తెలంగాణ

telangana

ఈ సమస్యలా?.. మీరు సెక్స్ చేయడం కష్టమే!

By

Published : Sep 4, 2021, 9:45 AM IST

Updated : Sep 5, 2021, 12:51 PM IST

శృంగార జీవితాన్ని ఎంజాయ్ చేయాలని దంపతులు ఆశిస్తుంటారు. కానీ, పురుషుల్లో ఉండే కొన్ని సమస్యలు వారి సెక్స్​ జీవితానికి అడ్డంకిగా మారుతుంటాయి. ఈ నేపథ్యంలో ఈ బలహీనతల్ని అధిగమించడం ఎలానో తెలుసుకుందాం.

sex life
శృంగార జీవితం

శృంగారంలో పాల్గొనేటప్పుడు భార్యాభర్తలిద్దరూ ఈ లోకాన్ని మర్చిపోయి తీయని అనుభూతుల్లో తేలియాడుతుంటారు. ఆ సమయంలో కొంతమంది మగాళ్లలో మాత్రం సెక్స్ బలహీనతలు అనేవి ఉంటాయి. ముఖ్యంగా శీఘ్రస్కలనం త్వరగా జరగడం, అసలు వీర్యం రాకపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. రతిలో ఎక్కువ సేపు పాల్గొనాలని వారు రకరకాలు ప్రయత్నాలు చేస్తుంటారు.

ఇవేకాకుండా కొంత మంది మగవాళ్లలో ఉన్న దీర్ఘకాలిక సమస్యలు వారి సెక్స్​ బలహీనతల్ని బయటపెడుతుంటాయి. అసలు మగవాళ్లలోనే సెక్స్​ బలహీనత ఎక్కువగా ఎందుకు ఉంటుంది?. దీన్ని అధిగమించి వారు శృంగార జీవితాన్ని ఆస్వాదించాలంటే ఏం చేయాలి?. ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ సమస్యలే కారణమా..?

పురుషుల్లో డయాబెటిస్​, కొలెస్ట్రాల్, బీపీ మొదలైన శారీరక జబ్బులు ఉండటం వల్ల సెక్స్​ జీవితంపై ప్రభావం చూపిస్తుంది. ఈరోజుల్లో చాలా మంది మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. సైకలాజికల్ స్ట్రెస్​ వల్ల కూడా శృంగార జీవితాన్ని ఆస్వాదించలేకపోతున్నారు.

కొందరు.. ఆర్థిక సమస్యలు లేదా ఇతర సమస్యల కారణంగా డిప్రెషన్​కు గురవుతుంటారు. ఈ సమస్య పురుషుల్లో ఎక్కువగా ఉంటుంది. ఇవికాకుండా హార్మోన్లు తక్కువగా ఉండటం వంటి సమస్యలూ ఉంటాయి. ఇవి సెక్స్​ జీవితానికి అడ్డంకిగా మారతాయి. స్ట్రెస్​ను అధిగమిస్తే.. సెక్స్​ జీవితాన్ని ఎంజాయ్ చేయొచ్చు.

ఇదీ చదవండి:పగలు సెక్స్ చేస్తే పిల్లలు పుట్టరా?

Last Updated :Sep 5, 2021, 12:51 PM IST

ABOUT THE AUTHOR

...view details