ETV Bharat / politics

హామీల అమలుపై మాట మార్చడం కాంగ్రెస్‌కు అలవాటైంది: హరీశ్‌రావు

author img

By ETV Bharat Telangana Team

Published : Feb 27, 2024, 2:59 PM IST

Updated : Feb 27, 2024, 3:30 PM IST

Harish Rao Tweet on LRS
Harish Rao Fires on Congress Party

Harish Rao Tweet on LRS : హామీల అమలుపై మాట మార్చడం కాంగ్రెస్‌కు అలవాటైందని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. ప్రభుత్వంలోకి రాగానే ఎల్ఆర్ఎస్ రద్దు చేస్తామని చెప్పిన కాంగ్రెస్‌ పార్టీ, అధికారంలోకి వచ్చాక మాత్రం మాట తప్పిందని హరీశ్​రావు దుయ్యబట్టారు. కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి ఉంటే ఎల్ఆర్ఎస్‌కు ఫీజు వసూలు చేయకూడదని, లేదంటే మోసపూరిత హామీ ఇచ్చినందుకు ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

Harish Rao Tweet on LRS : కాంగ్రెస్ నేతలకు ఏ మాత్రం చిత్తశుద్ది ఉన్నా లే అవుట్​ రెగ్యులేషన్స్ స్కీంను(LRS) ఉచితంగా అమలు చేయాలని లేదంటే మోసపూరిత హామీ ఇచ్చినందుకు ప్రజలకు క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్​రావు డిమాండ్ చేశారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలనపై రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం నేపథ్యంలో హరీశ్​రావు ఎక్స్ వేదికగా స్పందించారు.

హామీల అమలుపై మాట మార్చడం హస్తం పార్టీకి అలవాటుగా మారిందన్న ఆయన, అధికారంలోకి రాగానే, ఎల్ఆర్ఎస్ రద్దు చేస్తామని, ఉచితంగా క్రమబద్ధీకరణ చేస్తామని చెప్పి నేడు మాట తప్పిందని మండిపడ్డారు. ఎల్ఆర్ఎస్ పేరిట ఫీజు వసూలు చేసేందుకు సిద్ధమైందని ఆక్షేపించారు. నో ఎల్ఆర్ఎస్ - నో బీఆర్ఎస్ అంటూ గతంలో ప్రజలను రెచ్చగొట్టి ఇప్పుడు ఎల్ఆర్ఎస్​కు ఫీజులు వసూలు చేస్తామనడం కాంగ్రెస్ నేతల మోసపూరిత మాటలకు నిదర్శనమని హరీశ్​రావు వ్యాఖ్యానించారు.

Harish Rao Fires on Congress Party : కాంగ్రెస్ నేతలకు ఏ మాత్రం చిత్తశుద్ది ఉన్నా, గతంలో తాము చేసిన ప్రకటనలకు అనుగుణంగా ఎల్ఆర్ఎస్​ను ఎలాంటి ఫీజులు లేకుండా అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే మోసపూరిత హామీ ఇచ్చినందుకు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అధ్యక్షతన సోమవారం జరిగిన ఆదాయ సమీకరణ సమీక్షాసమావేశంలో ఎల్​ఆర్​ఎస్​పై కీలక​ నిర్ణయాలను వెల్లడించారు. తెలంగాణ లేఅవుట్‌ క్రమబద్ధీకరణ పథకం దరఖాస్తులపై చేసిన ప్రకటనతో, ఎంతోమంది గత మూడున్నరేళ్ల ఎదురుచూపులకు తెరదించినట్లైంది. 2020లో స్వీకరించిన దరఖాస్తులకు సంబంధించిన లేఅవుట్‌లను క్రమబద్ధీకరణ చేసుకునే అవకాశం ఇప్పుడు కల్పించారు.

పెండింగ్​లో 25 లక్షల ఎల్​ఆర్​ఎస్ ​దరఖాస్తులు - కాంగ్రెస్​ సర్కార్​ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ

Telangana Government Decision on LRS : మార్చి 31 లోపు మొత్తం ఫీజు చెల్లించిన ప్లాట్ల క్రమబద్ధీకరణకు అవకాశం ఇవ్వనున్నారు. దేవాదాయ, వక్ఫ్‌, గవర్నమెంట్, కోర్టు ఆదేశాలు ఉన్న భూములు మినహా ఇతర లేఅవుట్‌లను క్రమబద్ధీకరించనున్నారు. గతంలో రూ.1000 చెల్లించి దరఖాస్తు చేసుకున్న వారికి అవకాశం ఇవ్వనున్నారు. నగర, పురపాలికలు, పంచాయతీల పరిధిలో అక్రమ లేఅవుట్లలోని(Illegal layouts) ప్లాట్లను క్రమబద్ధీకరించేందుకు 2020లో గత బీఆర్ఎస్ ప్రభుత్వం అప్లికేషన్లు ఆహ్వానించడంతో 25 లక్షలకు పైగా అందాయి.

ఈ మేరకు క్రమబద్ధీకరణను చేపట్టే క్రమంలో న్యాయస్థానాల్లో వ్యాజ్యాలు దాఖలు కావడంతో ఆ ప్రక్రియ మధ్యంతరంగా నిలిచిపోయింది. రాష్ట్ర బడ్జెట్‌ రూపకల్పన సందర్భంగా ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుల పెండింగులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని అప్పట్లో ఆయన చెప్పారు. కాగా ఎల్‌ఆర్‌ఎస్‌పై ప్రభుత్వం తాజాగా స్పష్టతనిచ్చింది. దీనిపై తాజాగా హరీశ్​రావు ట్విటర్​ వేదికగా స్పందించారు.

సీఎం సాబ్!! ప్రభుత్వంలో టీఎస్​ఆర్టీసీ విలీనం ఎప్పుడు? : హరీశ్​రావు

కేంద్రంలో కాంగ్రెస్​ గెలిచే పరిస్థితే లేదు : హరీశ్​రావు

Last Updated :Feb 27, 2024, 3:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.