ETV Bharat / business

ఫ్లాట్​గా ముగిసిన స్టాక్ మార్కెట్లు - ఇంట్రాడేలో రికార్డ్ పీక్స్​ టచ్​ చేసిన సూచీలు - Stock Market Today

author img

By ETV Bharat Telugu Team

Published : May 27, 2024, 9:37 AM IST

Stock Market Today May 27, 2024 : సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్​ సూచీలు రికార్డ్ పీక్స్​ను టచ్ చేశాయి. కానీ చివరికి ఫ్లాట్​గా ముగిశాయి. సెన్సెక్స్ మొదటిసారిగా 76,000 మార్క్​ను దాటింది.

sensex today
bull market (Getty Images)

Stock Market Close : సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్​గా ముగిశాయి. ఇంట్రాడేలో రికార్డ్ పీక్స్​ను టచ్​ చేసిన సూచీలు, తరువాత క్రమంగా నష్టాల్లోకి జారుకున్నాయి.

బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 19 పాయింట్లు నష్టపోయి 75,390 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 24 పాయింట్లు కోల్పోయి 22,932 వద్ద ముగిసింది.

01.00 PM : సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో దూసుకుపోతున్నాయి. సెన్సెక్స్ మొదటిసారిగా 76,000 మార్క్​ను దాటింది.

ప్రస్తుతం బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 477 పాయింట్లు లాభపడి 75,881 వద్ద ట్రేడ్​ అవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 120 పాయింట్లు వృద్ధిచెంది 23,077 వద్ద కొనసాగుతోంది.

12.00 PM : ప్రస్తుతం బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 415 పాయింట్లు లాభపడి 75,825 వద్ద ట్రేడ్​ అవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 101 పాయింట్లు వృద్ధిచెంది 23,058 వద్ద కొనసాగుతోంది.

11.00 AM : ప్రస్తుతం బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 169 పాయింట్లు లాభపడి 75,579 వద్ద ట్రేడ్​ అవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 32 పాయింట్లు వృద్ధిచెంది 22,989 వద్ద కొనసాగుతోంది.

Stock Market Today May 27, 2024 : సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లు మంచి లాభాలతో ప్రారంభమయ్యాయి. ఎర్లీ ట్రేడ్​లో సెన్సెక్స్, నిఫ్టీలు ఆల్​-టైమ్ హైరికార్డ్​ను క్రాస్ చేశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు వస్తుండడం, లోక్ సభ ఎన్నికల ఫలితాలపై మదుపరులు ఆశావహ దృక్పథంతో ఉండడమే ఇందుకు కారణం.

ప్రస్తుతం బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 168 పాయింట్లు లాభపడి 75,561 వద్ద ట్రేడ్​ అవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 40 పాయింట్లు వృద్ధిచెంది 22,997 వద్ద కొనసాగుతోంది.

  • లాభాల్లో కొనసాగుతున్న స్టాక్స్​ : జేఎస్​డబ్ల్యూ స్టీల్​, ఇండస్​ఇండ్ బ్యాంక్​, టాటా స్టీల్​, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​, భారతీ ఎయిర్​టెల్​, ఎస్​బీఐ
  • నష్టాల్లో ట్రేడవుతున్న షేర్స్​ : ​విప్రో, మారుతి సుజుకి, రిలయన్స్​, ఏసియన్ పెయింట్స్​, పవర్​గ్రిడ్​, టైటాన్​, ఇన్ఫోసిస్​, హెచ్​సీఎల్ టెక్​

విదేశీ పెట్టుబడులు
FIIs Investments : స్టాక్ ఎక్స్ఛేంజ్ డేటా ప్రకారం, శుక్రవారం విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు రూ.944.83 కోట్ల విలువైన ఈక్విటీలను అమ్మేశారు.

ఆసియా మార్కెట్లు
Asian Markets : ఆసియా మార్కెట్లలో సియోల్​, టోక్యో, షాంఘై, హాంకాంగ్​ మార్కెట్లు అన్నీ లాభాల్లో ట్రేడవుతున్నాయి. శుక్రవారం యూఎస్ మార్కెట్లు లాభాల్లో ముగిసిన విషయం తెలిసిందే.

రూపాయి విలువ
Rupee Open May 27, 2024 : అంతర్జాతీయ మార్కెట్​లో రూపాయి విలువ 4 పైసలు పెరిగింది. ప్రస్తుతం డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.06గా ఉంది.

పెట్రోల్, డీజిల్​​ ధరలు!
Petrol And Diesel Prices May 27, 2024 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.107.39గా ఉంది. డీజిల్​ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.108.27గా ఉంది. డీజిల్​ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్​ ధర రూ.87.66గా ఉంది.

ముడిచమురు ధర
Crude Oil Prices May 27, 2024 : అంతర్జాతీయ మార్కెట్​లో ముడిచమురు ధరలు 0.21 శాతం మేర పెరిగాయి. ప్రస్తుతం బ్యారెల్​ క్రూడ్​ ఆయిల్ ధర 82.29 డాలర్లుగా ఉంది.

మీరు బైక్ లవర్సా? ఈ పిచ్చెక్కించే 'కాన్సెప్ట్ బైక్స్'​ను ఎప్పుడైనా చూశారా? - Crazy Concept Bike

పెట్రోల్ బంకు వాళ్లు చీట్​ చేస్తున్నారా? సింపుల్​గా కనిపెట్టి - ఫిర్యాదు చేయండిలా! - Petrol Pump Scams

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.