ETV Bharat / business

నో స్కిడ్డింగ్, టైర్లకు ఫుల్ గ్రిప్- ట్రాక్షన్ కంట్రోల్ ఫీచర్​తో టాప్​-5 కార్స్ ఇవే- బడ్జెట్ రూ.10లక్షలే! - Cars With Traction Control

author img

By ETV Bharat Telugu Team

Published : May 24, 2024, 3:16 PM IST

Updated : May 24, 2024, 4:46 PM IST

Best Cars With Traction Control : మీరు మంచి కారు కొనాలని అనుకుంటున్నారా? బురద, ఇసుక, గులకరాళ్లు, నీళ్లు, మంచు లాంటి జారుడు ప్రదేశాల్లో మీరు డ్రైవ్ చేస్తుంటారా? అయితే ఇది మీకోసమే. మంచి ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ (TCS) ఉన్న టాప్​-5 బడ్జెట్​ ఫ్రెండ్లీ కార్లు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

top 5 cars with TCS
Best Cars With Traction Control (ETV Bharat)

Best Cars With Traction Control : కొత్తగా కారు కొనాలని అనుకునేవారు మంచి ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్​ (టీసీఎస్​) ఉన్న వెహికల్ కొనుక్కోవడం మంచిది. ఈ టీసీఎస్​ అనేది రోడ్డుకు, టైర్​కు మధ్య మంచి గ్రిప్​ ఉండేలా చేస్తుంది. కనుక బురద, ఇసుక, గులకరాళ్లు, నీళ్లు, మంచు లాంటి జారే స్వభావం ఉన్న రోడ్లపై కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా డ్రైవ్ చేయడానికి వీలవుతుంది. ఒకవేళ టైర్​కు రోడ్డుకు మధ్య సరైన ట్రాక్షన్ లేకపోతే, కారు బ్యాలెన్స్​ తప్పిపోయే ప్రమాదం ఉంటుంది. ఎలా అంటే? ఉదాహరణకు మీ కారు బురదలో ఇరుక్కున్నప్పుడు యాక్సిలేటర్ పెంచుతారు. అప్పుడు బురదలో ఉన్న టైర్​ మిగతా టైర్ల కంటే వేగంగా స్పిన్ అవుతుంది. కానీ బండి ముందుకు వెళ్లదు. ఇలాంటప్పుడు మీ కారులో ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ కనుక ఉంటే, అది బురదలో ఉన్న టైర్​ ఓవర్​స్పిన్ కాకుండా పార్శియల్ బ్రేక్స్ వేస్తుంది. దీనివల్ల గ్రిప్​ పెరిగి కారు ముందుకు వెళుతుంది. అందుకే ఈ ఆర్టికల్​లో మంచి ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ ఉన్న బడ్జెట్​ ఫ్రెండ్లీ కార్ల గురించి తెలుసుకుందాం.

1. Renault Kwid : ఇండియాలో లభిస్తున్న బెస్ట్​ అఫర్డబుల్ కార్లలో రెనో క్విడ్ ఒకటి. దీనిలో స్టాండర్డ్​గా ట్రాక్షన్ కంట్రోల్​ సిస్టమ్ ఉంటుంది. కనుక ఎలాంటి జారుడు ప్రదేశంలో అయినా చాలా ఈజీగా ఈ కారును నడపవచ్చు. ఈ రెనో కారులో 1.0 లీటర్​ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 68 బీహెచ్​పీ పవర్​, 91 ఎన్​ఎం టార్క్ జనరేట్ చేస్తుంది. మార్కెట్లో ఈ రెనో క్విడ్ కారు ధర సుమారుగా రూ.4.70 లక్షలు - రూ.6.45 లక్షలు (ఎక్స్​-షోరూం) ఉంటుంది.

2. Hyundai Grand i10 Nios : హ్యుందాయ్ కంపెనీకి చెందిన ఈ గ్రాండ్ ఐ10 నియోస్​లో బోలెడు సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. అందులో ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ కూడా ఒకటి. ఈ కారులో 1.2 లీటర్​ పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఇది 83 బీహెచ్​పీ పవర్​, 114 ఎన్ఎం టార్క్ ప్రొడ్యూస్​ చేస్తుంది. మార్కెట్లో ఈ హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్​ ధర సుమారుగా రూ.5.92 లక్షలు - రూ.8.56 లక్షలు (ఎక్స్​-షోరూం) ఉంటుంది.

3. Tata Tiago : టాటా టియాగో కారులో స్టాండర్డ్​గా ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్​ ఉంటుంది. దీనిని టాటా కంపెనీ కార్నరింగ్ స్టెబిలిటీ కంట్రోల్ అని చెబుతూ మార్కెటింగ్ చేస్తోంది. ఈ కారులో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 86 బీహెచ్​పీ పవర్​, 113 ఎన్​ఎం టార్క్​ ఉత్పత్తి చేస్తుంది. మార్కెట్లో ఈ టాటా టియాగో కారు ధర సుమారుగా రూ.5.65 లక్షలు - రూ.8.90 లక్షలు (ఎక్స్​-షోరూం) ఉంటుంది.

4. Hyundai Exter : భారతదేశంలోని మోస్ట్ పాపులర్ కాంపాక్ట్​ ఎస్​యూవీల్లో హ్యుందాయ్ ఎక్స్​టర్ ఒకటి. దీనిలో స్టాండర్డ్​ సేఫ్టీ ఫీచర్​గా ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ ఉంటుంది. ఈ కారులో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 83 బీహెచ్​పీ పవర్​, 114 ఎన్​ఎం టార్క్ విడుదల చేస్తుంది. ​మార్కెట్లో ఈ హ్యుందాయ్ ఎక్స్​టర్ కారు ధర సుమారుగా రూ.6.13 లక్షలు - రూ.10.28 లక్షలు (ఎక్స్​-షోరూం) ఉంటుంది.

5. Tata Punch : భారతదేశంలో లభిస్తున్న బెస్ట్​ బడ్జెట్ ఫ్రెండ్లీ కార్లలో టాటా పంచ్ ఒకటి. దీని బాడీ చాలా స్ట్రాంగ్​గా ఉంటుంది. దీనిలో బోలెడు సేఫ్టీ ఫీచర్లు ఉంటాయి. వాటిలో ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ కూడా స్టాండర్డ్​గా ఉంటుంది. ఈ మైక్రో-ఎస్​యూవీ కారులో 1.2 లీటర్​ పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఇది 88 బీహెచ్​పీ పవర్​, 115 ఎన్ఎం టార్క్​ జనరేట్ చేస్తుంది. మార్కెట్లో ఈ టాటా పంచ్ కారు ధర సుమారుగా రూ.6.13 లక్షలు - రూ.10.20 లక్షలు (ఎక్స్​-షోరూం) ఉంటుంది.

లాంఛ్​కు బజాజ్​ CNG బైక్ రెడీ- తక్కువ ధర, పవర్​ఫుల్ ఇంజిన్, స్టైలిష్ లుక్! - Bajaj Bruzer CNG Bike Launch

మంచి ఎలక్ట్రిక్ కార్ కొనాలా? టాప్​-5 మోస్ట్ అఫర్డబుల్ e-SUVలు ఇవే! - Most Affordable Electric Cars

Last Updated : May 24, 2024, 4:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.