ETV Bharat / state

ఈ- ఆఫీస్ వెర్షన్ అప్‌గ్రేడ్ చేయాలని ఎన్ఐసీ ఆదేశం - 14 రాష్ట్రాలకు షెడ్యూలు విడుదల ​ - E Office Update Version

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 15, 2024, 10:43 PM IST

E-Office Web Application Version Update: రాష్ట్రంలో ఈ-ఆఫీస్ వెబ్ అప్లికేషన్ వెర్షన్ సామర్ధ్యం పెంచేందుకు ఇన్ఫర్మాటిక్ సెంటర్ షెడ్యూలు విడుదల చేసిందని ఐటీ శాఖ కార్యదర్శి వెల్లడించారు. పాత వెర్షన్ నుంచి ఈ-ఆఫీస్ తాజా వెర్షన్ 7.xకు అప్ గ్రేడ్ చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. ప్రభుత్వ కార్యకలాపాల్లో సామర్ధ్యం పెంపునకు ఈ- ఆఫీస్ అప్లికేషన్​ను మెరుగుపర్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆయన వెల్లడించారు.

E-Office Web Application Version Update
E-Office Web Application Version Update (ETV Bharat)

E-Office Web Application Version Update : రాష్ట్రంలో ఈ-ఆఫీస్ వెబ్ అప్లికేషన్ వెర్షన్ సామర్ధ్యం పెంచేందుకు నేషనల్ ఇన్ఫర్మాటిక్ సెంటర్ షెడ్యూలు విడుదల చేసిందని ఐటీ శాఖ కార్యదర్శి కోన శశిధర్ వెల్లడించారు. పాత వెర్షన్ నుంచి ఈ-ఆఫీస్ తాజా వెర్షన్ 7.xకు అప్ గ్రేడ్ చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. ప్రభుత్వ కార్యకలాపాలు, సేవలు, సామర్ధ్యం పెంపునకు ఈ-ఆఫీస్ అప్లికేషన్​ను మెరుగుపర్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆయన వెల్లడించారు.

విండోస్ 11 వచ్చేసింది.. కొత్త ఫీచర్లు తెచ్చేసింది!

ఏపీలో మే 17 తేదీ నుంచి 25 తేదీ వరకూ ఈ-ఆఫీస్ అప్లికేషన్​ను అప్ గ్రేడ్ చేసేలా షెడ్యూలు చేశారని స్పష్టం చేశారు. ఆయా తేదీల్లో ఏపీ సహా మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాలతో పాటు కేంద్ర ప్రభుత్వం రంగ సంస్థ సీబీఎస్ఈ కూడా ఈ-ఆఫీస్ వెర్షన్​ను అప్ గ్రేడ్ చేసుకోవాలని తెలిపారు. పాతవెర్షన్​లో తలెత్తిన సాంకేతిక లోపాలను సవరించేలా 7.xకు ఈ-ఆఫీస్ వెర్షన్ రూపోందించారని వెల్లడించారు. తాజా ఈ-ఆఫీస్ వెర్షన్​ను అప్ గ్రేడ్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించిందన్నారు.

'వినియోగదారులారా.. అప్​డేట్​ చేసుకోండి ప్లీజ్'​

మొత్తం 14 రాష్ట్రాలు కొత్త ఈ-ఆఫీస్ వెర్షన్​ను అప్ గ్రేడ్ చేసుకోనున్నట్టు శశిధర్​ వివరించారు. ట్యాంపరింగ్​కు అవకాశం లేకుండా ఎన్ఐసీ కొత్త వెర్షన్ తీసుకువచ్చింది. దీంతో సమాచారాన్ని, ఫైళ్లను ఎన్ క్రిప్టెడ్ ఫార్మాట్​లో నిల్వ చేసే విధంగానే కాకుండా అత్యవసర సమయాల్లో కూడా రికవరీ చేసేందుకు వీలుగా ఈ- ఆఫీస్ వెర్షన్ రూపోందించినట్లు శశిధర్​ వెల్లడించారు. ఫైళ్లను తొలగించటం, మార్పులు చేసేందుకు వీల్లేకుండా కొత్త ఈ- ఆఫీస్ వెర్షన్ సిద్ధం చేశారన్నారు.

గతంలో కూడా ఈ-ఆఫీస్ అప్ గ్రేడ్ చేస్తుండడంతో సచివాలయం సహా రాష్ట్ర వ్యాప్తంగా ఈ-ఆఫీస్ వ్యవస్థ లోని దస్త్రాలు నిలిచిపోయాయి. రెండు దశలుగా ఈ ఆఫీస్ వెర్షన్ ను అప్ గ్రేడ్ చేయాలని నిర్ణయించగా ఇప్పుడున్న 5.6 వెర్షన్ నుంచి 7.xకు ఈ-ఆఫీస్ అప్ గ్రేడ్ కానుంది. ఈ ఆఫీస్ వ్యవస్థ ఆగిపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా దస్త్రాలు నిలిచిపోతాయి.

ప్రభుత్వ కార్యాలయాల్లో నిలిచిన ఫైళ్ల క్లియరెన్స్.. ఈ ఆఫీస్ వెర్షన్ అప్ గ్రేడ్​లో భాగమన్న సర్కార్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.