తెలంగాణ

telangana

పసిపాపపై హత్యాచారం కేసులో ముద్దాయికి ఉరిశిక్ష

By

Published : Aug 8, 2019, 2:17 PM IST

Updated : Aug 8, 2019, 2:47 PM IST

వరంగల్​ జిల్లాలో 9 నెలల చిన్నారిపై జరిగిన అత్యాచారం, హత్య కేసులో నిందితుడికి ఉరిశిక్ష పడింది. వరంగల్​ జిల్లా అదనపు కోర్టు తీర్పును ఇవాళ వెలువరించింది.

పసిపాపపై హత్యాచారం కేసులో ముద్దాయికి ఉరిశిక్ష

వరంగల్​ అర్బన్​ జిల్లా హన్మకొండలోని కుమార్​పల్లిలో 9 నెలల చిన్నారిపై జరిగిన అత్యాచారం, హత్య కేసులో నిందితుడికి ఉరిశిక్ష పడింది. వరంగల్​ జిల్లా అదనపు కోర్టు తీర్పును ఇవాళ వెలువరించింది. ముద్దాయి ప్రవీణ్‌కు ఉరిశిక్ష విధించింది న్యాయస్థానం. జూన్‌ 18న రాత్రి తల్లి పొత్తిళ్లలో నిద్రిస్తున్న పసిపాపను ఎత్తుకెళ్లి...అత్యాచారానికి పాల్పడి హత్య చేశాడు ప్రవీణ్. ఘటనను తీవ్రంగా పరిగణించిన వరంగల్‌ పోలీసులు వేగంగా దర్యాప్తు జరిపి 20 రోజుల్లోపే కోర్టులో ఛార్జిషీట్‌ దాఖలు చేశారు. ఈ కేసులో 30 మందికిపైగా సాక్షులను విచారించిన న్యాయస్థానం... నిందితుడు ప్రవీణ్​కు ఉరిశిక్ష విధిస్తూ న్యాయమూర్తి జయకుమార్‌ తీర్పు వెలువరించారు. ఘటన జరిగిన 50 రోజుల్లోనే కేసు విచారణ పూర్తైంది.

పసిపాపపై హత్యాచారం కేసులో ముద్దాయికి ఉరిశిక్ష
Intro:డిజిటల్ తరగతులు ప్రారంభించిన ఎంపీపీ జడ్పిటిసి


Body:రంగారెడ్డి జిల్లా చేవెళ్ల బాలురు ప్రాథమిక పాఠశాలలో డిజిటల్ తరగతులు ప్రారంభించిన జడ్పిటిసి ఎంపీపీ. పేద విద్యార్థులకు నాణ్యమైన బోధనకు ఆర్థిక సహాయం అందజేసిన న ప్రజా ప్రతినిధులు ముందుకు రావడం సంతోషకర విషయం అని కావాల్సిన సౌకర్యాల కోసం ఆర్థికంగా సహాయం అందించిన ప్రజాప్రతినిధులకు ఎండిఓ అక్బరుద్దీన్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రొజెక్టర్ ను జెడ్పిటిసి మాలతి, పాఠశాల గేటు ఏర్పాటు చేసిన ఎంపీపీ విజయలక్ష్మి రమణారెడ్డి ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా పాఠశాల అభివృద్ధి కోసం దాతలు 3 లక్షల వరకు ఆర్థిక సహాయం అందించడం జరిగిందని ప్రధానోపాధ్యాయులు ఖాజాపాషా తెలిపారు.


Conclusion:రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సుభాష్ రెడ్డి
Last Updated :Aug 8, 2019, 2:47 PM IST

ABOUT THE AUTHOR

...view details