ETV Bharat / state

మురుగునీటితో కూరగాయలు పండిస్తున్నారా? రాష్ట్రప్రభుత్వానికి నోటీసులిచ్చిన హైకోర్టు

author img

By ETV Bharat Telangana Team

Published : Mar 19, 2024, 9:26 PM IST

Telangana High Court On Sewage Water Vegetables cultivation : హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో కాలుష్య కాసారాలుగా మారిన చెరువుల నీటితో కూరగాయలు, ఆకుకూరల సాగును అడ్డుకోవడానికి తక్షణం చర్యలు చేపట్టాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ రెండు జిల్లాలో పరిధిలోని 13 చెరువుల పరిస్థితిపై అడ్వకేట్ కమిషన్ ఇచ్చిన నివేదికలోని సూచనల అమలుపై నాలుగువారాల్లోగా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

Telangana High Court On Sewage Water Vegetables
Telangana High Court On Sewage Water Vegetables

High Court on Sewage Cultivated Vegetables cultivation : హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని చెరువుల మురుగునీటితో కూరగాయల సాగును అడ్డుకోవడానికి వెంటనే చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మురుగునీటితో సాగైన కూరగాయలు, ఆకుకూరలు ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని, అందువల్ల అవి మార్కెట్లోకి రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల పరిధిలోని 13 చెరువుల దుస్థితిపై అడ్వొకేట్ కమిషన్ ఇచ్చిన నివేదికలోని సూచనల అమలుపై 4 వారాల్లో చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. కార్యాచరణ నివేదికను ఫొటోలతో సహా సమర్పించాలని ఆదేశించింది.

High Court on PIL : నగరంలోని చెరువుల ఆక్రమణలపై చర్యలు తీసుకోకపోవడంపై 2007లో దాఖలైన ప్రజాప్రయోజన వ్యాఖ్యపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ జె. అనిల్ కుమార్​లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ధర్మాసనం ఏర్పాటు చేసిన అడ్వకేట్ కమిషన్ మహానగరంలోని పలు చెరువుల దుస్థితిపై ఫోటోలతో సహా నివేదిక సమర్పించి పలు సూచనలు చేసింది. చాలా చెరువులు అక్రమణలకు గురయ్యాయని చెత్తాచెదారం, మురుగునీటితో దుర్గందభరితంగా తయారయ్యాయని అడ్వోకేట్ కమిషన్ పేర్కొంది. ఈ చెరువుల్లోని మురుగునీటితో పండించిన ఆరు కూరలు, కూరగాయలతోపాటు చేపలను వినియోగిస్తున్న ప్రజల ఆరోగ్యాలపై ప్రభావం చూపిస్తోందని తెలిపింది.

దుర్గం చెరువు పునరుద్ధరణకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేయాలి : హైకోర్టు

గ్రీన్​ బెంచ్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది : అడ్వకేట్ కమిషన్
వ్యర్థాలను తొలగించడం, పూడిక తీయడం, ఆక్రమణలను తొలగించడంతోపాటు నాలాలను పరిరక్షించి నీటి రాకపోకలకు అంతరాయం లేకుండా చూడాల్చిన అవసరం ఉందని అడ్వకేట్ కమిషన్ పేర్కొంది. చెరువుల ఆక్రమణ, అక్రమ నిర్మాణాలు తదితర కేసుల సత్వర పరిష్కారానికి హైకోర్టు పరిధిలో గ్రీన్ బెంచ్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఎఫ్‌టీఎల్‌ నిర్ధరణ శాస్త్రీయంగా చేసి తుది నోటిఫికేషన్ ఇవ్వాలని ఆక్రమణదారులపై చర్యలు తీసుకునేలా నీటిపారుదల శాఖకు తగిన అధికారాలు కల్పించాలని అడ్వకేట్ కమిషన్ నివేదికలో తెలిపింది. అడ్వకేట్ కమిషన్ నివేదికను చెరువుల వారీగా అమలు చేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను ఏప్రిల్ 29వ తేదీకి వాయిదా వేసింది.

శంషాబాద్‌లోని ఆ 181 ఎకరాలు హెచ్ఎండీఏవే - ఏడాది తర్వాత హైకోర్టు కీలక తీర్పు

ఏదో ఒకటి చేసి ఆ రైతులను ఆదుకోండి.. ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు

'జల సంరక్షణపై బాధ్యత గుర్తు చేసిన హైకోర్టు - ప్రభుత్వం ఏ విధమైనా చర్యలు తీసుకోవాలి?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.