తెలంగాణ

telangana

గుండెజబ్బు ఉన్నవాళ్లు శృంగారంలో పాల్గొనకూడదా..?

By

Published : Mar 9, 2022, 8:16 AM IST

Sex Education: గుండెనొప్పి వచ్చినవారు శృంగారంలో పాల్గొనకూడదా?. ఒకవేళ పాల్గొంటే ఏమౌతుంది. గుండెనొప్పికి.. సెక్స్​కు సంబంధం ఏంటీ? డాక్టర్లు ఏం చెబుతున్నారో తెలుసుకోండి.

Sex Education
శృంగారం

Sex Education: శృంగారంలో పాల్గొనకపోవడానికి అనేక కారణాలు ఉంటాయి. ఆరోగ్య సంబంధ విషయాలతో పాటు మానసికమైన విషయాలు కూడా ఉంటాయి. అయితే.. వీటన్నింటికి తోడు కొన్ని అనుమానాలు కూడా సెక్స్ చేయలేకపోవడానికి కారణాలవుతాయి. షుగర్ వ్యాధి వస్తే.. ఎక్కువ సార్లు శృంగారంలో పాల్గొనకూడదా?. గుండెపోటు వస్తే అసలు సెక్స్ వైపు ఆలోచించకూడదా? ఇవన్ని నిజమో కాదో చాలా మందికి తెలియదు. దీనిపై డాక్టర్లు ఏం చెబుతున్నారో ఓ సారి చూద్దాం..!

గుండె నొప్పి చాలారకాలుగా ఉంటుంది. మీకున్న సమస్య ఎలాంటిదో ముందు టెస్టు చేయించుకోవాలి. అసలు మీకున్నది గుండె నొప్పా? కాదా? తెలుసుకోవాలి. గుండె నాళాలు సన్నబడటం సాధారణంగా నొప్పికి కారణమౌతుంది. ఇలాంటి సందర్భాల్లో నైట్రేట్ బిల్లలు వాడుతూ సెక్స్​లో పాల్గొనవచ్చు. కానీ తీవ్రతరమైన గుండె జబ్బు ఉంటేమాత్రం డాక్టర్ల సలహా మేరకు శృంగారంలో పాల్గొనాలి. సెక్స్​లో పాల్గొనేప్పుడు ఒత్తిడితో రక్తం ఎక్కువ ప్రసరణ కాలేని సందర్భాలు ఎదురవుతాయి. దీనివల్ల గుండె నొప్పి ఎక్కువ అయ్యే ప్రమాదాలు ఉంటాయి. కావునా, డాక్టర్ల సలహాలను పాటించాలి. సొంత నిర్ణయాలు తీసుకోకూడదు.

ఇదీ చదవండి:పురుషుల్లో స్వప్న స్కలనం ఎందుకు జరుగుతుందంటే..?

ABOUT THE AUTHOR

...view details