ETV Bharat / business

మీరు బైక్ లవర్సా? ఈ పిచ్చెక్కించే 'కాన్సెప్ట్ బైక్స్'​ను ఎప్పుడైనా చూశారా? - Crazy Concept Bike

author img

By ETV Bharat Telugu Team

Published : May 26, 2024, 4:05 PM IST

Crazy Concept Bike : మీరు బైక్ లవర్సా? పిచ్చెక్కించే కాన్సెప్ట్​ బైక్స్​ను ఎప్పుడైనా చూశారా? అయితే ఇది మీ కోసమే. ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు విడుదల చేసిన మోస్ట్ క్రేజీయెస్ట్​ మోటార్స్ సైకిల్స్​పై ఓ లుక్కేద్దాం రండి.

top 10 Crazy Concept bike
Crazy Concept Motorcycles of the world (Etv Bharat)

Crazy Concept Bike : మనం సాధారణంగా మంచి మైలేజ్ ఇచ్చే బైక్​లు కొనాలని అనుకుంటాం. కుర్రకారు అయితే మంచి స్పోర్ట్స్ బైక్ కొనాలని ఆశపడుతూ ఉంటారు. కానీ మీరు కాన్సెప్ట్ బైక్స్ గురించి ఎప్పుడైనా విన్నారా? వీటినే కొందరు షో బైక్స్ అని, ఫ్యూచర్ బైక్స్ అని కూడా అంటారు. మరి ఈ క్రేజీ బైక్స్ గురించి మనమూ తెలుసుకుందామా?

1. Suzuki Falcorustyco
1985 టోక్యో మోటార్ షోలో మొదటిసారిగా 'సుజుకి ఫాల్కోరస్టీకో' బైక్​ను ప్రదర్శించారు. ఆధునిక యుగంలో బాగా గుర్తుండిపోయే, మొదటి కాన్సెప్ట్ బైక్ ఇదే అని చెప్పుకోవచ్చు. స్క్వేర్-ఫోర్​ ఫోర్​-స్ట్రోక్​, త్రీ క్యామ్స్​, హైడ్రాలిక్ డ్రైవ్​, సెంటర్ స్ట్రీరింగ్​తో దీనిని డిజైన్ చేశారు.

2. Suzuki GSX1000 Katana
సుజుకి కంపెనీ 1982లో 'జీఎస్​ఎక్స్​ 1000 కతానా' బైక్​ను లాంఛ్ చేసింది. హై-స్పీడ్ స్టెబిలిటీ, ఏరోడైనమిక్స్​ ఫీచర్స్​తో దీనిని మాజీ బీఎండబ్ల్యూ చీఫ్ డిజైనర్​ హన్స్ ముత్​ రూపొందించారు. సుజుకి కంపెనీ తెచ్చిన బెస్ట్ కాన్సెప్ట్ కారు ఇదే అని చెప్పవచ్చు.

3. Suzuki Nuda
సుజుకి కంపెనీ 1986 టోక్యో షోలో 'న్యూడా' బైక్​ను పరిచయం చేసింది. ఈ బైక్​లో GSX-R750 బైక్​లో వాడిన ఇంజిన్​నే వాడారు. సుజుకి టోటల్ ఇంజిన్ కంట్రోల్ సిస్టమ్​తో, టూ-వీల్ షాఫ్ట్ డ్రైవ్​, హబ్​-సెంటర్ స్టీరింగ్​తో దీనిని రూపొందించారు.

4. Harley-Davidson Café Racer Concept
హార్లే-డేవిడ్సన్ కేఫే రేసర్ కాన్సెప్ట్​ బైక్​ను 85 కొలోన్​ షోలో ప్రదర్శించారు. మంచి స్పోర్ట్​స్టర్ కాన్సెప్ట్ బైక్ ఇది​. అప్పటి కాలంతో పోలిస్తే, ఇది మోస్ట్ అడ్వాన్స్​డ్ టూ-వీలర్ అని చెప్పుకోవచ్చు.

5. Craig Vetter's KZ1000 Mystery Ship
క్రెయిగ్ వెటర్ కంపెనీకి చెందిన ఈ KZ1000 మిస్టరీ షిప్​ ఒక బెస్ట్ కాన్సెప్ట్ బైక్​. మంచి స్టైలిష్ లుక్​తో దీనిని తీసుకువచ్చారు. విండ్ ప్రొటక్షన్​ కాన్సెప్ట్​తో తీసుకువచ్చిన మొదటి బైక్ ఇదే. కానీ తరువాత దీని ప్రొడక్షన్ పూర్తిగా ఆపేశారు.

6. BMW Futuro
1980లో బీఎండబ్ల్యూ ఫ్యూచరో​ ఒక మంచి కాన్సెప్ట్ బైక్. ఇది టర్బోఛార్జ్​డ్​ బాక్సర్ ట్విన్ నుంచి పవర్ పొందుతుంది. దీని ట్రంక్ చాలా వెరైటీగా ఉంటుంది. దీనినే కాస్త మోడిఫై చేసి, తరువాత కాలంలో హోండా కంపెనీ వాడుకుంది.

7. Yamaha GTS1000
యమహా కంపెనీ తీసుకువచ్చిన బెస్ట్ కాన్సెప్ట్ బైక్ ఈ GTS1000. ఇది చాలా లావుగా ఉంటుంది. కనుక సాధారణ డ్రైవర్లు దీనిని నడపలేరు. పైగా ఇది చాలా ఎక్స్​పెన్సివ్​.

8. Honda NR750
హోండా కంపెనీ విడుదల చేసిన ఫ్యూచరిస్టిక్ బైక్ ఇది. ఇందులో ఫోర్​-సిలిండర్ 500సీసీ పెట్రోల్​ ఇంజిన్​ను అమర్చారు. అప్పట్లోనే దీనిని చాలా హై​-టెక్ డిజైన్​తో రూపొందించారు.

మంచి స్పోర్ట్స్​ బైక్ కొనాలా? రూ.2 లక్షల బడ్జెట్లోని టాప్​-5 ఆప్షన్స్​ ఇవే! - Best Sports Bike

నో స్కిడ్డింగ్, టైర్లకు ఫుల్ గ్రిప్- ట్రాక్షన్ కంట్రోల్ ఫీచర్​తో టాప్​-5 కార్స్ ఇవే- బడ్జెట్ రూ.10లక్షలే! - Cars With Traction Control

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.