ETV Bharat / sports

రోహిత్ సెంచరీ వృథా - హై వోల్టేజ్ మ్యాచ్​లో సీఎస్కే విజయం - MI vs CSK IPL 2024

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 14, 2024, 10:57 PM IST

Updated : Apr 15, 2024, 11:42 AM IST

MI vs CSK IPL 2024
MI vs CSK IPL 2024

MI vs CSK IPL 2024 : 2024ఐపీఎల్​లో వాంఖడే వేదికగా ముంబయి - చెన్నై జట్లు తలపడ్డాయి. ఈ హై వోల్టేజ్ మ్యాచ్​లో సీఎస్కే గెలిచింది.

MI vs CSK IPL 2024: 2024 ఐపీఎల్​లో భాగంగా ఆదివారం స్టార్ జట్లు ముంబయి ఇండియన్స్- చెన్నై సూపర్ కింగ్స్ తలపడగా ఈ హై వోల్టేజ్ మ్యాచులో సీఎస్కే గెలిచింది. 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఛేదనలో ముంబయి 20 ఓవర్లలో 6 వికెట్లకు 186 పరుగులే చేసింది. రోహిత్‌ శర్మ (105 నాటౌట్‌; 63 బంతుల్లో 11×4, 5×6) వీరోచిత పోరాటం వృథా అయింది. పతిరన (4/28) ముంబయిని దెబ్బకొట్టాడు.

మొదట ఈ భారీ లక్ష్య ఛేదనను ముంబయి ఘనంగా ఆరంభించింది. ఓపెనర్లు రోహిత్ శర్మ ఇషాన్ కిషన్ (23 పరుగులు, 15 బంతుల్లో) బౌండరీలతో చెన్నై బౌలర్లపై దాడికి దిగారు. వీరి ధాటికి ముంబయి 5 ఓవర్లకే 50 స్కోర్ దాటింది. ఇక జోరు మీదున్న ముంబయికి యంగ్ పేసర్ మతీషా పతిరణ కళ్లెం వేశాడు. ఓకే ఓవర్లో ఇషాన్, సూర్యకుమార్ యాదవ్​ (0)ను పెవిలియన్ చేర్చి చెన్నైకి బ్రేక్ ఇచ్చాడు.

రెండు వికెట్లు కోల్పోయినా, రోహిత్ దూకుడు తగ్గించలేదు. ఈ క్రమంలోనే జడేజా ఓవర్లో ఫోర్ బాది 30 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఫిఫ్టీ తర్వాత కూడా రోహిత్ ఫోర్లు, సిక్స్​లతో ప్రేక్షకులను ఉర్రూతలూగించాడు. మరోవైపు యంగ్ బ్యాటర్ తిలక్ వర్మ (31 పరుగులు, 19 బంతుల్లో) సైతం మెరుపులు మెరిపించాడు. వీరిద్దరూ మూడో వికెట్​కు 31 బంతుల్లోనే 50 పరుగుల భాగస్వామ్యం నిర్మించారు. అయితే పతిరన 14వ ఓవర్లో తిలక్‌ను ఔట్‌ చేసి పెవిలియన్​కు పంపాడు. ఆ తర్వాత చెన్నై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడం వల్ల సాధించాల్సిన రన్‌రేట్‌ బాగా పెరిగిపోయింది. చివరికి ముంబయి లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. రోహిత్‌ ఒక్కడే సెంచరీతో ముంబయి అభిమానులు అలరించాడు.

అంతకుముందు బ్యాటింగ్​కు దిగిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. ఓపెనర్ అజింక్యా రహానే (6), రచిన్ రవీంద్ర (21 పరుగులు) విఫలమయ్యారు. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (69 పరుగులు), శివమ్ దూబే (66* పరుగులు) మెరుపు హాఫ్ సెంచరీలతో రెచ్చిపోయారు. చివర్లో డారిల్ మిచెల్ (17 పరుగుల) ఫర్వాలేదనిపించాడు.

ధోనీ మెరుపులు: ఇన్నింగ్స్​ ఆఖరి ఓవర్లో 5 బంతులుండగా క్రీజులోకి వచ్చిన ధోనీ అదరగొట్టాడు. వరుసగా 6 6 6 2 బాది నాలుగు బంతుల్లోనే 20 పరుగులు చేశాడు. దీంతో ధోనీ ఫ్యాన్స్​కు ఫుల్ ట్రీట్ ఇచ్చినట్లైంది. ధోనీ మెరుపులతోనే చెన్నై స్కోర్ 200 దాటింది. ముంబయి బౌలర్లలో హార్దిక్ పాండ్య 2, శ్రేయస్ గోపాల్, గెరాల్డ్ కోట్జీ తలో వికెట్ దక్కించుకున్నారు.

Rohit 500 T20 Sixes: ఈ మ్యాచ్​లో ముంబయి స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ మరో అరుదైన రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. వాంఖడేలో సిక్సర్ల మోత మోగించిన హిట్​మ్యాన్ టీ20ల్లో 500 సిక్స్​లు పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో టీ20ల్లో 500+ సిక్స్​లు బాదిన ఐదో బ్యాటర్​గా రికార్డు కొట్టాడు.

టీ20ల్లో 500+ సిక్స్​లు బాదిన బ్యాటర్లు

  • క్రిస్ గేల్ (వెస్టిండీస్)- 1056 సిక్స్​లు
  • కీరన్ పోలార్డ్ (వెస్టిండీస్)- 860 సిక్స్​లు
  • అండ్రూ రస్సెల్ (వెస్టిండీస్)- 678 సిక్స్​లు
  • కొలిన్ మున్రో (న్యూజిలాండ్)- 548 సిక్స్​లు
  • రోహిత్ శర్మ (భారత్)- 500 సిక్స్​లు

'రోహిత్ కోసం ఖర్చు ఎంత్తైనా రెడీ- కావాలంటే లైఫ్​ను బెట్​ వేస్తా'- ప్రీతి జింటా కామెంట్స్! - Rohit shama Preity Zinta

డ్రైవింగ్ సీట్​లో రోహిత్ శర్మ- ఎంటర్​టైన్​మెంట్​లో హిట్​మ్యాన్ 'తగ్గేదేలే'- వీడియో వైరల్ - Rohit Sharma Bus Driving

Last Updated :Apr 15, 2024, 11:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.