ETV Bharat / entertainment

Tollywood: ఆ సినిమాలపై వాణిజ్య మండలి కీలక నిర్ణయం

author img

By

Published : Oct 18, 2022, 4:04 PM IST

Tollywood film chamber meeting about small movies
ఆ సినిమాలపై వాణిజ్య మండలి కీలక నిర్ణయం

చిన్న సినిమాలకు సంబంధించి విధి-విధానాలపై కీలక నిర్ణయం తీసుకుంది తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి. ఏంటంటే?

తెలుగు చిత్ర పరిశ్రమలో నెలకొన్న పలు సమస్యల పరిష్కారానికి సినీ పెద్దలు, నిర్మాతల మండలి, ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌లు ఇటీవల కీలక నిర్ణయాలు తీసుకొన్నారు. ఓటీటీలు, వీపీఎఫ్‌ ఛార్జీలు, టికెట్‌ ధరలు, నిర్మాణ వ్యయం ఇలా అనేక విషయాలపై కూలంకషంగా చర్చించి అందుకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తాజాగా చిన్న సినిమాలకు సంబంధించి విధి-విధానాలను ఖరారు చేశారు. రూ.4కోట్ల రూపాయలు బడ్జెట్‌గా ఉన్న దానిని చిన్న సినిమాగా పరిగణించనున్నట్లు తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి తెలిపింది.

చిన్న సినిమా విధి, విధానాలివే!

  • రూ.4కోట్ల రూపాయలు బడ్జెట్‌గా ఉన్న దానిని చిన్న సినిమాగా పరిగణిస్తారు.
  • సినిమా బడ్జెట్‌ కమిటీకి తెలిపేందుకు ఛాంబర్‌ తయారుచేసిన ప్రొఫార్మాలో సదరు సినిమాకు పనిచేసే ముఖ్యమైన టెక్నీషియన్స్‌తో సంతకాలు చేయించి ఎన్నిరోజుల్లో మూవీ పూర్తి చేస్తారో తెలిపాలి. నటీనటులు, సాంకేతిక బృందం పారితోషికాలు.. షూటింగ్‌ ఖర్చులు, తెలపాలి. ఈ బడ్జెట్‌ను నిర్మాతతో పాటు, డైరెక్టర్, మేనేజర్‌ కూర్చొని తయారు చేసి ఇవ్వాలి.
  • సినిమా షూటింగ్‌ ప్రారంభించడానికి 15 రోజుల ముందు దరఖాస్తు చేసుకోవాలి.
  • ఆ దరఖాస్తును ఫిలిం ఛాంబర్‌, ఫిలిం ఫెడరేషన్‌లో ఉన్న సబ్‌ కమిటీ పరిశీలించి నిర్ధారణ చేస్తుంది. దానిని ఫెడరేషన్‌ ఆమోదించి 15శాతం వేతన రాయితీ ఇస్తుంది.
  • చిన్న సినిమాగా ఆమోదించిన తర్వాత ఫెడరేషన్‌ వారు ఆ ప్రొడ్యూసర్‌కి కచ్చితంగా 15శాతం తగ్గించి వేతనాలు తీసుకోవాలి. దానిని ఫెడరేషన్‌ బాధ్యతగా తీసుకొని 15శాతం వేతనాలు అమలు చేయాలి.
  • నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఇచ్చిన బడ్జెట్‌ వివరాలు ఎక్కువ కాకుండా వారిచ్చిన బడ్జెట్‌లోనే నిర్మాణం చేస్తామని సదరు సినిమా నిర్మాత, డైరెక్టర్‌ ఒక అఫిడవిట్‌ను ఫిలిం ఛాంబర్‌కు ఇవ్వాలి. ఒకవేళ ఆ బడ్జెట్‌ ఎక్కువైతే దానికి దర్శకుడు బాధ్యత వహించాలి.
  • కార్మికులు 15శాతం రాయితీని అమలు చేయకపోతే దాని మీద ఏం చేయాలో చర్చించి తగిన నిర్ణయం తీసుకోవాలి.
  • నెలలో 2, 4 మంగళవారం నాడు కమిటీ ఛాంబర్‌లో ఫెడరేషన్‌ నుంచి ఇద్దరు, ఛాంబర్‌ నుంచి ఇద్దరు కూర్చొని చిన్న సినిమాల బడ్జెట్‌ను పరిశీలించి ఆమోదం తెలిపి వారికి లెటర్స్‌ ఇవ్వాల్సి ఉంటుంది.

ఇదీ చూడండి: అల్లుఅర్జున్​-రామ్​చరణ్​ కాంబోలో మల్టీస్టారర్.. టైటిల్ ఫిక్స్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.