ETV Bharat / sports

ధోనీ హ్యాట్రిక్ సిక్స్​లు - రోహిత్ సెంచరీ వీడియో - IPL 2024 CSK VS Mumbai Indians

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 15, 2024, 6:31 AM IST

IPL 2024 CSK VS Mumbai Indians : ఐపీఎల్ 2024లో భాగంగా తాజాగా జరిగిన మ్యాచ్​లో ముంబయి రోహిత్ - చెన్నై ధోనీ తమ ఇన్నింగ్స్​తో ఆకట్టుకున్నారు. పూర్తి వివరాలు స్టోరీలో.

రోహిత్ సెంచరీ - ధోనీ హ్యాట్రిక్ సిక్స్​లు
రోహిత్ సెంచరీ - ధోనీ హ్యాట్రిక్ సిక్స్​లు

IPL 2024 CSK VS Mumbai Indians : ఐపీఎల్‌-2024లో తాజాగా జరిగిన మ్యాచ్​లో ముంబయి ఇండియన్స్‌ చెన్నై సూపర్ కింగ్స్ తలపడ్డాయి. 20 పరుగుల తేడాతో ముంబయి ఓడింది. అయితే ఈ మ్యాచ్​లో రోహిత్ శర్మ, ధోనీ ఆడిన ఇన్నింగ్స్ హైలైట్​గా నిలిచాయి.

Rohit IPL Century : లక్ష్యాన్ని ఛేదించలేక ముంబయి మ్యాచ్ ఓడిపోయినప్పటికీ ఆ జట్టు స్టార్‌ ఓపెనర్‌ రోహిత్‌ శర్మ అద్బుతమైన సెంచరీతో అదరగొట్టాడు. ఓ వైపు వరుసగా వికెట్లు పడుతున్నప్పటికీ రోహిత్‌ మాత్రం ఎక్కడా తగ్గలేదు. ఒంటరి పోరాటం చేస్తూ దూసుకెళ్లాడు. అలా ఆఖరి వరకు అద్బుతంగా పోరాటం​ చేసి ఫ్యాన్స్​ను అలరించాడు. అతడికి మరో ఆటగాడి అండ దొరికే ఉంటే ముంబయి కచ్చితంగా విజయం సాధించి ఉండేది. అతడు 63 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్స్‌ల సాయంతో 103 అజేయ పరుగులు చేశాడు. రోహిత్‌కు ఇది రెండో ఐపీఎల్‌ సెంచరీ కావడం విశేషం. చివరగా అతడు 2012 ఐపీఎల్‌ సీజన్‌లో శతకం బాది ఆకట్టుకున్నాడు. కాగా, రోహిత్‌ సెంచరీ బాదినప్పటికీ ఎటువంటి సెలబ్రేషన్స్‌ చేసుకోలేదు.

అలానే హిట్ మ్యాన్​ ఓ రికార్డు కూడా సాధించాడు. టీ20ల్లో 500 సిక్సర్లు బాదిన తొలి భారత క్రికెటర్‌గా నిలిచాడు. మొత్తంగా ఈ మార్క్ అందుకున్న ఐదో బ్యాటర్‌గానూ ఘనత సాధించాడు. ఈ జాబితాలో ముందు యూనివర్సల్‌ బాస్‌ క్రిస్ గేల్ 1056 సిక్సర్లతో టాప్​లో ఉండగా, కీరన్ పొలార్డ్ (860), ఆండ్రూ రస్సెల్ (678), కొలిన్ మున్రో (548) తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.

Dhoni Hattrick Sixes : ఇక ధోనీ విషయానికొస్తే. ఈ ఐపీఎల్‌లోనూ చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఎక్కడ మ్యాచ్‌ ఆడినా పసుపు రంగు జెర్సీలతో స్టాండ్స్‌ నిండిపోతున్న సంగతి తెలిసిందే. అలానే ధోనీ కూడా కాసేపే ఆడుతున్న ధనాధన్ ప్రదర్శన చేస్తున్నాడు. అలా ముంబయితో జరిగిన తాజా మ్యాచ్​లోనూ అతడు వాంఖడె స్టేడియాన్ని హోరెత్తించాడు. ఆఖరి ఓవర్లో క్రీజులోకి వచ్చిన అతడు వరుసగా మూడు బంతుల్లో సిక్సర్లు కొట్టి స్టేడియాన్ని ఉపేశాడు. ఎదుర్కొన్న నాలుగు బంతుల్లో సిక్స్​ల సాయంతో 20 పరుగులు చేశాడు. మొత్తంగా కాలి నొప్పితోనే బ్యాటింగ్‌ చేసిన మహీ తన ఫినిషర్‌ పాత్రకు ఎప్పటిలాగే న్యాయం చేసి అభిమానులను అలరించాడు.

రోహిత్ సెంచరీ వృథా - హై వోల్టేజ్ మ్యాచ్​లో సీఎస్కే విజయం - MI vs CSK IPL 2024

'రోహిత్ కోసం ఖర్చు ఎంత్తైనా రెడీ- కావాలంటే లైఫ్​ను బెట్​ వేస్తా'- ప్రీతి జింటా కామెంట్స్! - Rohit shama Preity Zinta

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.