ETV Bharat / health

రోజూ అరటిపండు తింటే బరువు పెరుగుతారా? తగ్గుతారా?

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 16, 2024, 4:22 PM IST

Bananas Health Benefits : ఆరోగ్యానికి మంచి చేసే పండ్ల లిస్ట్​లో అరటి పండు ఫస్ట్​ ప్లేస్​లో ఉంటుంది. అయితే, చాలా మందికి వచ్చే సందేహం.. డైలీ అరటిపండు తింటే బరువు పెరుగుతామా? తగ్గుతామా? అని. మరి దీనిపై నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం.

Bananas Health Benefits
Banana

Daily Eating Bananas Causes Weight Gain : ఫ్రూట్స్​ అంటే చాలా మందికి ఇష్టం. అందులో మెజార్టీ పీపుల్ అరటిపండు వైపు మొగ్గు చూపుతుంటారు. నిజానికి అరటిపండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇందులో పొటాషియం, పీచు, ఆరోగ్య‌క‌ర కొవ్వులు, విట‌మిన్లు సమృద్ధిగా ఉంటాయి. ఫలితంగా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ లభిస్తాయి. ఇదిలా ఉంటే.. కొందరికి అరటిపండు గురించి రకరకాల అపోహాలు ఉంటాయి. అందులో ముఖ్యంగా ఎక్కువ మందికి డైలీ బనానా తింటే బరువు పెరుగుతామా? తగ్గుతామా? అనే సందేహం వస్తుంటుంది. మరి దీనిపై నిపుణులు ఏమంటున్నారో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

మనకు మార్కెట్​లో సీజన్​తో సంబంధం లేకుండా చౌక ధరకు లభించే అరటి పండ్లు.. బరువు తగ్గడం, పెరగడం రెండింటిలోనూ సహాయపడతాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే అవి కార్బోహైడ్రేట్లు, కేలరీల సరైన సమతుల్యతను కలిగి ఉంటాయి. నిజానికి అరటిపండ్లు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తున్నప్పటికీ, మితంగా తీసుకోవడం చాలా కీలకమంటున్నారు నిపుణులు.

అరటి పండ్లు ఆరోగ్యానికి మంచివే - కాని అతిగా తింటే ఈ ప్రాబ్లమ్స్ గ్యారెంటీ!

బరువు పెరగడానికి అరటిపండ్లు ఏ విధంగా తోడ్పడతాయంటే.. ఆరోగ్యానికి మంచి చేసే పండ్ల లిస్టులో అరటిపండ్లు ముందు వరుసలో ఉంటాయి. కానీ, వాటిని రోజూ మోతాదుకి మించి తింటే స్థూలకాయానికి ఆహ్వానం పలికినట్లేనని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే అరటిపండ్లలో చక్కెర, కేలరీలు ఎక్కువగా ఉంటాయి. వీటిలో ఉండే చక్కెర సహజమైనది. దీనిని బాడీ త్వరగా గ్రహించదు. సాధారణంగా ఒక బనానాలో సుమారు 105 కేలరీలు ఉంటాయి. అదే మీరు డైలీ ఒకటి కంటే ఎక్కువ బనానాలను తింటే శరీరానికి కావాల్సిన దానికంటే ఎక్కువ కేలరీలు అందుతాయి. అంటే డైలీ 2 నుంచి 3 అరటిపండ్లు తినడం వల్ల 350 అదనపు కేలరీలు శరీరానికి అందుతాయి. ఫలితంగా బరువు పెరిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు నిపుణులు.

బరువు తగ్గడానికి అరటిపండ్లు ఏ విధంగా మేలు చేస్తాయంటే.. బరువు తగ్గాలనుకునే వారికి అరటిపండు చాలా బాగా ఉపయోగపడుతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే దీనిలో ఫైబర్, ప్రొటీన్స్ పుష్కలంగా ఉంటాయి. ఫలితంగా ఇవి తింటే త్వరగా ఆకలి వేయదు. ఎక్కువ సేపు కడుపు నిండిన భావనను కలిగిస్తుంది. దాంతో కేలరీలు ఎక్కువగా తీసుకునే ప్రమాదం ఉండదు. దీంతో ఈజీగా బరువు తగ్గొచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయమేమిటంటే.. రోజు అరటిపండును మితంగా తినడం చాలా అవసరం. అంతేకాదు, ఆస్ట్రేలియా పరిశోధకులు చేసిన ఓ అధ్యయనం ప్రకారం.. జీర్ణక్రియ సంబంధింత ఇరిటబుల్ బొవెల్ సిండ్రోమ్, క్రోన్స్ వ్యాధిని దూరం చేయగలదు అరటిపండు.

అర‌టి తొక్కే అని తేలిగ్గా పారేయ‌కండి- ఇలా వాడితే మెరిసే చ‌ర్మం మీ సొంతం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.