ETV Bharat / state

20 ఏళ్ల క్రితం ఇచ్చిన ఇంటి స్థలాల స్వాధీనం - జేసీబీతో గుడిసెల తొలగింపు - Demolition Of Houses In Khammam

author img

By ETV Bharat Telangana Team

Published : Mar 31, 2024, 8:00 AM IST

Govt taking over house plots In Khammam
Removal Huts in Khammam

Removal Huts in Khammam : ఖమ్మం శివారులో 20ఏళ్ల క్రితం తమకు కేటాయించిన ఇళ్ల స్థలాల్ని ఇప్పుడు తిరిగి స్వాధీనం చేసుకున్నారు. ఇళ్లు కట్టుకోలేదనే సాకుతో తాత్కాలిక నిర్మాణాలు, గుడిసెలను అధికారులు కూల్చి వేస్తున్నారని బాధితులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. లబ్ధిదారుల నుంచి స్థలాలు కొనుగోలు చేసిన తమ పరిస్థితి అగమ్య గోచరంగా తయారైందని మరికొందరు వాపోతున్నారు.

20 ఏళ్ల క్రితం ఇచ్చిన ఇంటి స్థలాల స్వాధీనం - జేసీబీతో గుడిసెల తొలగింపు

Removal Huts in Khammam : ఖమ్మం శివారులో 20ఏళ్ల క్రితం తమకు కేటాయించిన ఇళ్ల స్థలాల్ని ఇప్పుడు తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిచండపై లబ్ధిదారులు లబోదిబో అంటున్నారు. ఇళ్లు కట్టుకోలేదనే సాకుతో తాత్కాలిక నిర్మాణాలు, గుడిసెలను అధికారులు కూల్చి వేస్తున్నారని కన్నీటి పర్యంతం అవుతున్నారు. లబ్ధిదారుల నుంచి స్థలాలు కొనుగోలు చేసిన తమ పరిస్థితి అగమ్య గోచరంగా తయారైందని మరికొందరు వాపోతున్నారు.

అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం - కబ్జా భూముల్లోని భవనాలను తొలగిస్తున్న బల్దియా

Govt taking over house plots In Khammam : స్వాతంత్ర సమరయోధులు, మాజీ సైనికులు, రాజకీయంగా నష్టపోయిన వారికి 2005లో అప్పటి ప్రభుత్వం ఖమ్మం శివారులో ఇండ్ల స్థలాలు కేటాయించింది. 140 గజాల చొప్పున మొత్తం 439 ప్లాట్లకు పట్టాలు అందించారు. ఐతే నగరానికి దూరంగా ఉండటం, కనీసం బోరు వేసినా నీళ్లు పడే పరిస్థితి లేక చాలా మంది లబ్ధిదారులు ఇళ్లు కట్టుకోలేదు. పదేళ్ల తర్వాత ఆ స్థలాన్ని అమ్ముకోవచ్చని ప్రచారంతో వేరే వాళ్లకు విక్రయించారు. ప్రభుత్వ నిబంధనలు తెలియనివాళ్లు లక్షలు పెట్టి ఆ స్థలాలు కొన్నారు. ఇలా 50 శాతానికిపైగా ఇండ్ల స్థలాలు లబ్ధిదారుల నుంచి చేతులు మారాయి. ఇళ్లు కట్టుకోకపోతే ఆ స్థలాలను స్వాధీనం చేసుకునే అధికారం ప్రభుత్వానికి ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు చర్యలు చేపట్టారు. తాత్కాలిక నిర్మాణాలను జేసీబీతో కూల్చివేశారు.

లబ్ధిదారుల నుంచి స్థలాలు కొనుగోలు చేసిన మా పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. తక్కువ ధరకు స్థలాలు అమ్మితే కొనుకున్నాము. అప్పట్లో ఇక్కడ కరెంటు, నీటి వసతి లేక నివాసాలు ఏర్పచుకోలేదు. అప్పటి మంత్రికి కరెంటు, నీళ్లు వసతులు కల్పించాలని వినతి పత్రం ఇచ్చాం. అధికారులు, నాయకులు పట్టించుకోలేదు. ఎవరైనా కబ్జా చేస్తారన్న భయంతో గోడలు, గుడిసెలు నిర్మించుకున్నాం. అధికారులను నిర్మాణాలను జేసీబీతో కూల్చివేశారు. అప్పులు చేసి స్థలాలు కొన్నాం. ప్రభుత్వం ఇంకో అవకాశం ఇస్తే ఇళ్లు కట్టుకుంటాము. -బాధితులు

Illegal Construction Demolition In Khammam : నిర్మాణాలను కూల్చి వేయొద్దని బాధితులు ఆర్డీవోను కలిసి వినతి పత్రం అందజేశారు. నిబంధనలు తెలియక, కొంచెం తక్కువ ధరకు వస్తున్నాయని స్థలాలు కొనుగోలు చేశామని తెలిపారు. అమ్మినవాళ్లు వెళ్లిపోయారని కొన్న తాము నష్టపోతున్నామని కన్నీటి పర్యంతమవుతున్నారు. పట్టాలు ఇచ్చి 20ఏళ్లు గడుస్తున్నా ఇళ్లు కట్టుకోలేదని అందుకే స్వాధీనం చేసుకుంటున్నామని అధికారులు స్పష్టంచేస్తున్నారు. కరెంటు, నీటి వసతి లేక నివాసాలు ఏర్పచుకోలేదని లబ్ధిదారులు చెబుతున్నారు. ప్రభుత్వం తమకు అవకాశం ఇస్తే ఇళ్లు నిర్మించుకుంటామని కోరుతున్నారు.

హైదరాబాద్‌లో ఆక్రమణల తొలగింపు - అధికారులపై ఎంఐఎం నేతల ఫైర్

ఇండ్ల కూల్చివేతతో ముషీరాబాద్​లో టెన్షన్ టెన్షన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.