ETV Bharat / state

మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడి కాలేజీ భవనాల కూల్చివేత - సీఎం సలహాదారుడిని కలిసిన మాజీమంత్రి

author img

By ETV Bharat Telangana Team

Published : Mar 7, 2024, 1:31 PM IST

Updated : Mar 7, 2024, 5:03 PM IST

MLA Marri Rajasekhar Reddy College Demolish : మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డికి చెందిన కళాశాల భవనాలను​ కూల్చివేశారు. చిన్న దామర చెరువు కబ్జా చేసి భవనాలు నిర్మించారన్న ఆరోపణల నేపథ్యంలో మున్సిపల్​ అధికారులు ఈ మేరకు చర్యలు తీసుకున్నారు.

BRS MLA College Building Demolish in Medchal
MLA Marri Rajasekhar Reddy College Demolish

మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు - బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి కళాశాల భవనాలు కూల్చివేత

MLA Marri Rajasekhar Reddy College Demolish : హైదరాబాద్‌ శివారు దుండిగల్‌లో అక్రమ నిర్మాణాలను మున్సిపల్ సిబ్బంది కూల్చివేశారు. ఈ క్రమంలో బీఆర్​ఎస్​ మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు, మాల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి కళాశాలకు చెందిన భవనాలను అధికారులు కూల్చివేశారు. దుండిగల్‌లోని చిన్న దామరచెరువు ఎఫ్‌టీఎల్‌ బఫర్‌ జోన్‌లో ఎమ్మెల్యే రాజశేఖర్‌రెడ్డికి చెందిన మర్రి లక్ష్మారెడ్డి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజిలోని ఏరోనాటికల్‌(MLRIT Aeronautical), ఎంఎల్‌ఆర్‌ఐటీఎం (MLRITM) కళాశాలలకు సంబంధించిన రెండు శాశ్వత భవనాలు, 6 తాత్కాలిక షెడ్లను కూల్చివేశారు.

BRS MLA College Building Demolish in Medchal : చిన్న దామర చెరువు ఆక్రమించి పార్కింగ్‌ కోసం రోడ్లు, భవనాలు నిర్మించినట్లు నీటిపారుదల శాఖ, రెవెన్యూ అధికారులు గతంలో గుర్తించారు. ఈ మేరకు వారం క్రితం యాజమాన్యానికి నోటీసులిచ్చారు. తాజాగా మేడ్చల్‌ జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు నీటిపారుదల, రెవెన్యూ, పోలీసు శాఖల ఆధ్వర్యంలో అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. ఈ క్రమంలో దీన్ని అడ్డుకునేందుకు కొంత మంది విద్యార్థులు, కళాశాల సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. వారికి అధికారులు సర్దిచెప్పి, అనంతరం భవనాల కూల్చివేతను కొనసాగించారు.

సీఎం సలహాదారుని కలిసిన మాజీ మంత్రి మల్లారెడ్డి : కాలేజీ భవనాల కూల్చివేత విషయంలో మాజీ మంత్రి మల్లారెడ్డి సీఎం సలహాదారును కలిశారు. ఎమ్మెల్యే రాజశేఖర్‌ రెడ్డితో కలిసి సీఎం సలహాదారుడు వేం నరేందర్‌రెడ్డిని కలిశారు. కూల్చివేతలు జరుగుతున్న సమయంలో ఎమ్మెల్యే మల్లారెడ్డి సీఎం సలహాదారుడిని కలవడం చర్చనీయాంశంగా మారింది.

మోదీ మూడోసారి ప్రధాని అయ్యాక కాంగ్రెస్​కు మామూలుగా ఉండదు : మాజీ మంత్రి మల్లారెడ్డి

Mallareddy Illegal College Road Demolished : ఇటీవలే మాజీ మంత్రి మల్లారెడ్డికి చెందిన కళాశాల రోడ్డును అధికారులు తొలగించిన విషయం తెలిసిందే. హెచ్ఎండీఏ లే అవుట్లో 2500 గజాల స్థలాన్ని మల్లారెడ్డి ఆక్రమించి ఆయన కాలేజీ కోసం రోడ్డు వేసుకున్నట్లు తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. దీనిపై గతంలో మేడ్చల్ మల్కాజిగిరి ఎంపీగా ఉన్న ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అప్పట్లో అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ ఎలాంటి చర్యలు చేపట్టలేదు. తాజాగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దీనిపై దృష్టి సారించారు. హెచ్ఎండీఏ లేఅవుట్లో అక్రమంగా ఏర్పాటు చేసిన రోడ్డును తొలగించాలని సంబంధిత అధికారులుకు మేడ్చల్ కలెక్టర్ ఆదేశించారు. దీంతో మల్లారెడ్డి కాలేజీ కోసం వేసిన రోడ్డును అధికారులు తొలగించేశారు.

అక్రమ నిర్మాణాల కూల్చివేత - పీర్జాదిగూడలో ఉద్రిక్తత

మాజీ మంత్రి మల్లారెడ్డికి షాక్ - కాలేజీ కోసం వేసిన రోడ్డును కూల్చేసిన అధికారులు

Last Updated :Mar 7, 2024, 5:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.