ETV Bharat / state

రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ నేతల రైతుదీక్షలు - రైతుల హామీలు అమలుచేయాలని డిమాండ్ - brs raithu deekshalu 2024

author img

By ETV Bharat Telangana Team

Published : Apr 6, 2024, 7:59 PM IST

BRS FIRES ON CONGRESS PARTY
BRS Raithu Deekshalu 2024

BRS Raithu Deekshalu 2024 : అన్నదాత సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ భారత రాష్ట్ర సమితి రాష్ట్రవ్యాప్తంగా రైతు దీక్షలు చేపట్టింది. ఎండిన పంటలకు పరిహారం సహా 500 రూపాయల బోనస్‌తో పంటలు కొనుగోలు చేయాలని ఎక్కడికక్కడ ఆందోళన నిర్వహించారు. ఆచరణ సాధ్యం కానీ హామీలను ఇచ్చి, ప్రజలను మభ్యపెట్టారని దుయ్యబట్టారు.

రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ నేతల రైతుదీక్షలు - రైతుల హామీలు అమలుచేయాలని డిమాండ్

BRS Raithu Deekshalu 2024 : మోసపూరిత వాగ్ధానాలతో కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసిందని, మాజీమంత్రి హరీశ్​రావు(Harish rao) వ్యాఖ్యానించారు. సంగారెడ్డి రైతు దీక్షలో పాల్గొన్న ఆయన, ప్రభుత్వ మొద్దు నిద్రకు నిరసనగానే రైతుదీక్ష చేపట్టినట్లు పేర్కొన్నారు. ఎండిన పంటలను కాంగ్రెస్ నాయకులు పట్టించుకోవడం లేదని హరీశ్​రావు ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డి, నల్గొండ జిల్లా, మిర్యాలగూడలో జరిగిన రైతుదీక్షలో మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు పాల్గొన్నారు.

పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.25 వేలు చెల్లించాలి : కేసీఆర్‌ - KCR Polam Bata Programme

పెద్దపల్లి జిల్లా గోదావరిఖని బీఆర్ఎస్(BRS Deekshalu) కార్యాలయం వద్ద చేపట్టిన దీక్షలో, రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ పాల్గొన్నారు. ముఖ్యమంత్రి క్రికెట్ మ్యాచ్ చూసిన పర్వాలేదు కానీ, రైతుల పరిస్థితి చూసి ఆదుకోవాలని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు. జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో పాత బస్టాండ్ వద్ద రైతుదీక్ష నిర్వహించారు. వరికి మద్దతు ధర, బోనస్ ఇవ్వాలంటూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ సహా భువనగిరిలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు నిరసన దీక్ష చేపట్టారు.

BRS FIRES ON CONGRESS PARTY : జనగామ జిల్లా పాలకుర్తి దీక్షలో మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Errabelli) పాల్గొన్నారు. బీఆర్ఎస్​ను టీఆర్ఎస్​గా మార్చే ఆలోచన చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఖమ్మం, నల్గొండ, కరీంనగర్‌ జిల్లాల్లోనూ బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు దీక్ష చేపట్టారు. వర్ధన్నపేటలో జరిగిన కార్యక్రమంలో మాజీ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, కరీంనగర్‌లో మాజీమంత్రి గంగుల, వినోద్‌కుమార్‌ సహా పార్టీ నాయకులు దీక్షలో పాల్గొన్నారు.

మహబూబ్​నగర్‌లోని రైతుదీక్షలో పాల్గొన్న మాజీమంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌, రాష్ట్రవ్యాప్తంగా పంటలు ఎండిపోతున్నా. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. సిద్దిపేటలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌ రెడ్డి, ఆదిలాబాద్‌లో మాజీ మంత్రి జోగు రామన్న, వరంగల్ జిల్లా నర్సంపేటలో పెద్ది సుదర్శన్ రెడ్డి, మాలోత్‌ కవిత, చెన్నూరులోని రైతుదీక్షలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్, పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ పాల్గొన్నారు.

"ఆచరణ సాధ్యం కానీ హామీలతో, కాంగ్రెస్ పార్టీ ప్రజలను మభ్యపెట్టింది. రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యింది. ప్రభుత్వం మొద్దు నిద్రకు నిరసనగానే రైతు దీక్షలు చేపట్టాము. ఇచ్చిన మాట ప్రకారం పంటబోనస్, రైతు రుణమాఫీ, పంట నష్టపరిహారాన్ని కర్షకులకు అందించాలి". - హరీశ్‌రావు, మాజీమంత్రి

అరచేతిలో స్వర్గం చూపించడం - ఆపై చేతులెత్తేయడం మీకు అలవాటే : హరీశ్​రావు బహిరంగ లేఖ - Harish Rao letter to Rahul Gandhi

యూట్యాబ్‌ వీడియోలు కాదు, కళ్ల ముందు కనిపిస్తున్న నిజాలను నమ్మండి - కేటీఆర్ - ktr raithu deeksha

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.