మాజీ మంత్రి మల్లారెడ్డికి షాక్ - కాలేజీ కోసం వేసిన రోడ్డును కూల్చేసిన అధికారులు

By ETV Bharat Telangana Team

Published : Mar 2, 2024, 2:32 PM IST

thumbnail

Mallareddy Illegal College Road Demolished : బీఆర్ఎస్ మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి (Mallareddy) అధికారులు బిగ్ షాకిచ్చారు. గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీలో హెచ్‌ఎండీఏ(HMDA) లే అవుట్‌లో మల్లారెడ్డి వేసిన రోడ్డును అధికారులు తొలిగించారు. హెచ్ఎండీఏ లేఅవుట్లో 2500 గజాల స్థలం ఆక్రమించి ఆయన కాలేజీ కోసం మల్లారెడ్డి రోడ్డు వేసుకున్నట్లు తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. దీనిపై గతంలో మేడ్చల్ మల్కాజిగిరి ఎంపీగా ఉన్న ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అప్పట్లో అధికారులకు ఫిర్యాదు చేశారు.

EX Minister Mallareddy Road Demolition : అయినప్పటికీ ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ఇప్పుడు తాజాగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భూమి అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ మేరకు హెచ్ఎండీఏ స్థలం ఆక్రమణపై మేడ్చల్ కలెక్టర్ దృష్టి పెట్టారు. హెచ్ఎండీఏ లేఅవుట్లో అక్రమంగా ఏర్పాటు చేసిన రోడ్డును తొలగించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాలతో మల్లారెడ్డి కాలేజీ కోసం వేసిన రోడ్డును అధికారులు తొలగించేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.