ETV Bharat / bharat

ఎలాంటి యోగాసనాలైనా ఫుల్ ఈజీగా!- 'హర్షిక' సూపర్ టాలెంట్​- ఇంటి నిండా మెడల్సే!! - Child Expert In Yoga

Yoga Child Expert In Uttarakhand : కష్టమైన యోగాసనాలు వేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది ఏడేళ్ల బాలిక. జాతీయ స్థాయిలో పతకాలు సాధిస్తూ ఔరా అనిపిస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో రాణించడమే లక్ష్యంగా సాగుతున్న ఆ చిన్నారి చిచ్చరపిడుగు ఎవరు? ఆమె ప్రతిభ ఎంటో ఇప్పుడు చూద్దాం.

author img

By ETV Bharat Telugu Team

Published : May 12, 2024, 4:50 PM IST

Yoga Child Expert In Uttarakhand
Yoga Child Expert In Uttarakhand (ETV Bharat)
ఎలాంటి యోగాసనాలైనా ఫుల్ ఈజీగా!- 'హర్షిక' సూపర్ టాలెంట్ (ETV Bharat)

Yoga Child Expert In Uttarakhand : కష్టతరమైన యోగాసనాలను సులువుగా వేస్తూ అబ్బురపరుస్తోంది ఓ ఏడేళ్ల బాలిక. చిన్నతనం నుంచే యోగాపై ఆసక్తి పెంచుకుని రాష్ట్ర, జాతీయ స్థాయిలో అనేక అవార్డులను సొంతం చేసుకుంది. సంప్రదాయ యోగా పోటీల్లో నాలుగో స్థానాన్ని సంపాదించింది. యోగా మాత్రమే కాకుండా జిమ్నాస్టిక్స్​లోనూ రాణిస్తోంది ఉత్తరాఖండ్​కు చెందిన హర్షికా రిఖాడీ.

7 Year Old Yoga Prodigy In Uttarakhand
హర్షిక (ETV Bharat)

"నా పేరు హర్షికా రిఖాడీ. నాకు ఏడు సంవత్సరాలు. మూడో తరగతి చదువుతున్నాను. నేను యాక్షన్​ వరల్డ్​ జిమ్నాస్టిక్స్​ సెంటర్​ నీరజ్​ ధపోలా ఆధ్వర్యంలో శిక్షణ తీసుకుంటున్నాను. నేను మొదటగా జిల్లా స్థాయిలో రెండు గోల్డ్​ మెడల్స్​ గెలిచాను. రాష్ట్ర స్థాయిలో ఒక గోల్డ్​, ఒక కాంస్య పతకం, నేషనల్​ లెవెల్​లో ఒక కాంస్య పతకం సాధించాను"

--హర్షికా రిఖాడీ

చిన్నతనంలోనే యోగా రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది హల్ద్వానీకి చెందిన హర్షిక. యోగాతో పాటు జిమ్నాస్టిక్స్​లోనూ శిక్షణ తీసుకుంటుంది. కాగా, హర్షికకు చిన్నప్పటి నుంచే యోగాపై ఆసక్తి ఉందని, గత రెండేళ్లుగా ఇందులో శిక్షణ పొందుతోందని బాలిక తండ్రి భువన్ రిఖాడీ తెలిపారు. హర్షికకు డ్యాన్స్​ అంటే కూడా చాలా ఇష్టమని ఆమె తల్లి మోనికా రిఖాడీ తెలిపారు. యోగాతో పాటు డ్యాన్స్​ పోటీల్లోనూ హర్షిక పాల్గోంటోందని ఆమె చెప్పారు.

7 Year Old Yoga Prodigy In Uttarakhand
హర్షిక (ETV Bharat)

"హర్షికకు చిన్నప్పటి నుంచి యోగాపై ఆసక్తి ఉంది. ఆమె శరీరం కూడా చాలా ఫ్లెక్సిబుల్​గా ఉంటుంది. అందుకే ఆమెకు యోగాలో శిక్షణ ఇప్పించాము. యోగా వల్ల శరీరం, మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉంటుంది."

--మోనికా రిఖాడీ, హర్షిక తల్లి

అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించి ఉత్తరాఖండ్​కు​ మంచి పేరు తీసుకురావడమే తన లక్ష్యం అంటోంది హర్షిక. చిన్న వయసులోనే యోగా రంగంలో దూసుకెళుతున్న ఈ చిన్నారి మరిన్ని పతకాలు సాధించాలని తల్లిదండ్రులు, స్థానికులు కోరుకుంటున్నారు.

7 Year Old Yoga Prodigy In Uttarakhand
హర్షిక (ETV Bharat)

11నెలల వయసులో స్కేటింగ్!
11నెలల వయస్సులో చిన్నారులు, ఎక్కువగా నిద్రతోనే కాలక్షేపం చేస్తూ ఉంటారు. నిద్రలేస్తే బొమ్మలతో ఆడుకుంటూ ఉంటారు. కానీ చైనాకు చెందిన వాంగ్​ యుజి మాత్రం ఏకంగా స్నోబోర్డ్​ ఎక్కేసి మంచులో రయ్​ రయ్​ అంటూ దూసుకెళ్లిపోతోంది. కాళ్లకు షూ, చేతులకు గ్లౌజులు, వంటి మీద స్వెటర్​ తలమీద హెల్మెట్​, దానిపైన కూలింగ్​ గ్లాసెస్​తో స్టైలిష్​గా స్నోబోర్డింగ్​ చేసేస్తోంది వాంగ్​ యుజి. ఆ ముద్దులొలికే వీడియో చూడాలంటే ఈ లింక్​పై క్లిక్​ చేయండి.

ఆస్పత్రిలో చేరిన మాజీ సీఎం- ఎస్​ఎం కృష్ణకు ICUలో చికిత్స - Former Karnataka CM Krishna in ICU

బహిరంగ చర్చకు రాహుల్​ సిద్ధం- ప్రధాని స్పందనేంటో చెప్పండంటూ ట్వీట్! - Lok Sabha Elections 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.