ETV Bharat / state

ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

author img

By ETV Bharat Telangana Team

Published : Feb 26, 2024, 3:34 PM IST

Updated : Feb 26, 2024, 5:17 PM IST

LRS Applications Telangana 2024 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2020 ఏడాదిలో స్వీకరించిన ఎల్‌ఆర్ఎస్ దరఖాస్తులపై కీలక నిర్ణయం తీసుకున్న సర్కార్, మార్చి 31వ తేదీలో లే అవుట్‌లను క్రమబద్ధీకరణ చేసుకునే అవకాశం ఇస్తున్నట్లు తెలిపింది.

LRS Applications Telangana 2024
LRS Applications Telangana 2024

LRS Applications Telangana 2024 : ఎల్ఆర్ఎస్ దరఖాస్తులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. 2020లో స్వీకరించిన ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులపై కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 31వ తేదీలోగా దరఖాస్తుదారులకు లే-అవుట్‌ల క్రమబద్ధీకరణ చేసుకునే అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది. గతంలో రూ.వెయ్యి చెల్లించి దరఖాస్తు చేసుకున్న వారికి అవకాశం కల్పించింది.

ఆదాయ సమీకరణ, వనరులపై నిర్వహించిన సమీక్షలో సీఎం రేవంత్‌ రెడ్డి (CM Revanth Review Today) ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. వివాదాలు, కోర్టు ఆదేశాలు ఉన్న భూములు, దేవాదాయ, వక్ఫ్, ప్రభుత్వ భూములు మినహా ఇతర లేఔట్ల ప్లాట్లకు అవకాశం కల్పించింది. ప్రభుత్వ నిర్ణయంతో 20 లక్షల మంది దరఖాస్తుదారులకు ప్రయోజనం చేకూరనుంది. రాష్ట్ర ప్రభుత్వం తాజా నిర్ణయంతో గత మూడున్నరేళ్లుగా ఎంతో మంది ఎదురుచూపులకు తెరపడింది.

Telangana Govt On LRS Applications : నగర, పురపాలికలు, పంచాయతీల పరిధిలో అక్రమ లేఅవుట్ల (Layout Regularization)లోని ప్లాట్లను క్రమబద్ధీకరించేందుకు 2020లో గత కేసీఆర్ ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించింది. అనధికార లే-అవుట్లు, అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణకు అవకాశం ఇస్తూ ఎల్ఆర్ఎస్ (ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్) ప్రవేశపెట్టింది. ఎల్ఆర్ఎస్ రిజిస్ట్రేషన్ ఫీజును రూ.1000గా.. లే అవుట్ అప్లికేషన్ ఫీజును రూ.10,000గా ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ పథకం కింద మొత్తం 25 లక్షలకు పైగా దరఖాస్తులు అందాయి.

How To Check TS LRS Application Status 2023: తెలంగాణ LRS అప్లికేషన్​ స్టేటస్​.. ఇలా తెలుసుకోండి!

ఈ పథకం కింద 100 గజాలలోపు ప్లాటు కలిగి ఉన్న వాళ్లు రెగ్యులరైజేషన్ (Land Regularization Scheme) ఛార్జీల కింద గజానికి రూ.200 చెల్లించాల్సి ఉండగా, 100 నుంచి 300 గజాల వరకు ఉన్న స్థలాలకు రెగ్యులరైజేషన్ ఛార్జీలు గజానికి రూ.400, 300 నుంచి 500 గజాల వరకు గజానికి రూ.600 రెగ్యులరైజేషన్ ఛార్జీలు చెల్లించాలి. మున్సిపాలిటీలతో పాటు గ్రామ పంచాయతీలకు కూడా ఈ ఎల్ఆర్ఎస్ స్కీమ్ వర్తిస్తుందని గత ప్రభుత్వం వెల్లడించింది.

ఈ లేఅవుట్ల క్రమబద్ధీకరణను చేపట్టే క్రమంలో న్యాయస్థానాల్లో వ్యాజ్యాలు దాఖలు కావడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. మరోవైపు ఎన్నికలు రావడం, రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరడంతో ఎల్‌ఆర్ఎస్‌పై దరఖాస్తుదారులకు నెమ్మదిగా ఆశలు సన్నగిల్లాయి. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల సంగతి ఏంటన్న విషయంపై అయోమయం ఏర్పడింది.

ఈ నేపథ్యంలో ఇటీవల బడ్జెట్ రూపకల్పన చేస్తున్న సమయంలో ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka On LRS) ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై దృష్టి సారించారు. పెండింగ్ దరఖాస్తుల వివరాలపై అధికారులను ఆరా తీశారు. ఈ క్రమంలోనే ఈ వ్యవహారంలో ప్రభుత్వం దరఖాస్తుదారులకు పూర్తి సహకారం అందిస్తుందని అభయమిచ్చారు. ఈ నేపథ్యంలో తాజాగా ఎల్‌ఆర్‌ఎస్‌పై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది.

LRS: ఎల్​ఆర్​ఎస్​ లేఅవుట్ల పరిశీలనకు ప్రభుత్వం మార్గదర్శకాలు

ఆదాయ లక్ష్యం పూర్తి చేయాల్సిందే - సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం

Last Updated : Feb 26, 2024, 5:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.