హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు పనితీరుపై ఫ్రాన్స్ రాయబారి ప్రశంస - French Ambassador on Metro

By ETV Bharat Telangana Team

Published : Mar 29, 2024, 7:54 PM IST

thumbnail

French Ambassador Impressed on Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు పనితీరుపై ఫ్రాన్స్ రాయబారి డాక్టర్ తియరీ మాథౌ ప్రశంసలు కురిపించారు. పట్టణ రవాణా వ్యవస్థలో నూతన ఆవిష్కరణ, సాంకేతిక పురోగతికి మెట్రోరైలు చక్కటి ఉదాహరణగా ఆయన పేర్కొన్నారు. ఫ్రాన్స్ ప్రతినిధులతో కలిసి మెట్రో రైల్ ఆపరేషన్స్ కంట్రోల్ సెంటర్​ను సందర్శించిన థియరీ మాథౌకు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, ఎల్​అండ్​టీ ఎండీ కేవీబీ రెడ్డి స్వాగతం పలికారు.  

French Ambassador visits Metro Rail operations Centre : ఈ సందర్భంగా మెట్రో రైలు సౌకర్యాలు, అత్యాధునిక సాంకేతికత సహా ఇతర ముఖ్య వివరాలను మెట్రో ఎండీ ఫ్రాన్స్ రాయబారి బృందానికి వివరించారు. అనంతరం కమ్యునికేషన్ బేస్డ్ ట్రైన్ కంట్రోల్​ను ప్రత్యక్షంగా చూసిన రాయబారి బృందం, దేశంలో అగ్రగ్రామి వ్యవస్థగా ఉన్న సీబీటీసీని హైదరాబాద్ మెట్రో రైలు సజావుగా, సమర్థవంతంగా నిర్వహించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.