ETV Bharat / state

పేద ప్రజలకు ఇచ్చిన మాట తప్పను - మీ నమ్మకాన్ని వమ్ము చేయను : ఆర్​.ఎస్. ప్రవీణ్ కుమార్ - RS Praveen Kumar Tweet On Kcr

author img

By ETV Bharat Telangana Team

Published : Mar 22, 2024, 10:53 PM IST

RS Praveen Kumar Tweet On Kcr
RS Praveen Kumar Tweet On Kcr

RS Praveen Kumar Tweet On Kcr : బీఆర్​ఎస్ తనకు టికెట్​ ఇవ్వడం పట్ల ఆ పార్టీ అధినేత కేసీఆర్​కు ధన్యవాదాలు తెలియజేశారు ఆర్​.ఎస్. ప్రవీణ్ కుమార్. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్​ వేదికగా పోస్ట్ చేశారు. చట్ట సభల్లో ప్రజాగొంతుకగా ఉండాలనే ఎంతో విలువైన ఉద్యోగాన్ని సైతం విడిచిపెట్టి రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. తెలంగాణ వాదం- బహుజన వాదం రెండూ ఒక్కటే అని నమ్మి బీఆర్​ఎస్​లో చేరినట్లు ఆయన చెప్పారు

RS Praveen Kumar Tweet On Kcr : బీఆర్ఎస్ తనపై పెట్టిన విశ్వాసాన్ని వమ్ము చేయనని పేద ప్రజలకిచ్చిన మాట తప్పనని బీఆర్ఎస్ నేత ఆర్​.ఎస్. ప్రవీణ్‌ కుమార్ అన్నారు. తనపై నమ్మకంతో నాగర్‌కర్నూల్ పార్లమెంట్ స్థానానికి అభ్యర్థిగా ప్రకటించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ మేరకు ఆయన "ఎక్స్‌" వేదికగా స్పందించారు.

RS Praveen Kumar On Rumors : పేద ప్రజల జీవితాలను సమూలంగా మార్చాలన్న తన లక్ష్యం నుంచి ఈ చిల్లర దాడులు దూరం చేయలేవని ప్రవీణ్ కుమార్ తేల్చిచెప్పారు. ఇన్నాళ్లు ప్రజాక్షేత్రంలోనే ఉండి పీడిత ప్రజల కోసం పనిచేశానని తెలిపారు. చట్ట సభల్లో ప్రజాగొంతుకగా ఉండాలనే ఎంతో విలువైన ఉన్నత ఉద్యోగాన్ని సైతం వదిలి రాజకీయాల్లోకి వచ్చానని వివరించారు. అసెంబ్లీలో బహుజనుల గొంతుకగా ఉండాలని రాత్రింబవళ్లు శ్రమించినప్పటికీ మొదటి ప్రయత్నంలో విఫలమయ్యానని ఆవేదన చెందారు. తెలంగాణ వాదం బహుజన వాదం రెండూ ఒక్కటేనని నమ్మి ఎంతో శ్రమించి కేసీఆర్​ను బీఎస్పీ మాయావతిని ఒప్పించి తెలంగాణలో చారిత్రాత్మక పొత్తు ఏర్పాటయ్యేలా చూశానని వివరించారు.

"నా రాజకీయ ప్రస్థానంలో ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలు మిమ్మల్ని బాధపెట్టి ఉండవచ్చు. ఒక ఉన్నతమైన లక్ష్య సాధన కోసం కొన్ని త్యాగాలు తప్పవు. అయితే విషయాన్ని అర్థం చేసుకోకుండా నాపై సామాజిక మాధ్యమాల్లో కొన్ని శక్తులు (కొంత మంది ఆప్తులతో సహా) తీవ్రమైన దాడి చేశాయి. ఇంకా చేస్తూనే ఉన్నాయి. ఇలాంటి అనాగరికమైన దాడులు నాకు కొత్త కాదు" - ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్

రాజ్యాంగ విలువల రక్షణకోసం : ఆర్​ఎస్ ప్రవీణ్ కుమార్​
ఇచ్చిన మాట ప్రకారం విశాల తెలంగాణ ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకొని దేశంలో కోట్లాది బహుజనుల బంగారు భవిష్యత్తు కోసం భారత రాజ్యాంగ విలువల రక్షణ కోసం కేసీఆర్‌తో కలసి ప్రయాణించాలనుకున్నానని చెప్పారు. బీజేపీ కుట్రల నుంచి దేశాన్ని రక్షించే ధమ్ము - ధైర్యం కాంగ్రెస్​కు ముమ్మాటికీ లేదు అందుకే నేను ఇటీవలే బీఆర్ఎస్​లో చేరానంటూ తన మనసులో మాట వివరించారు.

RS Praveen Kumar On Elections : ఈ యుద్ధంలో కేసీఆర్ మార్గదర్శనంలో సర్వశక్తులొడ్డి విజయం కోసం పోరాడతాననని, దయచేసి అందరూ కూడా నాతో రండి అని సూచించారు. నాగర్‌కర్నూల్ నియోజకవర్గానికి వచ్చి ‘కారు’ గుర్తుకు ఓటెయ్యమని ఇంటింటికి ప్రచారం చేయండి లేదా మీకు తెలిసిన వారికందరికీ కనీసం ఫోన్ చేసైనా చెప్పండని విజ్ఞప్తి చేశారు. నేను చట్టసభల్లో కూర్చుంటే మీరందరూ అక్కడ కూర్చున్నట్లే నేను నేను కాదు నేను మీరే మనమందరమూ చలో నాగర్‌కర్నూల్ అంటూ ప్రవీణ్‌కుమార్ విజ్ఞప్తి చేశారు.

మరో 2 లోక్​సభ స్థానాలకు బీఆర్​ఎస్​ అభ్యర్థుల ప్రకటన​ - మెదక్ బరిలో మాజీ ఐఏఎస్ - BRS Lok Sabha Candidates 2024

బీఆర్ఎస్​తో పొత్తులో భాగంగా బీఎస్పీకి 2 సీట్లు - నాగర్​కర్నూల్​ ఎంపీ అభ్యర్థిగా ఆర్​ఎస్​ ప్రవీణ్​ కుమార్

RS Praveen Kumar Comments on KCR : "అసైన్డ్ భూముల బలవంతపు ఆక్రమణలపై త్వరలోనే హైకోర్టులో పిల్ వేస్తాం"

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.