ETV Bharat / bharat

మైనర్​పై అత్యాచారం.. ఆపై వీడియో తీసి వైరల్​ చేసిన కీచకుడు

author img

By

Published : Apr 16, 2022, 8:14 PM IST

Una minor rape: హిమాచల్​ప్రదేశ్​లో దారుణం జరిగింది. 17 ఏళ్ల మైనర్​పై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కీచకుడు. ఘటనను వీడియోలో రికార్డు చేశాడు. అంతేగాక సామాజిక మాధ్యమాల్లో అప్​లోడ్ చేశాడు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Una minor rape
మైనర్​పై అత్యాచారం

Una minor rape: 17 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు. బాధితురాలిని బెదిరించవచ్చని ఘటనను వీడియోలో రికార్డు చేశాడు. కొన్ని రోజులు తరువాత ఈ వీడియోను సామాజిక మాధ్యమాల్లో అప్​లోడ్ చేశాడు. బాలిక స్నేహితులు విషయాన్ని ఆమెకు తెలిపారు. దీంతో బాధితురాలు జరిగిందంతా కుటుంబ సభ్యులకు తెలిపింది. వెంటనే వారు బంగానా మహిళా పోలీస్​ స్టేషన్​లో నిందితుడిపై ఫిర్యాదు చేశారు. పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటన హిమాచల్​ప్రదేశ్​లోని ఉనాలో జరిగింది.

నిందితుడుకి, మైనర్​కి సోషల్ మీడియాలో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయం ఏర్పడింది. అనంతరం పరిచయం కాస్త స్నేహంగా మారింది. మార్చి 9న నిందితుడు.. బాధితురాలిని బంగానా పట్టణంలో తనను కలవాలని కోరాడు. అతనితో కలిసి ఒక హోటల్‌కు రమ్మని ఆమెను బలవంత పెట్టాడు. ఆ తరువాత ఆమెపై అత్యాచారానికి పాల్పడి రహస్యంగా వీడియో తీశాడు. పోక్సో చట్టం కింద నిందితుడిపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. మరిన్ని ఆధారాలను సేకరించేందుకు హోటల్​లో తనిఖీలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

నాలుగేళ్ల బాలికపై 9 ఏళ్ల బాలుడు: మరో ఘటనలో పొరుగింట్లో ఉంటున్న నాలుగున్నరేళ్ల బాలికపై.. తొమ్మిదేళ్ల బాలుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని ఠాణెలో జరిగింది. విఠల్​వాడి పోలీస్ స్టేషన్​ పరిధిలో మైనర్ తన కుటుంబంతో కలిసి నివసిస్తోంది. తొమ్మిదేళ్ల నిందితుడు ఆమె ఇంటి పక్కనే ఉంటున్నాడు. ఏప్రిల్ 3న ఇంటి వెనుక బాలిక ఆడుకుంటున్న సమయంలో ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. కొన్ని రోజుల తరువాత బాలిక ఆరోగ్యం క్షీణించడం వల్ల ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఏప్రిల్ 15న బాధితురాలి తల్లి విఠల్‌వాడి పోలీస్ స్టేషన్‌లో నిందితుడిపై ఫిర్యాదు చేసింది. పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇదీ చదవండి: ఆర్​ఎస్​ఎస్​ నాయకుడు దారుణ హత్య.. బైక్​పై వచ్చి నరికి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.