ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు @ 9 AM

author img

By

Published : Jun 23, 2022, 8:58 AM IST

TOP NEWS
ప్రధాన వార్తలు

.

  • నేడు ఆత్మకూరు ఉపఎన్నిక.. బరిలో 14 మంది
    Atmakur Bypoll: నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. ఉపఎన్నిక స్వేచ్ఛగా, న్యాయబద్ధంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్ఠ ఏర్పాట్లు చేశామని.. జిల్లా ఎన్నికల అధికారి కె.వి.ఎన్‌.చక్రధర్‌బాబు తెలిపారు. ఈ నెల 26వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • JEE MAINS: నేటి నుంచి జేఈఈ మెయిన్‌ మొదటి విడత పరీక్షలు..
    JEE MAINS: మొదటి విడత జేఈఈ మెయిన్​ పరీక్షలు గురువారం ప్రారంభం కానున్నాయి. ఉదయం 9-12 గంటల వరకు, మధ్యాహ్నం 3-6 గంటల వరకు ఆన్​లైన్​ విధానంలో పరీక్షలు ఉంటాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • గ్రూప్‌-1 ఇంటర్వ్యూ ఫలితాల వెల్లడిపై.. హైకోర్టులో వాదనలు పూర్తి
    HIGH COURT ON GROUP-1: గ్రూప్‌-1 జవాబుపత్రాల మూల్యాంకనంలో భారీగా అవకతవకలు జరిగాయని, అందువల్ల ఇంటర్వ్యూలు నిర్వహించినా వాటి ఫలితాలను ప్రకటించకుండా నిలువరించాలని పలువురు అభ్యర్థులు హైకోర్టులో పిల్ వేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • హామీల 'ఎత్తిపోత'.. జీడిపల్లి ఎగువ పెన్నా పథకంపై నీలినీడలు!
    జీడిపల్లి-ఎగువ పెన్నా (పేరూరు) ఎత్తిపోతల పథకంలో భాగంగా చేపట్టిన జలాశయాల నిర్మాణంపై ముఖ్యమంత్రి, స్థానిక ఎమ్మెల్యే ఇచ్చిన హామీలు శిలాఫలకాలకే పరిమితమయ్యాయి. తమది చేతల ప్రభుత్వమని, చెప్తే చేసి తీరుతామని, రెండేళ్లలో పనులను పూర్తి చేస్తామని 2020 డిసెంబరు 9న నిర్వహించిన బహిరంగ సభలో అనంతపురం జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి హోదాలో బొత్స సత్యనారాయణ సైతం భరోసా ఇచ్చారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది యాత్రికులు దుర్మరణం
    ఉత్తర్​ప్రదేశ్​ పీలీభీత్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 10 మంది మరణించారు. మరో ఏడుగురికి గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గజ్రౌలా పోలీస్​ స్టేషన్​ పరిధిలో.. పికప్​ ట్రక్కు చెట్టును ఢీకొనగా ఈ ప్రమాదం జరిగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • ఈ ఏడాది 7.5 శాతం ఆర్థిక వృద్ధి.. లక్షన్నర కోట్ల డాలర్ల పెట్టుబడులు!
    Narendra Modi BRICS: భారత డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థ విలువ 2025 కల్లా లక్ష కోట్ల డాలర్లకు చేరుతుందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ప్రతిరంగంలో నవకల్పనకు మద్దతిస్తున్నామన్నారు. 'బ్రిక్స్‌ వాణిజ్య వేదిక' సమావేశంలో మోదీ వర్చువల్‌గా ప్రసంగించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • అక్కడ కరోనా కొత్త వేవ్​.. ప్రజలకు ప్రభుత్వం హెచ్చరిక!
    కరోనా మహమ్మారి ఎప్పటికప్పుడు తన రూపాన్ని మార్చుకుంటూ ప్రపంచాన్ని వణికిస్తోంది. తాజాగా కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో తాము కొత్త వేవ్​ను ఎదుర్కొంటున్నట్లు వెల్లడించారు ఫ్రాన్స్​ వ్యాక్సినేషన్​ చీఫ్​ అలైన్​ ఫిషర్​. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • 'బ్యాంకింగ్​ రంగంలో ఇదే అతిపెద్ద స్కామ్'.. డీహెచ్​ఎఫ్​ఎల్​లో​ రూ.34,615 కోట్ల అవినీతి
    DHFL scam: బ్యాంకు మోసానికి సంబంధించి దేవాన్​ హౌసింగ్​ ఫైనాన్స్​ (డీహెచ్​ఎఫ్​ఎల్​) ఆ సంస్థ మాజీ సీఎండీ కపిల్​ వాధ్వాన్​ సహా పలువురిపై సీబీఐ కేసు నమోదు చేసింది. రూ.34,615 కోట్ల కుంభకోణానికి పాల్పడినట్లు అధికారులు వెల్లడించారు. బ్యాంకింగ్​ రంగంలో ఇదే అతిపెద్ద స్కామ్​ అని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • భారత్​-ఇంగ్లాండ్​ సిరీస్​.. అప్పుడేమైందంటే?
    IND VS England Series: ఇంగ్లాండ్​తో సిరీస్​లో భాగంగా గతేడాది కరోనా కారణంగా వాయిదా పడ్డ ఐదో మ్యాచ్​ను ఇప్పుడు ఆడేందుకు టీమ్​ఇండియా సిద్ధమైంది. ఈ నేపథ్యంలో గతేడాది ఆ సిరీస్‌లో ఏం జరిగింది? భారత్‌ ఎలా ఆధిక్యంలోకి వెళ్లింది? ఎవరెలా ఆడారు? విశేషాలను ఓ సారి గుర్తుచేసుకుందాం.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • 'నన్ను వారంతా కిడ్నాపర్​ అనుకొని'.. స్టార్​ డైరెక్టర్​ కామెంట్స్​
    7 Days 6 Nights Director MS Raju: సుమంత్ అశ్విన్‌, మెహర్‌ చాహల్, రోహన్‌, కృతికా శెట్టి ప్రధాన పాత్రలుగా రూపొందించిన చిత్రం '7 డేస్‌ 6 నైట్స్‌'. జూన్‌ 24న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్​లో భాగంగా ఇంటర్వ్యూ ఇచ్చిన చిత్ర దర్శకుడు ఎం. ఎస్‌. రాజు చిత్ర విశేషాలను తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.