ETV Bharat / state

తెలంగాణలో భానుడి భగభగ - కూల్ డ్రింక్స్, ఫ్రూట్ జూస్​లతో చలచల్లగా - Demand For Fruit Juices In Summer

author img

By ETV Bharat Telangana Team

Published : Mar 29, 2024, 11:37 AM IST

Demand For Fruit Juices In Summer : రాష్ట్రంలో భానుడి భగభగలు మొదలయ్యాయి. ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వేడి నుంచి ఉపశమనం పొందేందుకు కూల్ డ్రింక్స్, పండ్లరసాలు తీసుకుంటున్నారు. ఎండ నుంచి రక్షించే గొడుగులు, టోపీలకూ డిమాండ్ పెరిగింది. మరికొద్ది రోజులు ఎండలు తీవ్రంగా ఉండే అవకాశం ఉండటంతో తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటోంది వాతావరణ శాఖ.

Demand For Fruit Juices In Summer
Demand For Fruit Juices In Summer

రాష్ట్రంలో మండిపోతున్న ఎండలు- శీతల పానీయాలు, పండ్ల రసాలకు పెరిగిన గిరాకీ

Demand For Fruit Juices In Summer : రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ప్రజలు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. మార్చిలోనే పలు జిల్లాల్లో ఉష్ఱోగ్రతలు 42 డిగ్రీలు దాటడంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. వేసవి తాపం తీర్చుకోవడానికి ప్రజలు శీతల పానీయాలు, పండ్ల రసాలు తాగుతున్నారు. శరీరం కోల్పోయిన లవణాలు భర్తీ చేసుకునేందుకు ఎక్కువగా నిమ్మరసం(Lemon Juice) తాగుతున్నారు. వేసవి తాపం నుంచి ఉపశమనానికి కూల్​డ్రింక్స్​ను ప్రజలు ఎక్కువగా తీసుకుంటున్నారు.

Demand For Clay Pots In Summer : తోపుడుబండ్లపై భారీ కుండల్లో పుదీనా ఆకులతో కలిపిన నిమ్మరసాన్ని విక్రయిస్తున్నారు. పానీయాల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయని విక్రయదారులు చెబుతున్నారు. మరోవైపు మట్టికుండలకు కూడా ఈ వేసవిలో మంచి గిరాకీ ఉంది. కుండలో గ్లాసులు ముంచాల్సిన అవసరం లేకుండా నల్లా బిగించినవి అందుబాటులో ఉన్నాయి. మట్టితో చేసిన నీసా సీసాలు కూడా బాగా అమ్ముడుపోతున్నాయి. ఒకసారి ఈ బాటిల్‌లో నీరు నింపితే అరగంటలో చల్లగా మారతాయి. రోడ్ల పక్కన జూస్ సెంటర్లు ఎండకాలంలో ఎంతో ఉపయోగపడుతున్నాయని ప్రజలు అంటున్నారు.

"వేసవిలో నీళ్లు ఎక్కువగా తాగాలి. కేవలం మంచినీళ్లు తీసుకోవడమే కాకుండా ఓఆర్ఎస్ లాంటి ద్రావణాలు తాగాలి. కొబ్బరి నీళ్లు ఎక్కువగా తీసుకుంటుండాలి. మసాలాలు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తినకపోవడమే మంచిది. ఆహారంలో ఎక్కువగా ఆకుకూరలు ఉండేట్లుగా చూసుకోవాలి. షుగర్ వ్యాధి లేని వాళ్లు పండ్ల రసాలను కూడా తీసుకోవచ్చు. కూరగాయలు, సీజనల్ ఫలాలు తీసుకోవాలి. ఈ కాలంలో లభించేటువంటి కీర లాంటి పండ్లనీ తీసుకోవాలి. ఈ జాగ్రత్తలు అన్నింటిని తీసుకోవడం ద్వారా సూర్య తాపం నుంచి ఉపశమనం పొందవచ్చు"- శ్వేత, వైద్యురాలు

వేసవిలో తాగునీటి ఎద్దడిపై ప్రభుత్వం ఫోకస్ - నాగార్జునసాగర్‌లో కనీస మట్టానికి దిగువ నుంచి తీసుకునేలా ప్లాన్!

Telangana Weather News Today : ఎండల తీవ్రత ఇంకా పెరుగుతుందని వాతావరణ శాఖ(Indian Metrological Department) తెలిపింది. వేసవి తాపం నుంచి కాపాడుకునేందుకు నీళ్లు బాగా తాగాలని శరీరం డీహైడ్రేట్ కాకుండా చూసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. ఎండ నుంచి చర్మాన్ని రక్షించుకోవాలని సూచిస్తున్నారు. వేసవి తాపానికి వడదెబ్బ వచ్చే అవకాశం ఉన్నందున ఆయా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. వడదెబ్బ తగలకుండా టోపీలు, చలువ కళ్లజోడు, గొడుగు వాడాలని స్పష్టంచేస్తున్నారు.

ఆరంభంలోనే భగ్గుమంటున్న భానుడు - 3 డిగ్రీల మేర పెరగనున్న గరిష్ఠ ఉష్టోగ్రతలు - Temperature Increases in Telangana

ఆరంభంలోనే భగ్గుమంటున్న భానుడు -వేసవిలో ఆరోగ్యం కాపాడుకునేదెలా! - SUMMER Health Tips

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.