ETV Bharat / bharat

ఆస్పత్రిలో చేరిన మాజీ సీఎం- ఎస్​ఎం కృష్ణకు ICUలో చికిత్స - Former Karnataka CM Krishna in ICU

author img

By ETV Bharat Telugu Team

Published : May 12, 2024, 7:50 AM IST

Updated : May 12, 2024, 4:34 PM IST

Former Karnataka CM Krishna in ICU : కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్​ఎం కృష్ణ(92) అనారోగ్య సమస్యలు కారణంగా ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

Former Karnataka CM Krishna in ICU
Former Karnataka CM Krishna in ICU (ETV Bharat)

Former Karnataka CM S M Krishna in ICU : కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్​ఎం కృష్ణ(92) ఆస్పత్రిలో చేరారు. ఇటీవలె అనార్యోగంతో మణిపాల్​ ఆస్పత్రిలో చేరిన ఆయన ప్రస్తుతం ఐసీయూలో చిక్సిత పొందుతున్నారని డాక్టర్లు తెలిపారు. శ్వాసకోశ ఇన్​ఫెక్షన్​తో బాధపడుతూ కృష్ణ ఏప్రిల్ 21న బెంగళూరులోని వైదేహి ఆస్పత్రిలో చేరారు. అనంతరం ఏప్రిల్ 29న మణిపాల్ ఆస్పత్రికి తరలించారు. స్పెషలిస్ట్ డాక్టర్ సత్యనారాయణ, డాక్టర్ సునీల్ కారంత్ నేతృత్వంలోని క్రిటికల్ కేర్ టీమ్ చికిత్స అందిస్తున్నారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

సిద్ధరామయ్య పరామర్శ
ఈ క్రమంలోనే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మణిపాల్ ఆస్పత్రికి వెళ్లి కృష్ణ పలకరించారు. అలాగే ఆయనకు అందిస్తున్న చికిత్స గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

రాజకీయాలకు గుడ్​బై
గతేడాదే క్రియాశీల రాజకీయాల ఎస్​ఎం కృష్ణ గుడ్​ బై చెప్పారు. వయసు దృష్ట్యా రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. తొంబైల్లో యాభైలా తాను ఉండలేనని అందుకే రాజకీయాలకు దూరంగా ఉండాలని అనుకుంటున్నానని చెప్పారు. తాను రాజకీయాలను వీడాలనుకున్న విషయాన్ని బీజేపీ పెద్దగా పట్టించుకోలేదని ఆ సమయంలో ఆవేదన వ్యక్తం చేశారు. నా వయసు రీత్యా స్వచ్ఛందంగా పదవీ విరమణ చేశానని తెలిపారు.

ఎస్ఎం కృష్ణ కాంగ్రెస్ పార్టీలో ఎన్నో కీలక పదవులను అనుభవించారు. 2004 నుంచి 2008 వరకు కర్ణాటక సీఎంగా పనిచేశారు. తర్వాత రాజ్యసభకు ఎన్నికయ్యారు. కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. ఆ తర్వాత గవర్నర్​ పదవిని చేపట్టారు. కొన్నేళ్ల క్రితం కాంగ్రెస్​ను వీడి బీజేపీలో చేరాను. కొద్ది కాలానికే రాజకీయాలకు గుడ్​బై చెప్పారు.

Last Updated : May 12, 2024, 4:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.