తెలంగాణ

telangana

Jagan Cock Fight knife Case Hearing Adjourned వాయిదాల పర్వంలో కోడికత్తి కేసు.. తదుపరి విచారణ డిసెంబర్‌ 15కి వాయిదా

By ETV Bharat Telugu Team

Published : Oct 27, 2023, 6:13 PM IST

Updated : Oct 27, 2023, 7:53 PM IST

Kodikatthi_Case_Hearing_Updates

Kodikatthi Case Hearing Adjourned to December 15: రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన కోడి కత్తి కేసు విచారణ.. వాయిదా పర్వంలో కొనసాగుతోంది. ఇవాళ జరిగిన కేసు విచారణను విశాఖపట్నంలోని ఎన్​ఐఏ ప్రత్యేక కోర్టు డిసెంబర్ 15కి వాయిదా వేసింది. ఇలాంటి కేసుల్లో నిందితులకు ఐదేళ్ల పాటు శిక్ష పడటం తన జీవితంలో చూడలేదని నిందితుడు శ్రీనివాస్ తరఫు న్యాయవాది సలీం అన్నారు. వాంగ్మూలం ఇచ్చేందుకు సీఎం జగన్ ముందుకు రావడం లేదన్నారు. రాజకీయ కోణం వల్లే ఈ కేసు ఇన్నేళ్లు సాగుతోందని మండిపడ్డారు. 

Lawyer Salim Comments:''కోడి కత్తి కేసుపై ఈరోజు విశాఖ ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో విచారణ జరిగింది. తదుపరి విచారణను కోర్ట్ డిసెంబర్ 15కు వాయిదా వేసింది. నిందితుడి బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ వేశాం. బెయిల్‌ పిటిషన్‌పై మరో వారం రోజుల్లో తీర్పు వస్తుంది. ఇలాంటి కేసులో ఐదేళ్ల శిక్ష పడటం నా జీవితంలో ఎప్పుడు చూడలేదు. వాంగ్మూలం ఇచ్చేందుకు ముఖ్యమంత్రి జగన్‌ ముందుకు రావట్లేదు. రాజకీయ కోణం వల్లే ఈ కేసు ఇన్నేళ్లు సాగుతోంది. హైకోర్టు ఇచ్చిన 8 వారాల స్టే రద్దు కోసం పిటిషన్ వేస్తాం.'' అని నిందితుడు శ్రీనివాస్‌ తరఫు లాయర్‌ సలీం అన్నారు.

Accused Srinivas Bail Petition Investigation:మరోవైపు కోడికత్తి కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ.. నిందితుడు శ్రీనివాసరావు తాజాగా హైకోర్టులో వేసిన పిటిషన్​పై దసరా వెకేషన్ బెంచ్ విచారణ జరిపింది. విచారలో.. గత ఐదేళ్లుగా నిందితుడు జైల్లోనే మగ్గుతున్నాడని, విశాఖ ఎన్​ఐఏ కోర్టులో జరుగుతున్న ట్రయల్ విచారణను 8వారాల పాటు నిలిపివేయాలని ఇటీవల హైకోర్టు ఆదేశించిందని.. పిటిషనర్ తరుఫు న్యాయవాది న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు. కేసులో బాధితుడిగా ఉన్న సీఎం జగన్.. లోతైన విచారణ కావాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయటంతో ఈ మేరకు ఆదేశాలిచ్చిందన్నారు. దీంతో బెయిల్ పిటిషన్​లో కౌంటర్ దాఖలు చేసేందుకు ఎన్ఐఏ తరపు న్యాయవాది సమయం కోరారు. తదుపరి విచారణను న్యాయస్థానం వచ్చే వారానికి వాయిదా వేసింది.

Last Updated :Oct 27, 2023, 7:53 PM IST

ABOUT THE AUTHOR

...view details