ETV Bharat / state

రూ.1500 పెట్టుబడి పెడితే వంద రోజులపాటు రోజుకు రూ.50 - సైబర్ కేటుగాళ్ల ఉచ్చులో పోలీసులు

author img

By ETV Bharat Telangana Team

Published : Jan 29, 2024, 11:54 AM IST

Online Investment Frauds Telangana : రూ.1500 పెట్టుబడి పెట్టండి వందరోజుపాటు రోజూ 50 చొప్పున లాభాలిస్తాం. 24 వేలు పెడితే రోజూ 4 వేల లెక్కన చెల్లిస్తాం అలాంటి మాటలు విని సాధారణ ప్రజలు మోసపోయారంటే పెద్దగా ఆశ్చర్యం వేయదు కానీ పోలీసులే నిండా మునిగిపోయారు. పెట్టుబడులకు లాభాలని సామాజిక మాధ్యమాల్లో వచ్చిన ప్రచారాన్ని నమ్మి హైదరాబాద్‌కి చెందిన కొందరు పోలీసులు దాదాపు 75 లక్షలకుపైనే పెట్టుబడి పెట్టారు. నిందితులు డబ్బు వసూలు చేసి పత్తాలేకుండా పోవడంతో ఎవరికీ చెప్పలేక మిన్నకుండిపోయారు. ఆ నయా మోసంపై పోలీసు విభాగంలో చర్చనీయాంశంగా మారింది.

Etv Bharat
Etv Bharat

సైబర్ కేటుగాళ్ల నయా ఉచ్చులో చిక్కిన పోలీసులు

Online Investment Frauds Telangana : కొంత పెట్టుబడి పెట్టండి వందరోజుల పాటు రూపాయలు 50 చొప్పున లాభాలిస్తాం. కొంతకాలం లాభాలు ఇచ్చి పెట్టుబడి పెట్టిన వారిని నమ్మించి ఆ తర్వాత 24 వేలకు పెడితే నాలుగు వేలు ఇస్తామంటూ ఇలా సాధారణ ప్రజలు మోసపోయారంటే ఆశ్చర్యం వేయదు కానీ, పోలీసులే నిండా మునిగారు. సోషల్​ మీడియాలో వచ్చిన ప్రచారాన్ని నమ్మి హైదరాబాద్​కి చెందిన కొంత మంది పోలీస్​లు సుమారు 75 లక్షలకు పైగా పెట్టుబడి పెట్టారు. తీరా మోసపోయామని బయట తెలిస్తే పరువు పోతుందని తెలిసి కక్కలేక మింగలేకపోయారు.

Telangana Cyber ​​Crimes : ఆన్‌లైన్‌లో పెట్టుబడి పెడితే రోజువారీగా లాభాలు ఇస్తామంటూ గత నవంబరులో విస్తృతంగా ప్రచారం సాగింది. వేరేవారి ద్వారా విషయం తెలుసుకున్న పోలీసుశాఖ ఉద్యోగి ఒకరు టెలిగ్రామ్‌ యాప్‌లోని గ్రూపులో చేరాడు. ఆ గ్రూపు రెండు, మూడేళ్ల నుంచి కొనసాగుతోందని చాలా మంది సభ్యులు ఉన్నట్లు నిర్థారించుకున్న ఉద్యోగి పెట్టుబడి పెట్టేందుకు యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకున్నాడు. ఒక్కసారి 1,500 పెడితే 100 రోజులపాటు రోజూ 50 చొప్పున చెల్లిస్తామని సైబర్‌ నేరగాళ్లు చెప్పారు. నమ్మిన ఉద్యోగి 1,500 పంపాడు. నిందితులు రోజూ 50 చొప్పున జమ చేశారు. నిజంగా లాభాలు రావడంతో నగరంలో తనతో పాటు పనిచేసే సహచరులకు చెప్పాడు.

98 లక్షలు కొల్లగొట్టి, క్షణాల్లోనే 11 ఖాతాలకు బదిలీ - పోలీసుల చాకచక్యంతో 85 లక్షలు సేఫ్

తెలంగాణ పోలీసులకు సైబర్ నేరగాళ్లు స్కెచ్ : అతడిని నమ్మిన సుమారు 100 మంది ప్రాథమికంగా కొన్ని పెట్టుబడులు మొదలు పెట్టారు. నేరగాళ్లు తొలుత యాప్‌లో లాభాలు జమచేసేవారు. అంతా నమ్ముతున్నట్లు భావించిన నిందితులు మరోమోసం మొదలు పెట్టారు. 24 వేలు జమ చేస్తే రోజుకు 4 వేల చొప్పున ఇస్తామని చెప్పగా పెట్టుబడి జమచేశారు. తొలి రెండు మూడు రోజులు లాభాలు పంపగా నిజమేనని భావించిన ఉద్యోగులు ఒక్కొక్కరు భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టారు. కొందరు 50 వేలు 75 వేల వరకు పంపారు. ఆ విధంగా సుమారు వంద మందికి పైగా కలిసి మొత్తం 75 లక్షలకుపైనే పెట్టుబడి పెట్టారు.

సైబర్ నేరాల కట్టిడికి కొత్త వ్యూహాలతో సమాయత్తమవుతున్న పోలీసులు

పోలీసులకే టోపి పెట్టిన సైబర్​ నేరగాళ్లు : అనంతరం కొత్తవారిని చేర్పించిన వారికి బోనస్‌ లాభాలు ఇస్తామంటూ నమ్మించగా మరికొందరు చేరారు. పెట్టుబడి పెట్టాక రెండు మూడ్రోజులు లాభాలు ఠంచనుగా పంపారు. సంక్రాంతి సమయంలో హఠాత్తుగా నేరగాళ్లు డబ్బులు పంపడం ఆపడంతో తొలుత సాధారణమే అనుకున్నారు. ఆ తర్వాత టెలిగ్రామ్‌లో సందేశాలు పంపినా స్పందన లేదు. రోజులు గడిచినా లాభాలు మాత్రం రాలేదు. అనుమాన మొచ్చి ఆరా తీయగా అదంతా మోసమని తెలిసి కంగుతిన్నారు. ఆ వ్యవహారంపై ఒక్కరూ నోరువిప్పడం లేదు. ఠాణాలో ఫిర్యాదు చేయాలనుకున్నా పోలీసులే మోసపోయినట్లు బహిర్గతమైతే అప్రతిష్ట పాలవుతామనే ఉద్దేశంతో ముందుకు రావడం లేదని తెలుస్తోంది. ఆ నయా మోసంపై పోలీస్‌ శాఖలో విస్తృతంగా చర్చ సాగుతోంది.

సైబర్‌ మోసానికి గురయ్యారా? సింపుల్​గా కంప్లైంట్​ చేయండిలా!

సైబర్ క్రైమ్స్​లో మొదటి స్థానంలో తెలంగాణ - ఆర్థిక నేరాలు, ఫేక్ న్యూస్ వ్యాప్తిలోనూ మనమే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.