ETV Bharat / entertainment

న్యూయార్క్​లో 'హాయ్‌ నాన్న' సందడి - బెస్ట్ యాక్టర్​ సహా 11 అవార్డులు సొంతం - Hi Nanna Awards

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 9, 2024, 6:46 AM IST

Hi Nanna Awards : నాని, మృణాల్ ఠాకూర్ లీడ్ రోల్స్​లో వచ్చిన 'హాయ్​ నాన్న' మూవీ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. న్యూయార్క్‌లో జరిగిన 'ది ఒనిరోస్‌ ఫిల్మ్ అవార్డ్స్​' ఈవెంట్​లో 11 అవార్డులు సొంతం చేసుకుంది.

Hi Nanna Awards
Hi Nanna Awards

Hi Nanna Awards : నేచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్ లీడ్ రోల్స్​లో వచ్చిన 'హాయ్‌ నాన్న' మూవీ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. ఇంత వరకు పాన్​ ఇండియా లెవెల్​లో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న ఈ చిత్రం న్యూయార్క్‌లో జరిగిన 'ది ఒనిరోస్‌ ఫిల్మ్ అవార్డ్స్​' ఈవెంట్​లో పలు అవార్డులను సైతం సొంతం చేసుకుంది. 'హాయ్​ డాడీ' అనే పేరుతో ఈ చిత్రాన్ని ఓవర్సీస్​లో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.

బెస్ట్ మూవీ, బెస్ట్ హీరో, బెస్ట్ హీరోయిన్​, బెస్ట్ పెయిర్, బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్​, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ స్క్రీన్​ ప్లే, బెస్ట్ డెబ్యూ డైరెక్టర్, బెస్ట్​ సినిమాటోగ్రఫీ, బెస్ట్​ సౌండ్‌ ట్రాక్‌, బెస్ట్ ఎడిటింగ్‌ల్స్​ ఇలా మొత్తం 11 విభాగాల్లో అవార్డులను సొంతం చేసుకుంది.

ఇక ఈ అవార్డులను గెలుచుకున్న విషయంపై డైరెక్టర్ శౌర్యువ్​, హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ఆనందం వ్యక్తం చేశారు. "ఇంత ప్రతిష్ఠాత్మక అవార్డులను సొంతం చేసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. హయ్‌ నాన్న కోసం మేమంతా పడిన కష్టానికి ఫలితమిది. ఈ చిత్రాన్ని ఇంతగా ఆదరించిన ప్రేక్షకులకు మా హృదయపూర్వక ధన్యవాదాలు. స్టార్స్, సిబ్బంది సపోర్ట్‌ వల్లే ఇదంతా సాధ్యమైంది" అని శౌర్యువ్​ అన్నారు.

"ఒనిరోస్‌ ఫిల్మ్ అవార్డులను గెలుచుకోవడం అనేది నాకు చాలా థ్రిల్‌గా ఉంది. దీంతో నా కల నెరవేరింది. స్టోరీ బాగుంటే సినిమాకు ఎక్కడైనా ఆదరణ లభిస్తుంది. ఈ మూవీలో నేను పోషించిన య‌ష్న రోల్ నాకు జీవితమంతా గుర్తుంటుంది. మూవీ టీమ్​తో పని చేయడం నాకు గొప్ప అనుభూతినిచ్చింది" మృణాల్ ఎమోషనల్ అయ్యారు.

ఇక హాయ్​ నాన్న సినిమా విషయానికి వస్తే - ఇందులో నేచురల్ స్టార్ నానితో పాటు మృణాల్ ఠాకూర్​, జయరామ్​, బేబీ కియారా ఖన్నా కీలక పాత్రలు పోషించారు. డెబ్యూ డైరెక్టర్ శౌర్యువ్ ఈ సినిమాను తెరకెక్కించగా, హృదయం ఫేమ్​ హేషమ్ అబ్దుల్ వహబ్ ఈ చిత్రానికి చక్కటి సంగీతాన్ని అందించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఓటీటీలోనూ 'హాయ్​నాన్న' మేనియా- స్ట్రీమింగ్​లో 'నాని'దే టాప్​ ప్లేస్!

'ఫలితాలు పట్టించుకోను - నచ్చిన పని చేసుకుంటూ వెళ్లిపోతాను'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.