ETV Bharat / business

మంచి ఎలక్ట్రిక్ కార్ కొనాలా? టాప్​-5 మోస్ట్ అఫర్డబుల్ e-SUVలు ఇవే! - Most Affordable Electric Cars

author img

By ETV Bharat Telugu Team

Published : May 20, 2024, 5:13 PM IST

Most Affordable Electric Cars : మీరు మంచి ఎలక్ట్రిక్ కారు కొనాలని అనుకుంటున్నారా? అందులోనూ ఎస్​యూవీ అయితే బాగుంటుందని భావిస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. ప్రస్తుతం మార్కెట్లో అఫర్డబుల్​ ప్రైజెస్​లో మంచి ఎలక్ట్రిక్ వెహికల్స్ చాలానే అందుబాటులో ఉన్నాయి. వాటిలోని టాప్​-5 ఎలక్ట్రిక్ ఎస్​యూవీల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

TOP 5 Affordable Electric Cars
Most Affordable Electric Cars (ETV Bharat)

Most Affordable Electric Cars : పెట్రోల్​, డీజిల్ ధరలు భారీగా పెరిగిపోతున్న నేటి కాలంలో సాధారణ ప్రజలు కారును మెయింటైన్ చేయడం చాలా కష్టమైపోతోంది. అందుకే వీటికి ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్​ వెహికల్స్​పై చాలా మంది మొగ్గు చూపుతున్నారు. దీని వల్ల కార్ రన్నింగ్​ కాస్ట్​లు బాగా తగ్గుతాయి. ప్రస్తుతానికి అయితే మన దేశంలో కార్ ఛార్జింగ్ పాయింట్లు చాలా తక్కువగా ఉన్నాయి. కానీ భవిష్యత్​లో ఈ పరిస్థితి కచ్చితంగా మారుతుంది. అప్పుడు ఎలక్ట్రిక్ కార్లు కచ్చితంగా ఫస్ట్ ఛాయిస్ అవుతాయి. మరి మీరు కూడా మంచి ఎలక్ట్రిక్ కారు కొనాలని అనుకుంటున్నారా? మరెందుకు ఆలస్యం టాప్​-5 మోస్ట్ ఆఫర్డబుల్​ ఎలక్ట్రిక్ కార్ల గురించి తెలుసుకుందాం రండి.

5. MG Comet EV : సిటీల్లో ప్రయాణించడానికి ఎంజీ కామెట్ ఈవీ చాలా అనువుగా ఉంటుంది. ఇది చూడడానికి చాలా చిన్నగా, ఆకర్షణీయంగా ఉంటుంది. క్యాబిన్ చాలా బాగుంటుంది. స్టోరేజ్ (బూట్) స్పేస్​ మాత్రం కొంచెం ఇరుకుగా ఉంటుంది. దీనిలో స్మాల్​ బ్యాటరీలు ఉంటాయి. కనుక డ్రైవింగ్ రేంజ్ కాస్త తక్కువగానే ఉంటుంది. కానీ సిటీ రోడ్లపై ప్రయాణించడానికి ఈ ఎలక్ట్రిక్ కార్ చాలా అనువుగా ఉంటుంది. మార్కెట్లో ఈ ఎంజీ కామెట్ ఈవీ ధర సుమారుగా రూ.6.99 లక్షలు నుంచి రూ.9.14 లక్షల వరకు ఉంటుంది.

4. Tata Tiago EV : టాటా టియాగో కారులో మంచి పవర్​ట్రైన్​ ఉంది. కనుక దీనిపై పట్టణాల్లో చాలా హాయిగా ప్రయాణించవచ్చు. ఇది వాల్యూ ఫర్ మనీ వెహికల్ అని చెప్పవచ్చు. అంటే తక్కువ ధరలో లభిస్తున్న మంచి ఎంట్రీ లెవెల్ ఎలక్ట్రిక్ కారు ఇదని చెప్పుకోవచ్చు. ఈ వెహికల్ ఇంటీరియర్ చాలా బాగుంటుంది. మార్కెట్లో ఈ టాటా ఈవీ కారు ధర సుమారుగా రూ.7.99 లక్షల నుంచి రూ.11.89 లక్షలు ఉంటుంది.

3. Citroen eC3 : ఈ సిట్రోయెన్ ఈసీ3 కారు కొంచెం బాక్సీగా, నిటారుగా ఉంటుంది. కనుక కారు లోపల నలుగురు కూర్చోవడానికి చాలా కంఫర్ట్​గా ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్​ కారుతో సౌకర్యవంతంగా రైడ్ చేయవచ్చు. దీని ధర కాస్త ఎక్కువనే చెప్పవచ్చు. మార్కెట్లో ఈ సిట్రోయెన్ ఈసీ3 కారు ధర సుమారుగా రూ.11.61 లక్షల నుంచి రూ.13.35 లక్షలు ఉంటుంది.

2. Tata Tigor EV : టాటా టియాగో ఈవీతో పోల్చితే, ఈ టిగోర్ కార్​లో విశాలమైన బూట్​ స్పేస్ ఉంటుంది. పైగా దీనిలో పెద్ద బ్యాటరీ కూడా ఉంది. పవర్​ట్రైన్ కెపాసిటీ కూడా సూపర్​గా ఉంటుంది. కనుక డ్రైవింగ్ రేంజ్, పెర్ఫార్మెన్స్​​ చాలా బాగుంటాయి. దీని క్యాబిన్​ కూడా విశాలంగా, సౌకర్యవంతంగా ఉంటుంది. మార్కెట్లో ఈ టాటా టిగోర్ ఈవీ ధర సుమారుగా రూ.12.49 లక్షల నుంచి రూ.13.75 లక్షలు ఉంటుంది.

1. Tata Punch EV : ఎలక్ట్రిక్ కార్లలో ది బెస్ట్ ఏదంటే టాటా పంచ్ ఈవీ అని చెప్పుకోవచ్చు. ఇది మంచి పెర్ఫార్మెన్స్​, అద్భుతమైన రైడింగ్ ఎక్స్​పీరియెన్స్​ను ఇస్తుంది. ట్రైవింగ్ రేంజ్​ కూడా మిగతా వాటితో పోలిస్తే ఎక్కువగా ఉంటుంది. దీని గ్రౌండ్ క్లియరెన్స్​ 190 మి.మీ. కనుక పట్టణాల్లో మాత్రమే కాదు, సాధారణ రోడ్లపై కూడా ప్రయాణించవచ్చు. అయితే దీనిలో వెనుక సీట్లు కాస్త ఇరుకుగా ఉంటాయి. మార్కెట్లో ఈ టాటా పంచ్ ఈవీ కారు ధర సుమారుగా రూ.10.99 లక్షల నుంచి రూ.15.49 లక్షలు ఉంటుంది.

కియా కార్ లీజింగ్​ షురూ - హైదరాబాద్ సహా 6 నగరాల్లో సర్వీస్​! - Kia Leasing Program

గతుకుల రోడ్లపైనా ప్రయాణం సాఫీగా జరగాలా? ఈ టాప్​-10 సస్పెన్షన్​ కార్లపై ఓ లుక్కేయండి! - Best Suspension Cars

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.