ETV Bharat / bharat

ఆర్​ఎస్​ఎస్​ నాయకుడు దారుణ హత్య.. బైక్​పై వచ్చి నరికి..

author img

By

Published : Apr 16, 2022, 4:56 PM IST

RSS leader murder: కేరళలో ఆర్​ఎస్​ఎస్​ నాయకుడ్ని హత్య చేశారు దుండగులు. ఈ ఘటన శనివారం మధ్యాహ్నం జరిగిందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

RSS leader murder
ఆరెస్సెస్ కార్యకర్తను చంపిన దుండగులు

RSS leader murder: ఆర్​ఎస్​ఎస్​ నేతను నరికి చంపారు దుండగులు. ఈ ఘటన కేరళలోని పాలక్కడ్​లో శనివారం మధ్యాహ్నం జరిగింది. ఐదుగురు దుండగులు రెండు బైక్​ల​పై వచ్చి హత్య చేశారని పోలీసులు తెలిపారు. మృతుడ్ని ఆర్ఎస్​ఎస్​ మాజీ షరీక్ శిక్షణ్ ప్రముఖ్​ శ్రీనివాసన్​గా(45) పోలీసులు గుర్తించారు. శ్రీనివాసన్ ఒక్కడే దుకాణంలో ఉన్న సమయంలో ఈ దాడి జరిగిందని వెల్లడించారు. బాధితుడిని వెంటనే ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించినా అప్పటికే ప్రాణాలు కోల్పోయాడని తెలిపారు.

ఈ ఘటనా స్థలానికి సమీపంలోనే 24 గంటలు క్రితం ఓ హత్య జరిగింది. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా నాయకుడు సుబైర్(43) ను నరికి చంపారు దుండగులు. శుక్రవారం మధ్యాహ్నం ఆయన మసీదులో ప్రార్థనలు అనంతరం ఇంటికి తిరిగి వస్తుండగా ఎలపుల్లి వద్ద హత్య చేశారు. మరోవైపు శ్రీనివాసన్ హత్య వెనుక పాపులర్​ ఫ్రంట్ ఆఫ్ ఇండియా తాలుకా రాజకీయ శాఖ అయిన సోషల్​ డెమొక్రటిక్​ పార్టీ ఆఫ్​ ఇండియా(ఎస్​డీపీఐ) ఉందని భాజపా ఆరోపించింది.

ఇదీ చదవండి: ముగ్గురు బాలికలు సహా ఒకే కుటుంబంలో ఐదుగురి హత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.