ETV Bharat / spiritual

మీ అరచేతిలో ఈ గుర్తులు ఉన్నాయా? - ఇవి ఉంటే ఏం జరుగుతుందో తెలుసా? - Lucky Signs on Palm

author img

By ETV Bharat Telugu Team

Published : May 16, 2024, 4:34 PM IST

Lucky Signs in Palmistry : అరచేతిలోని గీతలు జీవితాన్ని నిర్దేశిస్తాయని చాలా మంది నమ్ముతారు. హస్తసాముద్రిక శాస్త్రం ప్రకారం.. అరచేతిపై జీవిత రేఖ, విధి రేఖ, వివాహ రేఖ, హార్ట్ లైన్ వంటి రేఖలు ఉంటాయట. అయితే.. ఇవి మాత్రమే కాకుండా మరికొన్ని గుర్తులు కూడా ఉంటాయట. అవి ఉన్నవారి జీవితంలో ఊహించని మార్పులు సంభవిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

Lucky Signs on Palm
Lucky Signs in Palmistry (ETV Bharat)

Lucky Signs on Palm : మన చేతిలో ఉండే గీతలకు, తల రాతకు సంబంధం ఉందని చెబుతుంది హస్తసాముద్రికం! అందుకే చాలా మంది అరచేతిలో ఉండే రేఖలు, గుర్తులు మన వ్యక్తిత్వం, భవిష్యత్తు గురించి అనేక విషయాలు తెలియజేస్తాయని నమ్ముతారు. అయితే.. ఇప్పుడు చెప్పబోయే ఐదు గుర్తులు గనక మీచేతిపై ఉంటే.. జీవితంలో అద్భుతాలు చూస్తారని చెబుతున్నారు హస్తసాముద్రిక శాస్త్ర నిపుణులు. మరి.. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

టెంపుల్ : అరచేతిలో దేవాలయ సంకేతం ఉన్నవారి జీవితం ఎంతో శుభప్రదంగా ఉంటుందట. ఇది చాలా అరుదైన సింబల్. ఈ గుర్తు జ్ఞానం, ముఖ్యంగా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సూచిస్తుందట. ఈ సంకేతం జీవితంలో ఉన్నత స్థాయిని సూచిస్తుందంటున్నారు హస్తాముద్రికశాస్త్ర నిపుణులు. అలాగే ఈ గుర్తు ఉన్నవారికి అదృష్టం కలిసి వస్తుందని చెబుతారు. ఈ టెంపుల్ సింబల్ ఎలా ఉండాలంటే.. స్పష్టంగా కనిపించే గోపురం ఆకారంలో ఉండాలట. అలాగే ఈ సింబల్ లోపల ఎలాంటి గుర్తులు, రేఖలు ఉండకూడదట.

త్రిశూలం : ఈ గుర్తు శివుడికి చిహ్నంగా విశ్వసిస్తారు. హస్తసాముద్రికశాస్త్రం ప్రకారం అరచేతిలో త్రిశూలం గుర్తు ఉన్న వ్యక్తులకు ఆ మహదేవుడి అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు. అలాగే ఈ సింబల్​ ఉన్నవారు సమాజంలో గౌరవ మర్యాదలతో పాటు ధనవంతులు కూడా అవుతారట. అంతేకాకుండా.. అదృష్టం కూడా కలిసి వస్తుందట. త్రిశూలం గుర్తు ఉన్న వ్యక్తులు జీవితంలో ఎలాంటి కష్టాలూ పెద్దగా ఎదుర్కోరని, ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారని నమ్ముతారు. అందుకే.. హస్తాముద్రికశాస్త్ర నిపుణులు ఈ గుర్తును మనసులో సంతృప్తి, ఆనందం, సంపదకు సంకేతంగా సూచిస్తున్నారు. ఈ గుర్తు లోపల కూడా ఎలాంటి రేఖలు లేదా గుర్తులు ఉండకూడదట.

మిస్టిక్ క్రాస్ : హస్తసాముద్రిక శాస్త్రం ప్రకారం.. అరచేతిలో కనిపించే మిస్టిక్ క్రాస్ (Mystic cross) గుర్తును చాలా అరుదైన, శుభప్రదమైన సంకేతంగా చెప్పుకుంటారు. హెడ్ లైన్, హార్ట్ లైన్ మధ్య కనిపిస్తుంది ఈ సింబల్. మిస్టిక్ క్రాస్ గుర్తు ఉన్న వ్యక్తులకు మంచి ఆధ్యాత్మిక స్వభావం, అంతర్దృష్టి ఉంటాయంటున్నారు హస్తాముద్రికశాస్త్ర నిపుణులు. అలాగే.. ఈ గుర్తు ఉన్నవారు సాధారణ వ్యక్తుల కంటే ఎక్కువ జ్ఞానం కలిగి ఉంటారట. అయితే, ఈ రెండు రేఖలు ఒకదానితో ఒకటి సమానంగా ఉంటాయనే విషయాన్ని మీరు గమనించాలి.

పసుపు నీటితో స్నానం చేస్తున్నారా? - జ్యోతిష్యం ఏం చెబుతోందో తెలుసా?

నక్షత్రం : అరచేతిపై సాధారణంగా మౌంట్స్ అని పిలిచే ప్రాంతాలు కనిపిస్తాయి. ఈ కొండలపై కనిపించే డిఫరెంట్ స్టార్ సింబల్స్ అదృష్టం లేదా దురదృష్టాన్ని సూచిస్తాయట. అయితే, స్టార్ సింబల్ ఐదు లేదా అంతకంటే ఎక్కువ రేఖలు సన్ మౌంట్​పై కనిపిస్తే అది చాలా లక్కీగా నమ్ముతారు. అరచేతిలో ఈ కలయిక ఉన్న వ్యక్తులు అనుకోకుండా ఒకేసారి పేరు, సంపద, విజయాలు సాధిస్తారని హస్తాముద్రికశాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

మనీ ట్రయాంగిల్ : అరచేతిలో మనీ ట్రయాంగిల్ సింబల్ చిటికెన వేలు, ఉంగరపు వేలి కింద ఉన్న రేఖల కలయిక ద్వారా ఏర్పడుతుంది. హస్తసాముద్రిక శాస్త్రం ప్రకారం.. ఈ సింబల్​ను సంపద, ఆర్థిక విజయానికి సంకేతంగా చెప్పుకుంటారు. ఈ గుర్తు ధనవంతుల అరచేతుల్లో ఎక్కువగా కనిపిస్తుందని విశ్వసిస్తారు.

NOTE : పైన తెలిపిన వివరాలు కొందరు హస్తసాముద్రికశాస్త్ర నిపుణులు, హస్తసాముద్రిక శాస్త్రంలో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

పంచముఖి 'రుద్రాక్ష' ధ‌రిస్తే గుండె సంబంధిత వ్యాధులు పరార్​! ఈ నియమాలు పాటిస్తేనే!!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.