ETV Bharat / state

కూల్‌ డ్రింక్స్‌ తాగిన తర్వాత - మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా?

author img

By ETV Bharat Telangana Team

Published : Feb 18, 2024, 2:43 PM IST

What Happen After Drinking Cool Drinks : కూల్ డ్రింక్స్ అంటే కొందరికి పండగే. ముఖ్యంగా పిల్లలు, మహిళలు ఎక్కువగా తీసుకుంటారు. అయితే.. అవి తాగుతున్నప్పుడు హాయిగా ఉంటుంది. కానీ.. ఆ పానీయాలు గొంతు దాటిన తర్వాత మీ శరీరంలో ఎటువంటి మార్పులు జరుగుతాయో మీకు తెలుసా? ఈ నమ్మలేని నిజాలను వెంటనే తెలుసుకోండి!

What Happen After Drinking Cool Drinks
What Happen After Drinking Cool Drinks

What Happen After Drinking Cool Drink : పార్టీ.. ఫంక్షన్.. ఇలా వేడుక ఏదైనా కొందరికి కూల్ డ్రింక్స్ కచ్చితంగా ఉండాల్సిందే. ఎండాకాలంలో చాలా ఇళ్లలో కూల్ డ్రింక్స్ ఏరులై పారుతాయి. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు వీటిని ఎంతో ఇష్టంగా తాగుతుంటారు. ఎండ తీవ్రత పెరిగిపోతున్న కొద్దీ ప్రజలు వేడి నుంచి ఉపశమనం పొందడానికి ఎక్కువగా కూల్‌ డ్రింక్‌లను తాగడానికి ఆసక్తి చూపిస్తుంటారు. అయితే.. వీటిని అధికంగా తీసుకోవడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయినా చాలా మంది ఈ విషయాన్ని లైట్‌ తీసుకుంటున్నారు. అయితే.. కూల్‌ డ్రింక్‌ తాగడం వల్ల మనలో ఎటువంటి మార్పులు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

చక్కెర ఎక్కువ బాడీలోకి చేరుతుంది..
ఒక వ్యక్తి ఉదాహరణకు 330 ml ఉండే కూల్‌ డ్రింక్‌ను తాగాడని అనుకుంటే అతని శరీరంలోకి 37 గ్రాములు (10 టీస్పూన్లు) చక్కెర చేరినట్లేనని నిపుణులు చెబుతున్నారు. అయితే.. వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ సిఫార్సుల ప్రకారం ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉండటానికి రోజుకు 25 గ్రాముల చెక్కర (6 టీస్పూన్లు) కంటే ఎక్కువగా తీసుకోకూడదని అంటున్నారు. నిజానికి ఉదయాన్నే తాగే కాఫీ, టీ మొదలు తినే తిండి, పండ్లు వగైరాల ద్వారా కావాల్సిన దానికన్నా కాస్త ఎక్కువే అందుతుంది. అలాంటిది కూల్‌ డ్రింక్స్ తీసుకుంటే రెట్టింపు స్థాయిలో షుగర్ కంటెంట్‌ మన బాడీలోకి చేరుతుందని తెలియజేస్తున్నారు.

పలు అనారోగ్య సమస్యలు..
ఇలా దీర్ఘకాలింగా కూల్‌డ్రింక్స్ తాగడం వల్ల గుండెపోటు, అధిక రక్తపోటు, ఊబకాయం వంటి సమస్యలు తలెత్త వచ్చని హెచ్చరిస్తున్నారు. దాదాపు మనం తాగే అన్ని కూల్‌ డ్రింక్స్​లో పాస్ఫారిక్‌ యాసిడ్ ఉంటుంది. ఇది వాటికి రుచిని, నిల్వ సామర్థ్యాన్ని పెంచుతుంది. కానీ.. దీనివల్ల ఎముకల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందట. కూల్‌డ్రింక్‌ తాగిన 20 నిమిషాల తర్వాత రక్తంలో చక్కెర స్థాయులు భారీగా పెరిగేలా చేస్తుంది. ఈ షుగర్‌ కంటెంట్‌ అంతా బాడీలో కొవ్వు తయారయ్యేలా చేస్తుంది.

డొపమైన్‌ ఉత్పత్తిపై ప్రతికూల ప్రభావం..
కూల్‌డ్రింక్‌ తాగిన 40 నిమిషాల తర్వాత అందులో ఉండే కెఫిన్‌ను మన శరీరం గ్రహిస్తుంది. ఇది యువకులలో రక్తపోటు పెరిగేలా చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ కెఫిన్‌ మెదడులోని అడెనోసిన్ గ్రాహకాలను అడ్డుకుంటుందట. తర్వాత మరో ఐదు నిమిషాల తర్వాత బ్రెయిన్‌లో డోపమైన్ ఉత్పత్తి అవుతుందని అంటున్నారు. అయితే.. సాధారణంగా మనం ఆనందంగా ఉన్నప్పుడు ఉత్పత్తి అయ్యే ఒక న్యూరోట్రాన్స్మిటర్ ఇది. కానీ, కూల్‌ డ్రింక్‌ తాగడం వల్ల ఇది తాత్కాలికంగా కొంత ఎక్కువ ఉత్పత్తి అవుతుంది. అయితే, దీర్ఘకాలింగా కూల్‌ డ్రింక్‌లు తాగితే.. డొపమైన్ ఉత్పత్తిపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఎక్కువగా ఉంటుదని తెలియజేస్తున్నారు.

కూల్‌డ్రింక్‌ తాగిన గంట తర్వాత కెఫిన్‌ తగ్గిపోవడం.. రక్తంలో చక్కెర స్థాయులు పెరగడం వల్ల మగతగా ఉన్నట్లు, చిరాకు కలుగుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు. అందువల్ల కూల్ డ్రింక్స్ తాగడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.

టేస్టీ​గా ఉందని సాస్​ లాగించేస్తున్నారా? - మీ శరీరంలో జరిగేది ఇదే!

చెడు కొలెస్ట్రాల్​ తగ్గించుకోవాలా? ఈ ఆయుర్వేద చిట్కాలతో సమస్యకు చెక్!​

మీరు ఎప్పుడైనా ఎల్లో టీ తాగారా? - ఈ ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఈసారి మిస్​ అవ్వరు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.