ETV Bharat / state

కృష్ణా బోర్డుకు ప్రాజెక్టులు అప్పగించడాన్ని ఖండించడానికే ఛలో నల్గొండ సభ : కేసీఆర్‌

author img

By ETV Bharat Telangana Team

Published : Feb 6, 2024, 10:03 PM IST

BRS Chief KCR on Chalo Nalgonda Sabha : ఛలో నల్గొండ సభను విజయవంతం చేయాలని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ తెలిపారు. కృష్ణా బోర్డుకు ప్రాజెక్టులు అప్పగించడం ద్వారా జరగబోయే దుష్పరిణామాలను ఖండించాలన్నారు. ఈ సమావేశంలో బీఆర్‌ఎస్‌ ముఖ్యనేతలు పాల్గొన్నారు.

Chalo Nalgonda Sabha
BRS Chief KCR on Chalo Nalgonda Sabha

BRS Chief KCR on Chalo Nalgonda Sabha : ఛలో నల్గొండ సభను విజయవంతం చేయాలని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ పార్టీ శ్రేణులు, కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. ఈ సభలో కృష్ణా బోర్డుకు ప్రాజెక్టులు అప్పగించడం ద్వారా జరగబోయే దుష్పరిణామాలను ఖండించడంతో పాటు తెలంగాణ సమాజానికి వివరించేలా ఈ సభను విజయవంతం చేయాలని కోరారు.

ఈ క్రమంలో తెలంగాణ భవన్‌లో ఈ నెల 13న నల్గొండ బహిరంగ సభ నిర్వహణపై పార్టీ ముఖ్యనేతలు, సమన్వయకర్తలతో కేసీఆర్‌ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్‌, హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాలకు చెందిన ముఖ్య నేతలు, సమన్వయకర్తలు పాల్గొన్నారు. ఈ నల్గొండ సభను విజయవంతం చేసేందుకు చేపట్టాల్సిన కార్యాచరణను వారికి వివరించారు. ఈ సమావేశానికి బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌, సీనియర్‌ నేత హరీశ్‌రావు తదితరులు పాల్గొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.