తెలంగాణ

telangana

Harish Rao on Farm laws: 'కేంద్ర మంత్రి తోమర్​ వ్యాఖ్యలపై ప్రధాని స్పష్టతనివ్వాలి'

By

Published : Dec 26, 2021, 3:06 PM IST

Harish Rao on Farm laws: నూతన సాగు చట్టాలపై కేంద్ర మంత్రి తోమర్​ వ్యాఖ్యలను రాష్ట్ర మంత్రి హరీశ్ రావు ఖండించారు. రైతులను అవమానించేలా కేంద్ర మంత్రి వ్యాఖ్యలున్నాయని అన్నారు. వెంటనే దేశ రైతులకు తోమర్​ క్షమాపణలు చెప్పాలని డిమాండ్​ చేశారు.

minister harish on tomar
మంత్రి హరీశ్​ రావు, కొమురవెల్లి మల్లన్న కల్యాణం, తోమర్​పై హరీశ్​ ఫైర్​

Harish Rao on central minister tomar: సాగుచట్టాలు మళ్లీ తీసుకొస్తామన్న కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్​ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ స్పష్టతనివ్వాలని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు డిమాండ్ చేశారు. సాగుచట్టాలు వెనక్కి తీసుకుంటున్నామంటూ... రైతులకు ప్రధాని క్షమాపణలు సైతం చెప్పాక, మళ్లీ తెస్తామంటూ తోమర్‌ మాట్లాడటంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు. సిద్దిపేట జిల్లాలో కొమురవెల్లి మల్లన్న కల్యాణ మహోత్సవంలో హరీశ్​ పాల్గొన్నారు. మీడియాతో మాట్లాడిన ఆయన.. కేంద్ర మంత్రి వ్యాఖ్యలను ఖండించారు.

సాగు చట్టాలను రద్దు చేస్తున్నామని ప్రధాని మోదీ ప్రకటించారు. ఇప్పుడేమే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి.. సాగు చట్టాలను తీసుకువస్తామని చెబుతున్నారు. ఈ వ్యాఖ్యలపై ప్రధాని స్పష్టత ఇవ్వాలి. యూపీ, పంజాబ్​ ఎన్నికల కోసమే రద్దు ప్రకటన చేసినట్లుగా అనిపిస్తోంది. సాగు చట్టాల విషయంలో రైతులను బాధపెట్టినందుకు వారికి కేంద్ర మంత్రి క్షమాపణలు చెప్పాలి.-హరీశ్ రావు, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి

Harish Rao on Farm laws: ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌ ఎన్నికల కోసమే చట్టాల రద్దు ప్రకటన చేసినట్లుగా కనిపిస్తుందని హరీశ్‌ పేర్కొన్నారు. రైతులను అవమానించేలా కేంద్ర మంత్రి వ్యాఖ్యలున్నాయని అన్నారు. వెంటనే దేశంలోని రైతులకు తోమర్‌ క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు.

రైతులను అవమానించేలా కేంద్ర మంత్రి వ్యాఖ్యలు: హరీశ్‌రావు

ఇదీ చదవండి:PM modi about vittalacharya in mann ki baat : తెలంగాణ వ్యక్తి గురించి మనకీబాత్‌లో ప్రధాని ప్రస్తావన

ABOUT THE AUTHOR

...view details