ETV Bharat / politics

హరీశ్​రావు కాంగ్రెస్​లోకి వస్తే దేవాదాయ శాఖ ఇస్తాం - రాజగోపాల్​ రెడ్డి సెటైర్​

author img

By ETV Bharat Telangana Team

Published : Feb 12, 2024, 7:42 PM IST

Komatireddy Rajagopal Reddy Vs Harish Rao
Komatireddy Rajagopal Reddy Satirical Comments on Harish Rao

MLA Rajagopal Reddy Comments on Harish Rao : తెలంగాణ శాసనసభలో కృష్ణా జలాలపై సాగిన చర్చల్లో పాలకవిపక్షాల మధ్య ఇవాళ మాటల యుద్ధం జరిగింది. అనంతరం అసెంబ్లీ లాబీలో ఇష్టాగోష్టిగా మాట్లాడిన కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, మాజీ మంత్రి హరీశ్​రావుపై సెటైరికల్​ కామెంట్స్​ చేశారు. బీఆర్ఎస్​ పార్టీలో హరీశ్​రావు ఎంత కష్టపడినా ప్రయోజనం లేదన్న ఆయన, తమ పార్టీలోకి వస్తే దేవాదాయ శాఖ ఇస్తామంటూ వ్యంగ్యంగా మాట్లాడారు.

MLA Rajagopal Reddy Comments on Harish Rao : తెలంగాణ అసెంబ్లీ సమావేశాల అనంతరం మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్​ రెడ్డి, మాజీమంత్రి హరీశ్​రావుపై కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్​ఎస్​ పార్టీలో ఎంత కష్టపడ్డా హరీశ్​రావుకు ప్రయోజనం ఉండదన్న ఆయన, కాంగ్రెస్ పార్టీలోకి 25 మంది ఎమ్మెల్యేలను తీసుకు వస్తే దేవాదాయ శాఖ ఇస్తామన్నారు. బీఆర్​ఎస్​లో(BRS Party) చేసిన పాపాలు కడుక్కోవడానికే ఆ శాఖ ఇస్తామంటున్నట్లు వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. గతంలో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా లేకుండా చేశారని గుర్తు చేసిన రాజగోపాల్​ రెడ్డి, ఇప్పుడు మళ్లీ తమ పార్టీలో చీలిక తీసుకురావాలని చూస్తున్నారని విమర్శించారు.

హరీశ్​రావు రైట్ పర్సన్‌ ఇన్ రాంగ్ పార్టీ : మాజీ మంత్రులు హరీశ్​రావు, కడియం శ్రీహరి తమను చీల్చాలని ఎదురు చూస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. హరీశ్​రావు, కడియం శ్రీహరి(Kadiyam Srihari) మాదిరిగా తాము జీ హుజూర్ బ్యాచ్‌ కాదని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ లాబీలో ఆయన మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ చీప్‌ పాలిటిక్స్‌ మానుకోవాలని హితవు పలికారు.

కేసీఆర్ రాష్ట్రాన్ని నాశనం చేశారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. హరీశ్​రావును తమ పార్టీలోకి రమ్మని ఆహ్వానిస్తున్నామని చెప్పారు. బీఆర్‌ఎస్‌లో ఆయనకు భవిష్యత్‌ లేదని అన్నారు. హరీశ్​రావు రైట్ పర్సన్‌ ఇన్ రాంగ్ పార్టీ అని వ్యాఖ్యానించారు. ఇప్పుడు రాష్ట్రాన్ని కాపాడుకునే బాధ్యత తమపై పడిందని వ్యాఖ్యానించారు. నల్గొండ సభ కోసం డబ్బులు పంచుతూ మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి(Jagadeesh Reddy) ప్రజల కాళ్లు పట్టుకుంటున్నారని విమర్శించారు.

హరీశ్‌రావు వర్సెస్ రాజగోపాల్‌రెడ్డి - అధికార పదవులపై సభలో రభస

పదవుల కోసం పాకులాడే వాళ్లం కాదని, ఉద్యమ సమయంలో పదవులను త్యజించిన చరిత్ర తమదేనన్నారు. నల్గొండ సభకు జనం వచ్చే అవకాశం లేదని ఆ సభ అట్టర్ ప్లాఫ్ అవుతుందని పేర్కొన్నారు. కేటీఆర్‌కు దమ్ముంటే పార్టీని నడపాలన్నారు. ఇప్పుడు హరీశ్​రావు తనతోపాటు 25మంది ఎమ్మెల్యేలను తీసుకుని వస్తే కాంగ్రెస్‌లోకి తీసుకుంటామని, అతనికి దేవాదాయ శాఖ ఇస్తామని తెలిపారు. అక్కడ చేసిన పాపాలను కడుక్కోవడానికి ఆ మంత్రి పదవి(Minister Post) ఉపయోగపడుతుందని పేర్కొన్నారుు

MLA Rajagopal Reddy Fires on BRS : హరీశ్​రావు కష్టించి పనిచేస్తారు కానీ ఏమి లాభమని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. గతంలో పేరుకే మంత్రి అయినా నిర్ణయాలన్నీ కేసీఆర్​వేనని అన్నారు. ఇప్పటికైనా కేసీఆర్​, కేటీఆర్ మాటలు హరీశ్​రావు వినడం ఆపి తమ మాటలు వినాలని సూచించారు. కాంగ్రెస్ సర్కార్​ చేసే మంచి పనులకు హరీశ్​రావు సహకరించాలని, రేపటి నల్గొండ సభకు వెళ్లకూడదని రాజగోపాల్​ రెడ్డి కోరారు.

ఎన్ని సంవత్సరాలు కష్టపడినా నిన్ను సీఎంని చేయరు : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

మల్లన్నా మజాకా - ఆ ఒక్కమాటతో అసెంబ్లీలో నవ్వులే నవ్వులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.