ETV Bharat / state

పోలీసుల సైబర్ గస్తీ - ఇక కేటుగాళ్ల ఆటకట్టు

author img

By ETV Bharat Telangana Team

Published : Jan 2, 2024, 2:29 PM IST

Cyber Crimes In Telangana
Police Special Focus on Cyber Crimes

Police Special Focus on Cyber Crimes : రోజురోజుకు అందుబాటులోకి వస్తున్న కొత్త టెక్నాలజీతో పాటు నేరాల తీరు కూడా మారుతోంది. ప్రజల అమాయకత్వాన్ని, అత్యాశను పెట్టుబడిగా మార్చుకొని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఇలా సైబర్ కేటుగాళ్ల చేతిలో మోసపోతున్న వారిలో తెలంగాణ ముందంజలో ఉంది. సైబర్‌ నేరాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో 15వేల 297 కేసుల నమోదుతో దేశంలోనే తొలి స్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో ఈ నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర పోలీసులు ‘సైబర్‌ గస్తీ’ పెంచనున్నారు.

Police Special Focus on Cyber Crimes : దేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ప్రజలు సైబర్ నేరాల బారినపడుతున్నారు. సాంకేతికత పెరుగుతున్న కొద్ది సైబర్‌ నేరాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. అయితే ఇందులో చిక్కుకుంటున్న యువత ఇంటర్నెట్‌, కంప్యూటర్‌ స్పామ్‌, డేటా చౌర్యం లాంటి వాటి బారిన పడుతూ మోసపోతున్నారు.

తాజా నివేదికల ప్రకారం గడిచిన 8 నెలల్లో తెలంగాణ ప్రజలు ఏకంగా రూ. 700 కోట్లను కోల్పోయారు. సైబర్ నేరగాళ్లు రోజుకో రీతిన ప్రజల ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. వీరిని కట్టడి చేసేందుకు పోలీసులు ‘సైబర్‌ గస్తీ’ పెంచనున్నారు. అంతర్జాలం మాటున మహిళలపై జరుగుతున్న వివిధ రకాల నేరాలను నిలువరించేందుకు ఇప్పటికే దీనిని నిర్వహిస్తుండగా తాజాగా ఇతర వాటికీ విస్తరించనున్నారు.

Loan App Harassment Hyderabad : లోన్​ యాప్​ డౌన్​లోడ్ చేసుకుంటున్నారా.. బీ కేర్​ఫుల్ బ్రదర్​!

Cyber Crimes In Telangana : ఇందులో భాగంగా సోషల్ మీడియాపై నిఘా పెంచి మోసాలను అడ్డుకోవాలని పోలీసులు భావిస్తున్నారు. 2022తో పోలిస్తే 2023లో అన్ని రకాల నేరాలు 8.97% పెరిగితే సైబర్‌ నేరాలు మాత్రం 17.59% పెరిగాయి. జాతీయ నేరాల నమోదు సంస్థ గణాంకాల ప్రకారం 2022లో దేశంలోనే అత్యధికంగా తెలంగాణలో 15,297 సైబర్‌ నేరాలు నమోదయ్యాయి.

తెలంగాణలో ఈ సంవత్సరం సైబర్ నేరాలు కట్టడి చేయడం కోసం సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో సైబర్ నేరాల నివారణకు, బాధితుల ఫిర్యాదు చేసిన వెంటనే నగదును రికవరీ చేయడానికి ఈ బ్యూరో కృషి చేస్తోంది. అయితే నేరం జరిగిన తర్వాత కంటే నేరం జరగకుండా చూడటానికి పోలీసులు కొత్త ప్రయత్నాలు మొదలు పెడుతున్నారు. ఈ క్రమంలోనే ఆన్‌లైన్‌లో మోసాలకు పాల్పడుతున్న సైబర్‌ నేరగాళ్లపై ప్రత్యేక నిఘా పెట్టి అరెస్టులు చేయడానికి వ్యూహం సిద్ధం చేస్తున్నారు.

Akhira Ransomware Virus : అకీరా రాన్సమ్​వేర్ వైరస్​కు​​.. అడ్డుకట్ట వేయండిలా..!

Cyber Crime Cases In Hyderabad : సామాజిక మాధ్యమాల్లో నకిలీ ఖాతాల ద్వారా చేస్తున్న మోసాలపై ప్రజల్లో చాలా వరకు అవగాహన వచ్చింది. దాంతో రూటు మార్చిన సైబర్‌ నేరగాళ్లు కొత్త దందాకు తెరలేపుతున్నారు. తమ సంస్థ తరపున వ్యాపారం నిర్వహిస్తే మంచి కమీషన్‌ ఇస్తామని నమ్మబలికి పెట్టుబడి పేరుతో రూ.లక్షలు గుంజుతున్నారు.

తాజాగా సైబర్ నేరగాళ్లు హైదరాబాద్​లోని ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి నుంచి హోటల్ గదులు బుక్‌ చేస్తే కమీషన్‌ వస్తుందని రూ.20 లక్షలు కొల్లగొట్టారు. ఇలా నకిలీ సంస్థతో అనేక మందిని మోసం చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో సామాజిక మధ్యమాల్లో వ్యాపార సంస్థల పేరుతో వచ్చే ప్రకటనలపై ‘గస్తీ’ పెట్టడం ద్వారా ఈ మోసాలను ముందుగానే నివారించవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఆన్‌లైన్‌లో ఏదైనా సంస్థ ప్రచారం చేస్తే పోలీసులు దానికి సంబందించిన పుట్టు పూర్వోత్తరాలను విచారిస్తారు. వ్యాపార సంస్థ నకిలీదని తేలితే నిందితులను పట్టుకోవడంతో పాటు సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలను జాగ్రత్తపరుస్తారు.

లైకుల మోజులో సైబర్ దాడులకు గురవుతున్నారు - వీటిని ఫాలో అవ్వాలంటున్న సైబర్ నిపుణులు

సైబర్ క్రైమ్స్​లో మొదటి స్థానంలో తెలంగాణ - ఆర్థిక నేరాలు, ఫేక్ న్యూస్ వ్యాప్తిలోనూ మనమే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.