పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు ఎలా వేస్తారో తెలుసా? - ఫస్ట్​ టైమ్​ ఓటర్లు ఈ వీడియో చూసేయండి - How to Vote for MLC Election

By ETV Bharat Telangana Team

Published : May 26, 2024, 4:09 PM IST

Updated : May 26, 2024, 4:35 PM IST

thumbnail
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటెలా వేయాలో తెలుసా? (ETV Bharat)

How to Vote for Graduate MLC Election 2024 : సాధారణ ఎన్నికల్లో బరిలో నిలిచిన అభ్యర్థుల్లో ఒక్కరికి మాత్రమే ఓటు వేస్తాం. కానీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటరు ఎంతమందికైనా ఓటేసే అవకాశం ఉంటుంది. ఓటర్లు ఇచ్చే ప్రాధాన్యతా నంబర్లే గెలుపోటములను నిర్ణయిస్తుంది. ఇది ప్రాధాన్య క్రమంలో ఓటేసే పద్ధతి. 2021లో జరిగిన వరంగల్‌-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 21,636 ఓట్లు చెల్లనవిగా అధికారులు గుర్తించారు. ప్రస్తుతం జరగనున్న ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఎలాంటి పొరపాట్లు జరగకుండా ఉండాలని అధికారులు భావించారు. అందులో భాగంగా ఎమ్మెల్సీ ఎన్నికలో ఓటు వినియోగంపై అవగాహన కల్పిస్తున్నారు.

2021లో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి పల్లా రాజేశ్వర్‌ రెడ్డి గెలిచారు. అనంతరం 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి ఎమ్మెల్యేగా బరిలో నిలిచి గెలుపొందారు. దీంతో వరంగల్‌-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక అనివార్యం అయింది. సోమవారం ఎన్నిక పోలింగ్‌ జరగనుంది. జూన్‌ 5న కౌంటింగ్‌ చేసి అదే రోజు ఫలితాలను ఎన్నికల సంఘం వెల్లడించనుంది.

Last Updated : May 26, 2024, 4:35 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.