పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు అన్ని ఏర్పాట్లు పూర్తి : కలెక్టర్​ దాసరి హరిచందన - RO Dasari Harichandana Interview

By ETV Bharat Telangana Team

Published : May 26, 2024, 4:44 PM IST

thumbnail
ఎమ్మెల్సీ ఉపఎన్నికకు ఏర్పాట్లు పూర్తి : కలెక్టర్​ దాసరి హరిచందన (ETV Bharat)

RO Hari Chandana Interview On MLC Election : వరంగల్‌-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఎన్నికల రిటర్నింగ్ అధికారి దాసరి హరిచందన తెలిపారు. అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. ఓటర్ల సౌలభ్యం కోసం పోలింగ్ కేంద్రాల్లో తాగు నీరు, వైద్య సిబ్బంది ఇతర వసతులు కల్పించినట్లు ఆమె వెల్లడించారు. 

ఓటర్ల సౌలభ్యం కోసం ఓటు వేసే ప్రక్రియకు సంబంధించిన సూచనలతో కూడిన వాల్ ​పోస్టర్​ను ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు. అభ్యర్థులకు ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మొత్తం 605 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అన్ని పోలింగ్​ కేంద్రాల వద్ద వెబ్ ​కాస్టింగ్​ కేంద్రాలను కవర్​ చేసే విధంగా ఏర్పాట్లు చేశామని వివరించారు. 12 జిల్లాల్లోని కలెక్టర్లతో సమన్వయం చేసుకుంటూ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామంటున్న ఆర్వో హరిచందనతో మా ప్రతినిధి ముఖాముఖి. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.