ETV Bharat / bharat

ఆ 163 మంది శాసనసభ్యులపై నేరాభియోగాలు!

author img

By

Published : Nov 12, 2020, 6:20 AM IST

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థుల్లో మూడింట రెండొంతుల మందిపై క్రిమినల్‌ కేసులు ఉన్నట్లు ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం(ఏడీఆర్) ప్రకటించింది. గెలిచిన 241 మంది అభ్యర్థుల్లో 163 మందిపై నేరాభియోగాలు ఉన్నాయని పేర్కొంది. మొత్తం 81 శాతం మంది అభ్యర్థులు కోటీశ్వరులని తెలిపింది.

criminal cases_bihar polls
బిహార్​పోరు: గెలిచినవారిలో 163 మందిపై నేరాభియోగాలు!

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థుల్లో మూడింట రెండొంతుల మంది నేరచరితులు ఉన్నట్లు ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం(ఏడీఆర్​) ప్రకటించింది. బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గిన 241 మంది అఫిడవిట్లను పరిశీలించి ఈ విషయం వెల్లడించింది.

ఆ సంఖ్య పెరిగింది!

241 మందిలో 163 మందిపై క్రిమినల్‌ కేసులు ఉన్నాయి. గెలిచిన అభ్యర్థుల్లో వీరి వాటా 68 శాతం. వీరిలో 123 మందిపై హత్య, హత్యాయత్నం, కిడ్నాప్‌, మహిళలపై నేరాలు వంటి తీవ్రమైన నేరారోపణలు ఉన్నట్లు ఏడీఆర్ వెల్లడించింది. 9 మందిపై హత్యకు సంబంధించిన కేసులు, 31 మందిపై హత్యాయత్నం కేసులు, 8 మందిపై మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులు ఉన్నాయని పేర్కొంది.

2015 బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఈసారి నేరచరితులసంఖ్య పెరిగినట్లు ఏడీఆర్ తెలిపింది. అప్పట్లో 142 మంది ఎమ్మెల్యేలపై మాత్రమే క్రిమినల్ కేసులు ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య 163కి పెరిగింది.

అర్జేడీలో అధికంగా..

పార్టీల పరంగా నేర చరితుల విషయానికి వస్తే ఆర్జేడీ నుంచి గెలిచిన 74 మందిలో 54 మందిపై క్రిమినల్‌ కేసులు ఉన్నాయి. భాజపా నుంచి గెలిచిన 73 మందిలో 47 మందిపై, జేడీయూ నుంచి గెలిచిన 43 మందిలో 20 మందిపై నేరాభియోగాలు ఉన్నాయి.

కాంగ్రెస్‌ నుంచి గెలిచిన 19 మంది అభ్యర్థుల్లో 16 మంది, సీపీఐ (ఎంఎల్) నుంచి గెలిచిన 12 మందిలో 10 మంది తమపై క్రిమినల్‌ కేసులు ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఇక ఎం​ఐఎం నుంచి గెలిచిన ఐదుగురు అభ్యర్థులపైనా నేరారోపణలు ఉన్నాయని తేలింది.

81 శాతం కోటీశ్వరులే..!

ధనవంతుల విషయానికి వస్తే బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన 241 మందిలో 194 మంది కోటీశ్వరులే. మొత్తం అభ్యర్థుల్లో వీరి శాతం 81. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో 162 మంది మాత్రమే కోటీశ్వరులు ఉన్నారు. బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థుల సగటు ఆస్తి రూ. 4 కోట్ల 32 లక్షలు.

ఇదీ చదవండి:'మూడంచెల చైనా 'ప్రణాళిక'తో భారత్‌కే నష్టం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.