తెలంగాణ

telangana

కళాకారులకు ఓరుగల్లు పుట్టినిల్లు: ఎర్రబెల్లి

By

Published : Aug 13, 2019, 12:08 PM IST

ఉమ్మడి రాష్ట్రంలో కళాకారులకు అన్యాయం జరిగిందని..... తెలంగాణ వచ్చాక వారిని ప్రోత్సహిస్తున్నామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు అన్నారు.

కళాకారులకు ఓరుగల్లు పుట్టినిల్లు


కళాకారులకు ఓరుగల్లు పుట్టినిల్లులాంటిదని... ప్రభుత్వం తరఫున వారికి సహాయ సహకారాలు అందిస్తామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. వరంగల్ అర్బన్ జిల్లాలో శ్రీ శాంతికృష్ణ సేవా సమితి 34వ వార్షికోత్సవం సందర్భంగా హన్మకొండలో అంతర్జాతీయ ఆచార్య ఆరాధానోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ స్పీకర్ మధుసూదనాచారి హాజరయ్యారు. తొమ్మిది రంగాలలో సేవలందించిన వారికి అవార్డులు ప్రదానం చేశారు. సేవారంగంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు నిర్వాహకులు అవార్డు ప్రదానం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో కళాకారులకు అన్యాయం జరిగిందని..... తెలంగాణ వచ్చాక కళాకారులను ప్రోత్సహిస్తున్నామని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

కళాకారులకు ఓరుగల్లు పుట్టినిల్లు
Intro:Tg_wgl_01_13_manthri_errabelli_on_kalakarulu_av_ts10077


Body:కళాకారులకు ఓరుగల్లు పుట్టినిల్లులాంటిదని...ప్రభుత్వం కళాకారులకు సహాయ సహకారాలు అందిస్తామని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వరంగల్ లో స్పష్టం చేశారు. శ్రీ శాంతిక్రిష్ణ సేవ సమితి 34వ వార్షికోత్సవం సందర్బంగా హన్మకొండ లో అంతర్జాతీయ ఆచార్య ఆరాధానో త్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమనికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ స్పీకర్ మధుసూదనాచారి హాజరయ్యారు. ఈ సందర్బంగా తొమ్మిది రంగాలలో సేవలందించిన వారికి అవార్డుల ప్రధానం చేశారు. ఆలాగే సేవారంగంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు నిర్వాహకులు అవార్డు ప్రధానం చేశారు. ఉమ్మడి రాష్ట్రములో కళాకారులకు అన్యాయం జరిగిందని.....తెలంగాణ వచ్చాక కళాకారులను ప్రోత్సహిస్తున్నామన్నారు. కళాకారులను ప్రోత్సహిస్తున్న నిర్వాహకులను మంత్రి అభినందించారు...స్పాట్


Conclusion:minister errabelli

ABOUT THE AUTHOR

...view details