఈ చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్​. ఏం చెప్పిందంటే..

Salaar movie update
కాంతారను మించేలా సలార్​ క్లైమాక్స్​

సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాలలో ప్రభాస్‌ 'సలార్' ‌ఒకటి. భారీ యాక్షన్​ సన్నివేశాలతో పాన్‌ఇండియా స్థాయిలో రానున్న ఈ సినిమాపై ఫ్యాన్స్​ ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. కేజీయఫ్‌ ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా గురించి తాజాగా ఓ ఆసక్తికర విషయాన్ని చెప్పింది ఈ చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్​. ఓ మీడియా సంస్థతో చిత్ర క్లైమాక్స్‌ గురించి మాట్లాడిండట. ఈ సినిమా పతాక సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయని, కచ్చితంగా ఒక బెంచ్‌ మార్క్‌ను క్రియేట్‌ చేస్తాయని చెప్పనట్లు తెలిసింది.కమర్షియల్‌, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ఐదు భాషల్లో రూపుదిద్దుకుంటుంది. జగపతిబాబు, ఈశ్వరీరావు, శ్రియారెడ్డి తదితరులు కీలకపాత్రలో నటిస్తున్నారు. వచ్చే ఏడాది సెప్టెంబరు 28న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇక ఇటీవలే విడుదలైన హోంబలే ఫిల్మ్స్​ సంస్థ నిర్మించిన 'కాంతార' బాక్సాఫీస్​ ముందు సంచలనం సృష్టించింది. ముఖ్యంగా ఈ సినిమాలోని పతాక సన్నివేశాలు ప్రేక్షకులకు గూస్​బంప్స్​ తెప్పించాయి. వాటిని చూసిన సినీప్రేక్షకులు ఫిదా అయిపోతున్నారు. ఇప్పుడా సీన్స్​ మించేలా సలార్‌ సన్నివేశాలు ఉండబోతున్నాయని ఫ్యాన్స్​ సంబరపడిపోతున్నారు.

ఇదీ చూడండి: Tollywood: ఆ సినిమాలపై వాణిజ్య మండలి కీలక నిర్ణయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.