ETV Bharat / technology

టీనేజర్ల రక్షణ కోసం ఇన్​స్టాగ్రామ్​ నయా ఫీచర్​​​- ఎవరైనా న్యూడ్​ ఫొటోలు పంపితే ఇక అంతే! - Instagram New Feature Sextortion

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 12, 2024, 9:39 AM IST

Updated : Apr 12, 2024, 11:21 AM IST

Instagram New Feature For Sextortion : లైంగిక దోపిడీపై పోరుకు సిద్ధమయింది ప్రముఖ సోషల్​ మీడియా కంపెనీ​ ఇన్​స్టాగ్రామ్​. టీనేజర్ల రక్షణ కోసం ఓ ప్రత్యేక టూల్​ను తీసుకురానున్నట్లు ప్రకటించింది. ఎవరైనా డైరెక్ట్‌ మెసేజ్‌ ద్వారా మనకు న్యూడ్​ ఫొటోలను పంపితే ఈ ఫీచర్‌ వాటిని అటోమేటిక్​గా బ్లర్‌ చేస్తుందని వివరించింది.

Instagram New Feature For Sexual Content
Instagram New Feature For Sextortion

Instagram New Feature For Sextortion : లైంగిక దోపిడీపై పోరాటానికి, యువత రక్షణ కోసం తాము కొత్త టూల్‌ను అందుబాటులోకి తెస్తున్నామని సోషల్​ మీడియా ప్లాట్​ఫామ్​​ ఇన్‌స్టాగ్రామ్‌ గురువారం ప్రకటించింది. డైరెక్ట్‌ మెసేజ్‌ కింద నగ్న చిత్రా (న్యూడ్​ ఫొటో)లను పంపిన సమయంలో ఈ టూల్‌ వాటిని ఆటోమేటిక్‌గా బ్లర్‌ చేస్తుందని వెల్లడించింది. లైంగిక కుంభకోణాలు, ఇతర మార్గాల్లోని చిత్రాల దుర్వినియోగంపై ప్రచారంలో భాగంగా తాము కొత్త ఫీచర్లను పరీక్షిస్తున్నామని, అలాగే టీనేజ్‌ వారిని నేరస్థులు సంప్రదించడం కఠినతరం చేస్తున్నామని తెలిపింది.

న్యూడ్​ ఫొటోలను బ్లర్​ చేసి చూపిస్తుంది
లైంగిక దోపిడీలో భాగంగా నేరస్థులు డైరెక్ట్‌ మెసేజ్‌ రూపంలో నగ్నచిత్రాలు పంపేలా అవతలి వారిని ఒప్పిస్తారు. ఆ తర్వాత డబ్బులు డిమాండ్​ చేస్తారు. ఒకవేళ డబ్బులు ఇవ్వకుంటే లేదా లైంగిక పరమైన అంశాల్లో తమకు సహకరించకపోయినా, తాము చెప్పినట్లు వినకపోయినా వాటిని ఆన్‌లైన్‌లో పోస్ట్​ చేస్తామని బెదిరింపులకు దిగుతారు. సైబర్​ మోసగాళ్లు చాలా సందర్భాల్లో సన్నిహిత చిత్రాలను పొందేందుకు డైరెక్ట్‌ మెసేజ్‌ సదుపాయాన్ని వినియోగించుకుంటున్నారని ఇన్‌స్టాగ్రామ్‌ తెలిపింది. అయితే డైరెక్ట్‌ మెసేజ్‌ నగ్నత్వ రక్షణ సదుపాయాన్ని తాము పరీక్షిస్తున్నట్లు చెప్పింది. కాగా, ఎవరైనా డైరెక్ట్‌ మెసేజ్‌ మార్గంలో నగ్న చిత్రాలను పంపితే ఈ ఫీచర్‌ వాటిని బ్లర్‌ చేసేస్తుందని వివరించింది.

ప్రస్తుతానికి ఇన్​స్టాలో మాత్రమే
ఇన్​స్టాగ్రామ్​ తేనున్న ఈ నయా ఫీచర్​​ 18 ఏళ్లలోపు ఉన్న వారి అకౌంట్లలో డిఫాల్ట్‌గా ఆన్​ అవుతుంది. అడల్ట్స్​కు మాత్రం దీనిని యాక్టివేట్​ చేసుకోమని తెలియజేస్తూ ఓ నోటిఫికేషన్​ను పంపుతుంది కంపెనీ. అయితే మోటాకు చెందిన ఫేస్​బుక్​, వాట్సాప్​లలో మాత్రం ప్రస్తుతం ఈ ఫొటోస్​ బ్లర్​ ఫీచర్​ లేదు.

సెండర్​ను బ్లాక్​ చేసి రిపోర్ట్​ చేయవచ్చు
సైబర్​ నేరస్థులు డైరెక్ట్​ మెసేజ్​లో పంపించే న్యూడ్​ ఫొటోలు వార్నింగ్​ రూపంలో మీ డివైజ్​కు వస్తాయి. వీటిని మీరు బ్లర్​​గానే చూస్తారు. అలాంటి సందర్భాల్లో మీకు నగ్నచిత్రాలతో సందేశం పంపిన సెండర్​ను బ్లాక్​ చేసి రిపోర్ట్​ చేయవచ్చు.

వారినీ హెచ్చరిస్తుంది
ఎవరైతే మీకు న్యూడ్​ ఫొటోలను పంపేవారు ఉంటారో, వారికీ హెచ్చరిక సందేశాన్ని పంపుతుంది ఇన్​స్టాగ్రామ్​. ఒకవేళ వారు అలానే పంపి అవతలి వ్యక్తి చూసేలోపు మనసు మార్చుకున్నట్లయితే సెండ్​ చేసిన మెసేజ్​ను తొలగించవచ్చు లేదా అన్​సెండ్​ చేయవచ్చు. అయితే ఇతరులు అప్పటికే మీరు పంపిన మెసేజ్​ను చూసే అవకాశం ఉంది. ఆ విషయం మీకు తెలియదు.

ఇన్​స్టాగ్రామ్​లో స్క్రీన్​షాట్​ తీస్తే - ఆ విష‌యం అవతలి వ్యక్తికి తెలుస్తుందా? - Instagram Screenshot

భారత్​లో ఆల్​ ఇన్ వన్​​ 'గూగుల్​ వాలెట్' లాంఛ్​! ఆండ్రాయిడ్​ ఫోన్లలో అందుబాటులోకి! - Google Wallet In India

Last Updated :Apr 12, 2024, 11:21 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.