ETV Bharat / spiritual

పసుపు నీటితో స్నానం చేస్తున్నారా? - జ్యోతిష్యం ఏం చెబుతోందో తెలుసా?

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 29, 2024, 12:18 PM IST

Benefits of Turmeric Water Bath : పసుపుతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయనే విషయం అందరికీ తెలిసిందే. అయితే.. అదే పసుపును స్నానం చేసేటప్పుడు నీళ్లలో కలుపుకొని స్నానం చేస్తుంటారు కొందరు. మరి.. ఇలా చేస్తే ఏం జరుగుతుంది? జ్యోతిష్యం ఏం చెబుతోంది? మీకు తెలుసా?

Benefits of Turmeric Water Bath
Health Benefits of Turmeric

Turmeric Water Bathing Benefits : స్నానం చేసేటప్పుడు చాలా మంది నీళ్లలో పసుపు కలుపుకొని స్నానం చేస్తుంటారు. అయితే.. దాదాపుగా మహిళలు మాత్రమే ఈ తరహా స్నానం చేస్తారు. ఇలా స్నానపు నీటిలో పసుపు కలుపుకోవడం వల్ల అదృష్టం తలుపు తడుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల ఆరోగ్య పరంగా లాభాలు పొందడమే కాకుండా.. జ్యోతిష్యపరంగానూ మేలు జరుగుతుందని చెబుతున్నారు. మరి.. ఆ వివరాలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ప్రతికూల శక్తులను తొలగిస్తుంది : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. పసుపు వాటర్​తో స్నానం చేయడం ద్వారా మీ శరీరం నుంచి పత్రికూల శక్తులు తొలగిపోతాయట. అంతేకాకుండా.. ఇలా చేయడం ద్వారా అదృష్టం, శ్రేయస్సు లభించడంతోపాటు మనసు ప్రశాంతంగా ఉంటుందట.

త్వరగా వివాహం : పసుపు వాటర్​తో స్నానం చేయడం ద్వారా జ్యోతిష్యపరంగా మీరు పొందే మరో ప్రయోజనమేమిటంటే.. త్వరగా వివాహం అయ్యే అవకాశం ఉంటుందట. అంటే మీ వివాహం ఆలస్యం అవుతుంటే.. ప్రతీ గురువారం పసుపు నీటితో స్నానం చేస్తే.. త్వరలో మీకు పెళ్లి సెట్ అవుతుందట. దీనితో పాటు గురువారం విష్ణుమూర్తి విగ్రహానికి పసుపుతో అభిషేకం చేయండి. ఇవి రెండూ చేయడం ద్వారా త్వరగా వివాహమై.. మీ జీవితంలో సానుకూలత ఏర్పడుతుందట.

బృహస్పతిని బలపరుస్తుంది : బృహస్పతి అదృష్టం, సంపదకు కారణమని చాలా మంది నమ్ముతారు. ముఖ్యంగా బృహస్పతి స్థానం బలహీనంగా ఉంటే.. జాతకంలో గురు దోషం ఏర్పడుతుందట. ఈ ప్రతికూల ప్రభావాన్ని వదిలించుకోవడానికి మీరు పసుపు నీటితో స్నానం చేస్తే మంచి ప్రయోజనం ఉంటుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. జ్యోతిషశాస్త్రపరంగా పసుపు గణేశుడి రూపం కాబట్టి.. దీనిని అనుసరించడం వల్ల గణపతి అనుగ్రహం కూడా మీకు లభిస్తుందట.

సామరస్యాన్ని పెంపొందిస్తుంది : ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరి పెళ్లిలో హల్దీ వేడుక కామన్ అయిపోయింది. ఈ వేడుకలో పసుపు నీటి స్నానం ప్రధానంగా ఉంటుంది. పసుపు చెడును దూరం చేస్తుందని నమ్ముతారు. ఇంకా.. మంచి శ్రేయస్సు, ఆనందాన్ని తీసుకురావాలనే కోరికతో వివాహానికి ముందు ఈ వేడుక జరుపుతారు. ఇలా చేయడం చాలా మంచిదని చెబుతున్నారు. పసుపు నీటితో స్నానం చేయడం వలన మీ కుటుంబ సంబంధాల్లో సామరస్యాన్ని పెంపొందించుకోవచ్చని అంటున్నారు.

అనేక ఆరోగ్య ప్రయోజనాలు : పసుపులో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన చర్మానికి అనేక ప్రయోజనాలను కలిగిస్తాయి. మొటిమలు, మచ్చలు పిగ్మెంటేషన్ వంటి చర్మ సమస్యలను దూరంగా ఉంచడంలో పసుపు నీటి స్నానం చాలా బాగా సహాయపడుతుంది. అయితే.. మీకు నిరంతర చర్మ సమస్యలు ఉంటే.. పసుపు నీటితో స్నానం చేసే ముందు ఒకసారి చర్మవ్యాధి నిపుణుడిని సంప్రదించడం మంచిది.

మీరు వంటల్లో వాడుతున్న పసుపు కల్తీ కావొచ్చు - ఇప్పుడే చెక్ చేసుకోండిలా!

బెల్లం పసుపుతో కలిపి తింటే ఏమవుతుందో తెలుసా? అస్సలే వదిలి పెట్టరు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.